Asianet News TeluguAsianet News Telugu

today horoscope:23 డిసెంబర్ 2020 బుధవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి అనుకోని ధనవ్యయం. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. 

today dinaphalithalu 23rd december 2020
Author
Hyderabad, First Published Dec 23, 2020, 7:13 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 23rd december 2020

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. అనుకోని ధనవ్యయం. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు పరిచయాలు పెరుగుతాయి.ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. పనులలో పురోగతి. మిత్రుల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. నిర్ణయాలలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు. ఆస్తిలాభం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు పనులలో ప్రతిబంధకాలు. రుణదాతల ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపూరితంగా ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. సోదరులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవదర్శనాలు. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వస్తులాభాలు. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. ప్రయాణాలలో ఆటంకాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆటుపోట్లు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనులు మందకొడిగా సాగుతాయి. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవరోధాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు కొత్త పనులు చేపడతారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు వ్యవహారాలలో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు పనుల్లో ప్రోత్సాహం. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. కుటుంబంలో శుభకార్యాలు. ఆస్తిలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios