Asianet News TeluguAsianet News Telugu

today Horoscope: 12 డిసెంబర్ 2020 శనివారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  ఈ రోజు పనుల్లో విజయం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వస్తులాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. 

today dinaphalithalu 12th december 2020
Author
Hyderabad, First Published Dec 12, 2020, 7:14 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 12th december 2020

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు పనుల్లో విజయం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వస్తులాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు దక్కవచ్చు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు పనుల్లో ఆటంకాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో స్వల్ప వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఆటుపోట్లు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో సత్సంబంధాలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు రుణయత్నాలు సాగిస్తారు. ప్రయాణాలలో మార్పులు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటాయి. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు  ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. ఆప్తుల సలహాలు పాటిస్తారు. దైవదర్శనాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుమణుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు పరిస్థితులు అంతగా అనుకూలించవు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు. దైవదర్శనాలు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. ఆశ్చర్యకర సంఘటనలు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని వివాదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేయాల్సిన పరిస్థితి. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు శ్రమ పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. ఆరోగ్య సమస్యలు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios