Asianet News TeluguAsianet News Telugu

today horoscope: 09 మార్చి 2021 మంగళవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. బంధువుల నుంచి ఒత్తిడులు. అనుకున్న పనులు ముందుకు సాగవు. వ్యాపార విస్తరణ యత్నాలు వాయిదా. 

today dinaphalithalu 09th march 2021
Author
Hyderabad, First Published Mar 9, 2021, 7:14 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 09th march 2021

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు పనుల్లో అవాంతరాలు. అప్పులు చేస్తారు. దూరప్రయాణాలు చేస్తారు. అనారోగ్య సూచనలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. బంధువుల నుంచి ఒత్తిడులు. అనుకున్న పనులు ముందుకు సాగవు. వ్యాపార విస్తరణ యత్నాలు వాయిదా. ఉద్యోగాలలో వివాదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. సమాజంలో ప్రత్యేక గౌరవం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. భూములు, వాహనాలు కొంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు పనుల్లో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు భూవివాదాలు పరిష్కారం. శుభవార్తలు. వాహనయోగం. బంధువులతో సత్సంబంధాలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు ముఖ్య నిర్ణయాలు వాయిదా. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. ఆలయ దర్శనాలు. వ్యాపార విస్తరణ యత్నాలలో ఆటంకాలు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. ధన, వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సానుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు  వ్యవహారాలు మందగిస్తాయి. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు సన్నిహితులతో విభేదాలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 


 


 

Follow Us:
Download App:
  • android
  • ios