Asianet News TeluguAsianet News Telugu

today astrology: 28 జులై 2020 మంగళవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి. వ్యక్తిగత విషయాలకు ప్రాముఖ్యత ఇస్తారు. విలువైన వస్తువుల కొనుగోలు కోసం అధికంగా ఖర్చు చేస్తారు.

today dinaphalithalu 28th july 2020
Author
Hyderabad, First Published Jul 28, 2020, 7:13 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 28th july 2020

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి. వ్యక్తిగత విషయాలకు ప్రాముఖ్యత ఇస్తారు. విలువైన వస్తువుల కొనుగోలు కోసం అధికంగా ఖర్చు చేస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించి, అధికంగా లాభం వచ్చే స్వల్పకాలిక వ్యాపారాలలో పెట్టబడులకు ఆసక్తి చూపుతారు. రక్తసంబంధీకులు, సమీప బంధువులను కలుసుకుంటారు.స్పెక్యులేషన్‌ లాభసాటిగా ఉంటుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు సంఘసేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన సమస్యలు పరిష్కారమవుతాయి. జీవితభాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకూలమైన వాతావరణం నూతనోత్సాహాన్ని ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు ముఖ్యమైన వ్యవహారాలలో సొంత నిర్ణయాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. యోగాభ్యాసం, ప్రకృతి వైద్యం ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటారు. గృహ సంబంధిత ఖర్చులు అధికమవుతాయి. గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు వ్యాపారంలో రొటేషన్‌ లాభాలు బాగుంటాయి. కుటుంబంలో ఐకమత్యం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. విలువైన వస్తువుల భద్రతపట్ల అప్రమత్తత వహించాలి. వాహన యోగ సూచన ఉంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు గతంలో చేజారిన అవకాశాలు ఇప్పుడు అందివస్తాయి. శుభాలు పరంపరగా ఉంటాయి. ప్రజాసంబంధాలను బలపరచుకోవడానికి మరింత శ్రమిస్తారు. అనుకూల ఫలితాలను సాధిస్తారు.  కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు  ఆరోగ్య సూత్రాలు క్రమ పద్ధతిలో అమలు పరచాలని నిర్ణయించుకుంటారు. కొనుగోలు, అమ్మకాల కోసం ఎక్కువ నమయం కేటాయిస్తారు.విందు, వినోదాలు, శుభకార్యాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు అనుకూలమైన వాతావరణంలో ఆనందంగా కాలం గడుపుతారు. వాహన సౌఖ్యం పొందుతారు. విలువైన గృహోపకరణాలను నమకూర్చుకుంటారు. బంధువులు శ్రేయోభిలాషులతో ఇష్టాగోష్టి చర్చలు సాగిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు శ్రమకు ఓర్చి కార్యక్రమాలను విజయపథంలో నడిపిస్తారు. మానసిక వత్తిడి నుంచి బయట పడతారు. సంతాన విద్యా విషయ వ్యవహారాల పట్ల ఎక్కువ అసక్తిని కనబరుస్తారు.  కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు ముఖ్యమైన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి ప్రశంసలు పొందుతారు. నూతన ప్రదేశాలను సందర్శిస్తారు. అన్ని విషయాలలో భద్రతకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. మంచి పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. క్రయ, విక్రయాలలో లాభాలు పొందుతారు. బంధువుల ద్వారా ధన, వన్తు లాభాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి.  ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios