Asianet News TeluguAsianet News Telugu

Today astrology: 03 డిసెంబర్ 2021 శుక్రవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. 

Today dinaphalithalu 03rd december 2021
Author
Hyderabad, First Published Dec 3, 2021, 4:57 AM IST

 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు పనులు సకాలంలో పూర్తి. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. భూలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు కొత్త వ్యవహారాలలో పురోగతి. కోర్టు కేసుల పరిష్కారం. శుభవార్తలు వింటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు రుణాలు చేస్తారు. శ్రమ పడినా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు శుభకార్యాలలో పాల్గొంటారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. కుటుంబంలో సంతోషకరంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యసాధన. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. భూవివాదాలు పరిష్కారం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. కాంట్రాక్టులు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు ముఖ్యమైన పనులలో జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు ముఖ్య వ్యవహారాలు ముందుకు సాగవు. దూరప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని వివాదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య

 

Follow Us:
Download App:
  • android
  • ios