డా. ఎస్‌. ప్రతిభ

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : శరీరంపై ఆసక్తి పెరుగుతుంది. అందంకోసం ఆలోచన చేస్తారు. శ్రమను తట్టుకునే శక్తి తగ్గతుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే ప్రయత్నం చేస్తారు. పనులు పూర్తి చేయాలనే ఆలోచన పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నిస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. విహార యాత్రలపై ఆలోచన పెరుగుతుంది. ప్రయాణాలు విలాసవంతంగా చేస్తారు. అనసవర ఖర్చులకు వెనకాడరు. మృష్టాన్న భోజనం చేయాలనే ఆలోచన పెరుగుతుంది. దుబారా వ్యయం.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. పనులలో ఆసక్తి పెరుగుతుంది. కళానైపుణ్యం పెరుగుతుంది. ఇతరులపై ఆధారపడతారు. అన్ని రకాల అభివృద్ధి పనులు తలపెడతారు. ఆదాయం సద్వినియోగం చేస్తారు.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కళాకారులకు చేసే పనుల్లో అనుకూలత లభిస్తుంది. చేసే ఉద్యోగంలో సంతృప్తి లభిస్తుంది. అన్ని రకాల సంతోషాలు లభిస్తాయి. శారీరక బలం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : పరిశోధకులకు అనుకూలమైన సమయం. పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. విద్య నేర్చుకోవడం వల్ల గౌరవం పెరుగుతుంది. విహార యాత్రలు చేస్తారు. గురువులను ఆశ్రయిస్తారు. శుభకార్యాలకు ధనం సమకూర్చుతారు. సజ్జన సాంగత్యం లభిస్తుంది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : ఊహించని లాభాలు వస్తాయి. ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు. క్రయ విక్రయాల్లో లాభాల దిశవైపు ఆలోచిస్తారు. శ్రమలేని సంపాదనపై దృష్టి పెడతారు. పరామర్శలు చేస్తారు. వైద్యశాలల సందర్శనం ఉంటుంది.

 తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సామాజిక అనుబంధాలు విస్తృతి చెందుతాయి. భాగస్వాములతో అనుకూలత పెరుగుతుంది. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం. వ్యాపార ప్రయాణాలు చేస్తారు. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  పోటీల్లో గెలుపుకై ఆలోచిస్తారు. అనసవర ఒత్తిడి పెరుగుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పుల బాధలు పెరుగుతాయి. అపకీర్తి వస్తుంది. వృత్తి విద్యలలో రాణింపుకు ప్రయత్నిస్తారు.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సృజనాత్మకత పెరుగుతుంది. మానసిక ఒత్తిడికి ప్రయత్నిస్తారు. చిత్త చాంచల్యం తగ్గుతుంది. కళాకారులకు అనుకూలమైన సమయం. సంతానవర్గ సమస్యలు తీరే దారులు కనబడతాయి. ఉన్నత విద్యలపై ఆసక్తి పెరుగుతుంది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సాధారణ విద్యలు పూర్తిచేస్తారు. సౌకర్యాలపై దృష్టి సారిస్తారు. గృహ సంబంధ విషయాల్లో ఆనందం కలుగుతుంది. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. ఆహారంలో సమయ పాలన మంచిది. మాతృసబంధీకులతో అనుకూలత పెంచుకునే ప్రయత్నం.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులు తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు సంపాదిస్తారు. స్త్రీలతో అనుకూలత పెరుగుతుంది. వారి సహాయ సహకారాలు లభిస్తాయి.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : వాక్ చాతుర్యం పెరుగుతుంది. కుటుంబ సంబంధాలు మెరుగుపరుచుకుంటారు.  నిల్వధనం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆభరణాలవైపు దృష్టి సారిస్తారు. మధ్యవర్తిత్వాలు పయోగపడతాయి. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. శ్రమ తెలియకుండా చూసుకుంటారు.