Asianet News TeluguAsianet News Telugu

today astrology:14 మే 2021 శుక్రవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. యత్నకార్యసిద్ధి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాల సందర్శనం. 

today dinaphalithalu 14th may 2021
Author
Hyderabad, First Published May 14, 2021, 7:11 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 14th may 2021

గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. కష్టపడ్డా ఫలితం కనిపించదు. పనుల్లో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. విద్యార్థులకు ఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. యత్నకార్యసిద్ధి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాల సందర్శనం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు ప్రయాణాలు వాయిదా. బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. ఆదాయం నిరాశ కలిగిస్తుంది. అనారోగ్యం. ఇంటాబయటా చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యం. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు కార్యక్రమాలు  విజయవంతంగా పూర్తి. అందరిలోనూ గుర్తింపు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు మీ సత్తా చాటుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కాంట్రాక్టులు పొందుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా. భూవివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. మానసిక అశాంతి. ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. బంధువులను కలుస్తారు. ప్రయత్నాలు మందగిస్తాయి. కార్యక్రమాలలో అవరోధాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి. ముఖ్య నిర్ణయాలు. కార్యజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు వ్యూహాలు అమలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు కుటుంబంలో చికాకులు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. దైవదర్శనాలు. అనారోగ్యం. సోదరులతో కలహాలు. అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు కార్యక్రమాలు నత్తనడకన సాగుతాయి. కుటుంబసభ్యలతో విభేదాలు. దైవచింతన. భూవివాదాలు.  వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. విద్యార్థులకు శ్రమాధిక్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు కార్యజయం. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి లాభం. వాహనయోగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 


 

Follow Us:
Download App:
  • android
  • ios