Asianet News TeluguAsianet News Telugu

today astrology: 16మార్చి 2020 సోమవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి అనుకున్న పనులు పూర్తి చేసుకుంటారు. వైద్య శాలల సందర్శనం ఉంటుంది.  శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది.  అనారోగ్య సూచనలు ఉన్నాయి.  వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం. అన్ని రకాల ఆదాయాలపై దృష్టి సారిస్తారు.

today dinaphalithalu 16th march 2020
Author
Hyderabad, First Published Mar 16, 2020, 7:07 AM IST

డా. ఎస్‌. ప్రతిభ
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం రాకపోవచ్చు. అనుకున్న పనులు పూర్తి చేయడంలో కొంత అధిక శ్రమ అవసరం అవుతుంది. అన్ని పనులలోనూ సంతృప్తి తక్కువగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాలనే ఆలోచన పెరుగుతుంది. వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి.

 వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) :  అనుకున్న పనులు పూర్తి చేసుకుంటారు. వైద్య శాలల సందర్శనం ఉంటుంది.  శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది.  అనారోగ్య సూచనలు ఉన్నాయి.  వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం. అన్ని రకాల ఆదాయాలపై దృష్టి సారిస్తారు.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. సంఘంలో గౌరవం పెంచుకునే ఆలోచన చేస్తారు. భాగస్వామ్య ఒప్పందాలు పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు.  నూతన పరిచయాలు లాభిస్తాయి.  ఆర్థిక కొరత ఏదో రూపంలో తీరుతుంది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పోటీలలో గెలుపుకై అధిక ప్రయత్నం చేస్తారు. శతృవులపై విజయం సాధిస్తారు. ఎవరో ఒకరు ఏదో రూపంలో బహుమతులు అందజేస్తారు. రుణ సంబంధ ఆలోచనలు తగ్గుతాయి. తమకై తమకు శ్రద్ధ పెరుగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : సంతాన సంబంధ ఆలోచనల్లో కొంత ఒత్తిడి అధికం అవుతుంది. మానసిక ప్రశాంతతను కోల్పోతారు. క్రియేటివిటీ పెంచుకునే ప్రయత్నం చేయాలి. దైవకార్యాలలో అధికంగా సమయాన్ని కేటాయించాలి. ధనాన్ని వాటికోసం కేటాయించాలి. ఒత్తిడి తగ్గించుకునే ఆలోచన మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సౌకర్యాలు కావాలనే ఆలోచన పెరుగుతుంది. వాటికోసం అధిక ప్రయత్నం చేస్తారు. ప్రయాణాలలో ఒత్తిడి పెరుగుతుంది. అందరికన్నా ఉన్నత స్థాయిలో ఉండాలనే ఆలోచన చేస్తారు. గృహ నిర్మాణం కోసం చేసే పనులలో తొందరపాటు పనికిరాదు. జాగ్రత్త అవసరం.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) :  అందరి సహాయ సహకారాలు లభిస్తాయి.  పరక్రమంతో పనులు పూర్తి చేస్తారు. శత్రువులపై విజయంకోసం ఆరాటపడతారు. కమ్యూనికేషన్స్ విస్తరించుకునే ప్రయత్నం. మీడియా రంగం వారికి అనుకూలమైన సమయం. విద్యార్థులకు కొంత కష్టసమయంగా చెప్పవచ్చు.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  ఆర్థిక నిల్వలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో అనుకూల వాతావరణం కోసం ప్రయత్నం చేస్తారు. మాట విలువ పెరుగుతుంది. వాగ్దానాలు నెరవేరుతాయి. అన్ని పనులలోనూ సంతృప్తి లభిస్తుంది. అందరితో కలిసిమెలిసి ఉంటారు.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : శారీరక శ్రమ అధికం అవుతుంది. అనుకున్న పనులు పూర్తి చేయడంలో కొంత శ్రమ అధికం అవుతుంది. ప్రణాళికలకు అనుగుణంగా సమయాన్ని కేటాయించుకునే ప్రయత్నం చేయాలి. తొందరపాటు పనులు, నిర్ణయాలు పనికిరావు. శ్రమకు తగిన గుర్తింపుకోసం ప్రయత్నం ఉంటుంది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. పాదాల నొప్పులు వస్తాయి.  విహార యాత్రలు చేయాలనే ఆలోచన బాగా పెరుగుతుంది. దానధర్మాలకై డబ్బును ఖర్చు చేయడం మంచింది.  ఇతరులకోసం ఆదాయాన్ని ఖర్చు చేసే సందర్భంలో ఒకసారి ఆలోచించాలి.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం పెరుగుతుంది.  అన్ని రకాల ఆదాయాలు లభిస్తాయి. వచ్చిన లాభాలు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తారు.  లాభాలపై ఆలోచన ఎక్కువ అవుతుంది. అన్ని పనులలో సంతోషంగా కాలం గడుపుతారు.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సాంఘిక గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కీర్తి ప్రతిష్ఠలపై దృష్టి సారిస్తారు.  ఉద్యోగ సంబంధ ఒత్తిడి అధికం అవుతుంది. తోటి వారితో కలిసి మెలిసి ఉండేలా ప్రయత్నం చేయాలి.  అన్ని పనుల్లో సంతోషం లభిస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios