Asianet News TeluguAsianet News Telugu

today astrology: 27 జులై 2020 సోమవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి స్థిరాన్తులకు నంబంధించిన వ్యవహరాలలో అనుకూలమైన వార్తలు వింటారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలిస్తుంది.

today dinaphalithalu 27th july 2020
Author
Hyderabad, First Published Jul 27, 2020, 7:07 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 27th july 2020

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు కార్యాలయంలో అధికారుల నుంచి మందలింపులు తప్పకపోవచ్చు. రక్త సంబంధీకులు, దాయాదుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. స్పెక్యులేషన్ లాభసాటిగా సాగుతుంది. గతంలో ఇచ్చిన బుణాలు వసూలు అవుతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు వ్యాపారాలలో పెట్టుబడులు వాయిదా వేయడం మంచిది. మీరు చెప్పిన పనికి ఎదుటి వారి నుంచి ప్రతిస్పందన బాగుంటుంది. స్థిరాన్తులకు నంబంధించిన వ్యవహరాలలో అనుకూలమైన వార్తలు వింటారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలిస్తుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు నిదానమే ప్రధానమన్న సూక్తిని గుర్తుంచుకోవాలి. ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి. ప్రకటనలు, మీడియాకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉంటాయి. ఇరుగుపొరుగు వారితో వివాదాలు తప్పకపోవచ్చు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు స్వల్ప ధనలాభ సూచన ఉంది. దూరప్రాంతాల్లోని వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వాక్చాతుర్యంతో ఎదుటివారికి ఆకట్టుకుని పనులను సానుకూల పరచుకుంటారు. మంచిరోజులు వచ్చినట్లుగా తోస్తుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు కీలక వ్యవహారాలో ఊరట చెందుతారు. శారీరక రుగ్మత మానసిక ఆందోళనకు కారణం అవుతుంది. అకారణ కలహాలను ఆదిలోనే తుంచివేయడం ఉత్తమం. శక్తికి మించి ఓ వ్యక్తిని ఆదుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు జీవితభాగస్వామి సహాయ సహకారాలను సంపూర్ణంగా అందుకుంటారు. ఉచిత సలహాలు ఇచ్చేవారు ఎదురుపడతారు. స్థాయి తక్కువ వ్యక్తులతో పోరాడాల్సి వస్తుంది. ఆర్ధిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు  స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. పట్టుదలతో శ్రమించి అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎంతో ఓర్పును కనబరుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారికి దూపం వేయడం వల్ల సానుకూల ఫలితాలు ఉంటాయి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు సాంకేతిక విద్యను ఆధారంగా ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చేసిన చిన్నపాటి సహాయాన్ని భూతద్దంలో చూపించే సన్నిహితులు అధికమవుతారు. పొదుపు పాటిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు ఆర్థిక వురోగతి సాధించడానికి చేసే శ్రమ ఫలిన్తుంది. నిస్కారణమైన విమర్శలు, అపవాదులు తప్పక పోవచ్చు. జీవితభాగస్వామితో స్వల్ప విభేధాలు సూచిస్తున్నాయి. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉన్నట్లు తోస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. నిష్కారణ భయం వేధిస్తుంది. డబ్బు ఖర్చు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు  ఆర్ధిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఎంతోకాలంగా ఉన్న ఒక కోరిక ఈ రోజు నెరవేరుతుంది. రుణ ఒత్తిడులు అధికమవుతాయి. మధ్యవర్తిగా ఉండి మాట్లాడేదానికన్నా దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు కార్యాలయంలో ఉన్నతాధికారుల మెప్పు పాందుతారు. వాహన సౌఖ్యం పొందుతారు. ఖర్చులు, ఆదాయం పరిశీలించుకొంటారు. తల్లితరపు బంధువులకు నహాయాన్ని అందిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios