Asianet News TeluguAsianet News Telugu

today astrology: 2 ఆగస్టు 2020 ఆదివారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి మహిళలకు కుటుంబం నుంచి సహాయసహకారాలు లభిస్తాయి. సామాజిక, సేవా సంస్థలకు ఇతోధిక సాయం చేస్తారు. 

today dinaphalithalu 2nd august 2020
Author
Hyderabad, First Published Aug 2, 2020, 7:40 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 2nd august 2020

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు చిన్ననాటి స్నేహితుల నుంచి ముఖ్యమైన విషయాలను తెలుసుకుని లబ్ది పొందుతారు. కొనుగోలు అమ్మకాలు లాభసాటిగా సాగుతాయి. స్వల్ప ధనలాభం ఉంది. ఆర్ధిక పరిస్థితిలో పురోగతి ఉంటుంది. కొందరి పేర్లు ఉన్నత పదవులకు సిఫార్సు చేయబడతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు  ఉద్యోగులకు చికాకులు సమసిపోతాయి. గతంలో చేసిన పొదుపు ఇప్పుడు ఉపయోగపడుతుంది. మహిళలకు కుటుంబం నుంచి సహాయసహకారాలు లభిస్తాయి. సామాజిక, సేవా సంస్థలకు ఇతోధిక సాయం చేస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు చేపట్టిన వ్యవహారాలలో తొందరపాటు తగదు. నిరుద్యోగులకు ఉద్యోగ సూచన ఉంది. విదేశీయానం వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఇతురులు మీపై నమ్మకాన్ని, గుడ్‌విల్‌ను మరింత బలపరుచుకుంటారు. సంతానం కోసం అధికంగా ఖర్చు చేస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు ప్రతి విషయంలోనూ ఎంతో కొంత సొంత లాభం చూసుకుంటారు. ఆర్థిక ప్రయోజనాలు కలిగిన బాటలో మీ ప్రమేయం లేకుండా పయనిస్తారు. కోర్టు వివాదాలు అనుకూలిస్తాయి.  ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం.పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు స్వల్ప అనారోగ్య సూచన ఉంది. క్రీడా రంగాల వారికి పేరు, ప్రఖ్యాతలు లభిస్తాయి. స్థిరాస్థి కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి. తాకట్టు పెట్టిన వస్తువులను తిరిగి పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. పలు విషయాలలో అనుభవం ముందుకు నడిపిస్తుంది. స్పెక్యులేషన్ లాభసాటిగా సాగుతుంది. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉన్నతాధికారులతో సంబంధాలను బలపరుచుకుంటారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు స్నేహితులు, సన్నిహితులకు మీ వంతు సహాయం చేస్తారు. కుటుంబం పురోభివృద్ధి కోసం విశేషంగా కృషిచేస్తారు. వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటారు.కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు ఆర్ధిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. జీవితభాగస్వామికి విలువైన వస్తువులు బహుమతిగా ఇస్తారు. పొదుపుపై ధ్యాస పెడతారు. మంచి ఫలితాలను సాధిస్తారు. విద్యా విషయాలకు సంబంధించిన కృషి ఫలిస్తుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు ప్రారంభించిన వ్యవహారాలలో జాప్యం చోటుచేసుకుంటుంది. వ్యాపారాలలో రొటేషన్ బాగుంటుంది. రుణాలు తీరి ఊరట చెందుతారు. వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రజా సంబంధాలు మెరుగుపడతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దూర ప్రాంత వ్యవహారాలు అనుకూలిస్తాయి. శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగ పరంగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. కుటుంబసమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు  వృత్తి, వ్యాపారాలలో సామాన్యంగా ఉంటాయి. విదేశీయాన వ్యవహారాలు, దూరప్రయాణాలు అనుకూలిస్తాయి. సంఘంలో పేరు ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. వైరివర్గం చేసే ప్రచారాలు ఏ మాత్రం ప్రభావం చూపించవు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు సంఘంలో పేరు ప్రఖ్యాతలు ఇనుమడిస్తాయి. ఆర్ధిక వ్యవహారాలలో ఒడిదొడుకులు తొలగిపోతాయి. ఇంటర్వ్యూలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. అందుబాటులోకి వచ్చిన ఎదురుచూడని అవకాశాలను నేర్పుగా ఉపయోగించుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios