Asianet News TeluguAsianet News Telugu

today astrology: 24 జూన్ 2021 గురువారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. 

today dinaphalithalu 24th june 2021
Author
Hyderabad, First Published Jun 24, 2021, 7:16 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 24th june 2021

గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆప్తుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు  సాదాసీదాగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని ఒడిదుడుకులు. ప్రయాణాలలో మార్పులు ఉండవచ్చు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు  భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.  పాతబాకీలు  అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు  కొత్త హోదాలు. కీలక నిర్ణయాలు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థికపరమైన ఇబ్బందులు.  వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగులు  బాధ్యతలలో అప్రమత్తంగా మెలగాలి. అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు బంధువులతో తగాదాలు. ముఖ్యమైన పనులు నిదానిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలలో  కొన్ని వివాదాలు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు  సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అప్రయత్న కార్యసిద్ధి. ఉద్యోగాల్లో మరిన్ని బాధ్యతలు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. దూరప్రయాణాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు. అనారోగ్య సూచనలు. కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలలో సామాన్యలాభాలు. ఉద్యోగులు బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు కొత్త వ్యక్తుల పరిచయాలు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి.  వాహనాలు, భూములు కొంటారు. ఆకస్మిక ధనలబ్ధి.  ఉద్యోగులకు సమస్యలు తీరతాయి. వ్యాపారాలలో అనూహ్య లాభాలు. దైవచింతన. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు. బంధువుల వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. దూరప్రయాణాలు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు చిన్ననాటి మిత్రుల కలయిక. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలలో  లాభాలు. ఉద్యోగాలలో  ఉన్నతస్థితి. ఆలయాలు సందర్శిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు కొత్త విషయాలు తెలుస్తాయి. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. ఆర్థికాభివృద్ధి. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో  పనిభారం నుంచి విముక్తి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. కొత్త  రుణాలు చేస్తారు.  దైవదర్శనాలు. కుటుంబంలో కొన్ని సమస్యలు. వ్యాపారాలలో నిదానం అవసరం. ఉద్యోగాలలో  అనుకోని మార్పులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 


 

Follow Us:
Download App:
  • android
  • ios