Asianet News TeluguAsianet News Telugu

today astrology: 21 జూన్ 2020 ఆదివారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. మాట విలువ తగ్గుతుంది. కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయి. లాభాలు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తారు.  ఆదర్శవంతమైన జీవితం కోసం పాటుపడతారు. అన్ని రకాల లాభాలు లభిస్తాయి.

today dinaphalithalu 21st june 2020
Author
Hyderabad, First Published Jun 21, 2020, 7:24 AM IST

  డా. ఎస్‌. ప్రతిభ

 

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : కమ్యూనికేషన్స్ విస్తరించుకునే ఆలోచన. విశ్రాంతికై ప్రయత్నం అధికం అవుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాలు రాకపోవచ్చు. రచయితలకు కొంత ఒత్తిడి ఏర్పడే సమయం. అన్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. మాట విలువ తగ్గుతుంది. కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయి. లాభాలు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తారు.  ఆదర్శవంతమైన జీవితం కోసం పాటుపడతారు. అన్ని రకాల లాభాలు లభిస్తాయి.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సంఘంలో గౌరవం కోసం ఆలోచిస్తారు. శారీరక శ్రమ అధికం అవుతుంది. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అధికారులతో అననుకూలత ఏర్పడుతుంది. చేసే పనుల్లో నైపుణ్యం సాధించాలి. శ్రమకు తగిన ఫలితాలు రాకపోవచ్చు.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : విశ్రాంతికై ఆలోచిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. విహార యాత్రలపై ఆలోచన. పరిశోధకులకు కొంత ఒత్తిడి సమయం. దూరదృష్టి పెంచుకుంటారు. ఎన్ని పనులు చేసినా సంతృప్తి తక్కువగా ఉంటుంది. అనవసర ప్రయాణాలు అధికం అవుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : ఊహించని ఇబ్బందులు వస్తాయి. ప్రయాణాల్లో ప్రమాదాలకు అవకాశం పెరుగుతుంది. లాభాలు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. అన్ని రకాల ఆదాయాలు లాభిస్తాయి. కళాకారులకు కొంత అనుకూలమైన సమయం. ఆశయాలు పూర్తి కావు.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : నూతన పరిచయస్తులకు కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. మోసపోయే సూచనలు ఉన్నాయి. సంఘంలో గౌరవం కోసం పాటుపడతారు. తమకంటే ఉన్నత స్తితిలో ఉన్నవారితో పరిచయాలు స్నేహాను బంధాలు పెంచుకుంటారు. అధికారిక ప్రయాణాలు అవసరం.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. పరిశోధకులకు కొంత అనుకూలమైన సమయం. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఎన్ని పనులు చేసినా సంతృప్తి తక్కువగా ఉంటుంది. మోసపోకుండా జాగ్రత్తపడాలి.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. చిత్త చాంచల్యం పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఊహించని ఇబ్బందులు వస్తాయి. అనవసర ఖర్చులు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త. శ్రమ, కాలం, ధనం, వ్యర్థం అవుతాయి. పరామర్శలు చేస్తారు.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : ఒత్తిడితో సౌకర్యాలను పూర్తిచేస్తారు. గృహ సంబంధ పనుల్లో కొంత జాప్యం ఏర్పడవచ్చు. సామాజిక అనుబంధాలు మెరుగుపరుచుకునే ప్రయత్నం. అత్యాశ అధికం అవుతుంది. నూతన పరిచయస్తుల వల్ల మోసపోయే ప్రమాదం. భాగస్వాములతో తొందరపాటు పనికిరాదు.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : దగ్గరి ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. రుణ సంబంధ ఆలోచన తీరుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పనుల్లో సాధికారత పెరుగుతుంది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : మధ్యవర్తిత్వాలు పనికిరావు. మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. సంతాన ఆలోచనల్లో చికాకులు వస్తాయి. వాక్ చాతుర్యం తగ్గుతుంది. కుటుంబలోపాలు పెరుగుతాయి. క్రియేటివిటీ తగ్గుతుంది. మానసిక ప్రశాంతత పెంచుకోవాలి.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : శ్రమను తట్టుకొని నిలబడగలుగుతారు. అనుకున్న పనులు పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. సౌకర్యాలపై ఆలోచన పెరుగుతుంది. ప్రయాణాల్లో కొంత ఒత్తిడి పెంచుకుంటారు. ఇంటి సంబంధ విషయాల్లో ఆచి, తూచి వ్యవహరించాలి.

Follow Us:
Download App:
  • android
  • ios