Asianet News TeluguAsianet News Telugu

today astrology: 14 మే 2020 గురువారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  వృత్తి ఉద్యోగాదుల్లో తొందరపాటు పనికిరాదు. అధికారులతో అనుకూలత పెంచుకోవాలి. అధికారిక ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కీర్తి ప్రతిష్టలు గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. తొందరపాటు పనికిరాదు.

today dinaphalithalu 14th may 2020
Author
Hyderabad, First Published May 14, 2020, 6:57 AM IST

డా. ఎస్‌. ప్రతిభ

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : లాభాలు సద్వినియోగం అవుతాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకున్న  పనులు పూర్తి చేస్తారు. సమిష్టి ఆదాయం లభిస్తుంది. ఆదర్శవంతమైన జీవితం గడుపుతారు. అనుకున్న పనులు పూర్తి చేసే ప్రయత్నం అధికంగా చేస్తారు. అన్ని పనుల్లో ఆనందం కలుగుతుంది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : వృత్తి ఉద్యోగాదుల్లో తొందరపాటు పనికిరాదు. అధికారులతో అనుకూలత పెంచుకోవాలి. అధికారిక ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కీర్తి ప్రతిష్టలు గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. తొందరపాటు పనికిరాదు.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : విద్యార్థులకు అనుకూలమైన సమయం. విద్యార్జనదిశ వైపు ఆశలు పెంచుకుంటారు. పరిశోధకులు తమ ప్రయత్నాలు అటువైపు చేస్తారు. వీరికి అనుకూలమైన సమయం. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. మొత్తంపై అన్ని పనుల్లో సంతృప్తి లభిస్తుంది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : ఊహించని ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి.  పరామర్శలు చేస్తారు. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. అనుకోని ఖర్చులు చేస్తారు. సోదర వర్గీయులతో కొంత అప్రమత్తత అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనుకోని ప్రమాదాలకు అవకాశం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : సామాజిక అనుబంధాలు సంతోషాన్నిస్తాయి. భాగస్వాములతో కొంత జాగ్రత్త అవసరం. నూతన పరిచయస్తులతో మోసపోయే అవకాశం. అందరినీ నమ్మకుండా ఉండడం మంచిది. సంఘంలో గౌరవం పెంచుకోవడం కోసం ఆలోచన చేస్తారు.

కన్య : (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : శత్రువులపై విజయం సాధిస్తారు. అనుకున్న పనిని మొండితనంతో సాధిస్తారు. పోటీలలో గెలుపును సాధిస్తారు. పోటీలలో గెలుపుకోసం ఆలోచిస్తారు. రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఔషధ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సంతాన సమస్యలు అధికం అవుతాయి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. చిత్త చాంచల్యం పెరుగుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది.  అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ప్రణాళికా బద్ధమైన జీవితం గడుపుతారు.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  సౌకర్యాల వలన ఒత్తిడి పెరుగుతుంది.  సౌకర్యాల కోసం ఆలోచిస్తారు. విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది.  అనుకూలవంతమైన ప్రయాణాలు చేస్తారు. సోదరవర్గీయుల అనుకూలత పెరుగుతుంది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : కమ్యూనికేషన్స్ వల్ల అనుకూలత పెరుగుతుంది. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. అధికారులతో అనుకూలత పెరుగుతుంది. సోదర వర్గీయుల వలన సహాయ సహకారాలు లాభిస్తాయి.  అనుకూలత బాగా పెరుగుతాయి.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : వాగ్దానాలు నెరవేరుతాయి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. కుటుంబం సంబంధాలు మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తారు. నిల్వ ధనాన్ని  పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మధ్యవర్తిత్వాలు నెరవేరుతాయి. వాక్ చాతుర్యం తక్కువౌవుతుంది. నెమ్మదిగా మాట్లాడాలి.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : శారీరక శ్రమ అధికం అవుతుంది. ఎక్కువ  శ్రమకు తక్కువ ఫలితాలు వస్తాయి. పనులలో తొందరపాటు పనికిరాదు. పట్టుదలతో కార్యాచరణ పూర్తి చేస్తారు. ప్రయాణాలలో ప్రమాదాలు జరిగే సూచనలు. శరీరం జాగ్రత్తగా కాపాడుకోవాలి.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : విశ్రాంతికై ప్రయత్నిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. ప్రయాణాలలో ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. పాదాలనొప్పులు పెరుగుతాయి. వైద్యశాలల సందర్శనం చేస్తారు. పరామర్శలకు అవకాశం పెరుగుతుంది. తొందరపాటు పనికిరాదు.

Follow Us:
Download App:
  • android
  • ios