Asianet News TeluguAsianet News Telugu

today horoscope: 14 డిసెంబర్ 2020 సోమవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు కార్యజయం. ఆస్తి, ధనలాభాలు. పాతమిత్రుల నుంచి ఆహ్వానాలు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. 

today dinaphalithalu 14th december 2020
Author
Hyderabad, First Published Dec 14, 2020, 7:06 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 14th december 2020

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు పనుల్లో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. బంధువిరోధాలు. ఆరోగ్యసమస్యలు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో అవరోధాలు. శ్రమ మరింత పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు కార్యజయం. ఆస్తి, ధనలాభాలు. పాతమిత్రుల నుంచి ఆహ్వానాలు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వాహనయోగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు పనులు చకచకా పూర్తి చేస్తాయి. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం. విద్యార్థులకు కొత్త ఆశలు. దైవదర్శనాలు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు వ్యయప్రయాసలు. మిత్రులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. శ్రమా«ధిక్యం. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు కొత్త విషయాలు తెలుసుకుంటారు. పోటీపరీక్షల్లో విజయం. ఆప్తులతో సఖ్యత. విలాసవంతంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వ్యయప్రయాసలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు రాబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. సంఘంలో విశేష గౌరవం. భూలాభాలు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు సోదరులతో వివాదాలు నెలకొంటాయి. రాబడి కంటే ఖర్చులు అధికం. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. స్వల్ప అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు కార్యజయం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వాహనయోగం. విద్యార్థులకు కార్యసిద్ధి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు. కాంట్రాక్టులు దక్కుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు శ్రమ ఫలిస్తుంది. నూతన విద్యావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. యత్నకార్యసిద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. బంధువిరోధాలు. కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు. విద్యార్థులకు గందరగోళం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios