Asianet News TeluguAsianet News Telugu

today astrology: 26 జులై 2020 ఆదివారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి సంతాన పురోభివృద్ధి బాగుంటుంది. దూర ప్రాంతాల నుంచి మంచి సమాచారం అందుకుంటారు.

today dinaphalithalu 26th july 2020
Author
Hyderabad, First Published Jul 26, 2020, 7:36 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 26th july 2020

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు  శ్రమకు అదృష్టం తోడవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా సందర్భోచితమైన నిర్ణయాలు తీసుకుని లబ్ది పొందుతారు. సంతాన పురోభివృద్ధి బాగుంటుంది. దూర ప్రాంతాల నుంచి మంచి సమాచారం అందుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు సమాజంలోని ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు, స్నేహాలు మరింత బలపరచుకునే ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. కుటుంబ వాతావరణం ఉత్సాహ పూరితంగా ఉంటుంది. గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటాన్ని ఎర్రని పూలతో పూజించండి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు నేర్పుగా వ్యవహరించి సానుకూల ఫలితాలు సాధిస్తారు. భవిష్యత్తు బంగారు బాటగా కనబడుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. పనిచేసే చోట, కార్యాలయంలో అధికారుల మెప్పును పొందుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వ్యాపార లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. పొదుపు పథకాలలో ముందడుగు వేస్తారు. తల్లిదండ్రులు, కుటుంబంలోని పెద్దల అవసరాలను సకాలంలో తీర్చి మానసిక ప్రశాంతతను పొందుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు శ్రమకు తగిన ప్రతిఫలాలను అందుకుంటారు. శుభకార్యాలు, విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు దీర్ఘకాలిక మిత్రత్వానికి దారి తీస్తాయి. ఓర్పు, సహనంతో వ్యవహరించి మన్ననలు పొందుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం ఉత్తమం. నిపుణుల సలహాలను పాటించి లాభపడతారు. సమృద్ధికరమైన ఆర్థికవనరులు సంతోషానికి కారణమవుతాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. మానసిక ప్రశాంతత పొందుతారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. పనిచేసే చోటు, కార్యాలయంలో ప్రతిపాదనలను ఏకగ్రీవంగా ఆమోదిస్తారు. మాటతీరుతో పదుగురి మెప్పును పొందుతారు. పుస్తక పఠనం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం. సౌందర్య సాధనాల పట్ల ఆకర్షితులవుతారు. దూరప్రాంతాలలోని బంధువులు, ఆప్తులతో సంభాషణలు సాగిస్తారు.  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు శత్రువుల బలహీనతలు గుర్తించి నేర్పుగా వ్యవహరిస్తారు. దీర్ఘకాలిక ఆశయాలను నెరవేర్చుకోవడానికి కీలక స్థానాలలో ఉన్నత వ్యక్తులతో సంభాషణలు, సంప్రదింపులు సాగిస్తారు. స్పెక్యులేషన్‌ లాభిస్తుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు క్రమశిక్షణకు అధితక ప్రాధాన్యతనిస్తారు. సంతాన పురోగతి బాగుంటుంది. ఆధ్యాత్మిక ప్రసంగాల పట్ల ఆకర్షితులు అవుతారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఇంటాబయటా మీదే పై చేయిగా ఉంటుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు మిత్రబృందాలతో చర్చలు సాగిస్తారు. శుభకార్యాలు, విందు, వినోద కార్యక్రమాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. ఏ పనిని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు  గతంలో మీకు సానుకూల పడని వ్యవహారాలు నేడు సానుకూల పడతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో మీకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios