Asianet News TeluguAsianet News Telugu

today astrology: 11 మే 2020 సోమవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి చేసే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. కొత్త కొత్త ఆలోచలతో పనులు పూర్తిచేస్తారు. ఖర్చు పెట్టే విషయంలో కూడా నూతన ఆలోచనలు వస్తాయి. విలాసాలు, విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణ సౌకర్యాలు పెంచుకుంటారు. విశ్రాంతిపై ఆలోచన పెరుగుతుంది.

today dinaphalithalu 11th may 2020
Author
Hyderabad, First Published May 11, 2020, 8:25 AM IST

డా. ఎస్‌. ప్రతిభ
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : అలంకరణలపై దృష్టి పెరుగుతుంది. శారీరక సౌఖ్యం గురించి ఆలోచిస్తారు. కొద్ది శ్రమకే శరీరం అలసిపోతుంది. ఎక్కువ సమయం విశ్రాంతికై ప్రయత్నిస్తారు. ఆలోచనలకు అనుగుణంగా శరీరం పనిచేయలేదు. శ్రమకు ఇష్టపడకుండా ఉంటారు. ప్రణాళికలు మార్చుకునే ప్రయత్నం చేస్తారు.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : చేసే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. కొత్త కొత్త ఆలోచలతో పనులు పూర్తిచేస్తారు. ఖర్చు పెట్టే విషయంలో కూడా నూతన ఆలోచనలు వస్తాయి. విలాసాలు, విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణ సౌకర్యాలు పెంచుకుంటారు. విశ్రాంతిపై ఆలోచన పెరుగుతుంది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : పెద్దలనుంచి ఆశీస్సులు లభిస్తాయి. అన్ని పనుల్లో అనుకూలత పెరుగుతుంది. లాభాలు సద్వినియోగం చేస్తారు. నిరంతరం ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ధన విషయంలో ఆసక్తి పెరుగుతుంది. కొంత అసంతృప్తికి లోనయ్యే అవకాశం పెరుగుతుంది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : ఉద్యోగస్తులకు కొంత ఊరట కలుగుతుంది. చేసే పనుల్లో నైపుణ్యం పెరుగుతుంది. పనులలో సంతోషాన్ని వెతుక్కుంటారు. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. అనుకున్న పనులు పూర్తి చేసే ప్రయత్నంలో ఉంటారు. మొత్తంపై ఉద్యోగస్తులు ఎక్కువ సంతోషంతో ఉంటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : విద్యార్థులకు ఉన్నత విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. ఎప్పుడూ ఏవో పనులు చేస్తూ ఉంటారు. పరిశోధనలపై శ్రద్ధ చూపిస్తారు. కొత్త కొత్త విషయాలు కనుగొనే ప్రయత్నం చేస్తారు. దూర దృష్టి అధికం అవువుతుంది. చేసే అన్న పనుల్లోనూ సంతోషం, సంతృప్తి కలిగి ఉంటారు.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : ఊహించని ఇబ్బందులు వచ్చే సూచనలు. వైద్యశాలల సందర్శనకై ప్రయత్నం చేస్తారు. అనవసర ఖర్చులు చేసే అవకాశం ఉంటుంది. శ్రమలేని సంపాదన వచ్చే సూచనలు. అనవసర విషయాల్లో తలదూర్చకుండా ఉండడం మంచిది. వ్యతిరేక ఆలోచనలపై దృష్టి పెట్టకపోవడం మంచిది.

 తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సామాజిక అనుబంధాల్లో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. నూతన పరిచయాల వల్ల ఒత్తిడులు వచ్చే సూచనలు. మోసపోయే అవకాశం ఉంటుంది. భాగస్వాములతో ఆచి, తూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  పోటీల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు. శత్రువులపై విజయం కోసం ప్రయత్నం చేస్తారు. రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం మంచిది. అపల బాధలు పెరుగుతూ ఉంటాయి. అనుకున్న పనులు పూర్తి చేయడంలో కొంత జాప్యం అవుతుంది. తొందరపాటు వ్యవహారాలు పనికిరావు.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సృజనాత్మకత పెరుగుతుంది. నూతన పనులపై దృష్టి పెరుగుతుంది. కళారంగాల వారికి అనుకూలమైన సమయం. కొత్త కొత్త ఆలోచనలతో పనులు పూర్తి చేస్తారు. సంతానం విషయంలో కొంత సంతోషం లభిస్తుంది. చిత్త చాంచల్యం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సౌకర్యాలపై దృష్టి పెరుగుతుంది. సౌకర్యాల వల్ల అనవసర ఇబ్బందులు వచ్చే సూచనలు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. స్త్రీల వల్ల అనుకూలత పెరిగే సూచనలు.  ఏ విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : సహకారం లభిస్తుంది. స్త్రీలతో అనుకూలత పెంచుకునే ప్రయత్నం వారి సహకారాలు లభిస్తాయి. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. రచయితలకు అనుకూలమైన సమయం. కమ్యూనికేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : కుటుంబ సభ్యులతో అనుకూలత పెరుగుతుంది. నిల్వధనాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక సమస్యలు తొలగించుకునే ప్రయత్నం. మధ్యవర్తిత్వాలు అనుకూలిస్తాయి. మాట విలువ పెరుగుతుంది. చమత్కారంగా మాట్లాడి పనులు పూర్తిచేసుకుంటారు.

Follow Us:
Download App:
  • android
  • ios