Asianet News TeluguAsianet News Telugu

today horoscope: 18 డిసెంబర్ 2020 శుక్రవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు  ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి ఈ రోజు ఆదాయం నిరాశ కలిగిస్తుంది. ఖర్చులు తప్పవు. దూరప్రయాణాలు. బంధువిరోధాలు. వ్యాపారులకు ఒడిదుడుకులు. ఉద్యోగులకు నిరుత్సాహం. 

today dinaphalithalu 18th december 2020
Author
Hyderabad, First Published Dec 18, 2020, 7:14 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 18th december 2020

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. పాతమిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. వాహనయోగం. వ్యాపారులు ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగులు లక్ష్యాలు సాధిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు ఆదాయం నిరాశ కలిగిస్తుంది. ఖర్చులు తప్పవు. దూరప్రయాణాలు. బంధువిరోధాలు. వ్యాపారులకు ఒడిదుడుకులు. ఉద్యోగులకు నిరుత్సాహం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు సన్నిహితులతో విభేదాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.  వ్యాపారులకు సమస్యలు. ఉద్యోగులకు పనిభారం. ఆలయాలు సందర్శిస్తారు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారుల అంచనాలు నిజం కాగలవు. ఉద్యోగాలలో ఉన్నతస్థితి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు మిత్రుల  నుంచి కీలక సమాచారం. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు సమస్యలు తీరతాయి. కళాకారులకు నూతనోత్సాహం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు ఆకస్మిక ప్రయాణాలు. అప్పులు చేస్తారు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారులు ఒత్తిళ్లకు లోనవుతారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.  పనుల్లో అవాంతరాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు.  కుటుంబ, ఆరోగ్యసమస్యలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. అందరిలోనూ గౌరవం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారులకు అనుకూలం. ఉద్యోగులు హోదాలు పొందుతారు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు కుటుంబసభ్యులతో వివాదాలు. అనుకోని ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. ఆదాయం నిరాశ కలిగిస్తుంది. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగాలలో ఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు బంధువుల కలయిక. విందువినోదాలు. కాంట్రాక్టర్లకు అనుకూలం. అదనపు రాబడి దక్కుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి ఉంటుంది. దైవదర్శనాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారులకు చికాకులు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు పుంజుకుంటాయి.  ఉద్యోగులకు  ఉత్సాహం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

  
 


 

  


 

Follow Us:
Download App:
  • android
  • ios