Asianet News TeluguAsianet News Telugu

today astrology: 23 జనవరి 2020 గురువారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో జాగ్రత్తలు అవసరం. సంఘంలో గౌరవం కోసం పాటుపడతారు. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సామాజిక అనుబంధాలు పెద్ద ఎత్తున పెంచుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.

today dina phalithalu january 23rd 2020
Author
Hyderabad, First Published Jan 23, 2020, 8:12 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

డా. ఎస్‌. ప్రతిభ

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : : లాభాలు కొంత సంతృప్తినిస్తాయి. స్త్రీల ద్వారా అనుకూలత ఏర్పడుతుంది. కళాకారులతో ఒక సృజనాత్మక బయటికి వస్తుంది. వచ్చిన లాభాలు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తారు. చేసే అన్ని పనుల్లోనూ బేరసారాలు ఆలోచన పెరుగుతుంది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : : అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో జాగ్రత్తలు అవసరం. సంఘంలో గౌరవం కోసం పాటుపడతారు. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సామాజిక అనుబంధాలు పెద్ద ఎత్తున పెంచుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : విహార యాత్రలపై దృష్టి సారిస్తారు. దూర ప్రయాణాలపై ఆసక్తి కనబరుస్తారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. శ్రమ తక్కువ ఫలితాలు ఎక్కువగా వస్తాయి. చేసే అన్ని పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి అయిపోతాయి. సంతృప్తి లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : ఊహించని ఇబ్బందులు వస్తాయి. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు సంపాదిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. ఆదాయం ఉన్నా సమయానికి వినియోగపడదు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.వాహన సౌకర్యం లభిస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. నూతన పరిచయస్తులతో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారస్తులు సమయానుకూలంగా వ్యవహరిస్తారు. భాగస్వామ్య అనుబంధాలు విస్తరిస్తాయి. కళాకారులు అభివృద్ధి చెందుతారు. కళలపై ఆసక్తి పెరుగుతుంది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : పోటీల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు. ఋణ సంబంధ ఆలోచనలు విస్తరిస్తాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. పనుల్లో ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ప్రణాళికా బద్ధంగా ఆలోచనలు పూర్తిచేస్తారు. తోటి కళాకారులతో అన్యోన్యత పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఒత్తిడి మాత్రం తప్పదు.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సృజనాత్మకత పెరుగుతుంది. కళలపై ఆసక్తి ఉంటుంది. కళాకారులకు అనుకూల సమయం. సంతాన సమస్యలు తీరుతాయి. సంతానం కోసం సంతోషంగా సమయాన్ని వెచ్చిస్తారు. మానసిక ఒత్తిడి తగ్గి ఉల్లాసంగా ఉత్సాహంగా సమయాన్ని గడుపుతారు. సమయం గురించి ఆలోచన ఉండదు

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  సౌకర్యాల వల్ల సంతోషం కలుగుతుంది. గృహ నిర్మాణ పనుల్లో దృష్టి సారిస్తారు. పనుల్లో ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ప్రయాణాల వల్ల ఆనందం కలుగుతుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. విహార యాత్రలపై దృష్టి సారిస్తారు. అన్ని పనుల్లో సంతోషం లభిస్తుంది

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : కళాకారుల సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. ఆలోచనల్లో ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. స్త్రీ వర్గీయులతో అనుకూలత ఏర్పడుతుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఆనందకరంగా సమయాన్ని గడుపుతారు

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : వాక్ చాతుర్యం పెరుగుతుంది. ఎదుటివారిని ఆకర్షించే మాటలు మాట్లాడతారు. మధ్యవర్తిత్వాలు అనుకూలిస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. నిల్వ ధనాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అది కోల్పోకుండా జాగ్రత్త పడాలి. అందరితోను తమ మాటవల్ల సత్సంబంధాలను పెంచుకుంటారు.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : : కొంత శ్రమ అధికం అవుతుంది. తమకోసం తాము ఆలోచించుకుంటారు. శరీరం తొందరగా అలసటకు గురౌతుంది. అలంకరణల పై దృష్టిసారిస్తారు. ప్రణాళికలు పూర్తిచేయడంలో కొంత జాప్యం జరుగవచ్చు. అన్ని పనుల్లోనూ తొందరపాటు పనికిరాదు. దానివల్ల లోపాలు జరిగే అవకాశం.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : విశ్రాంతికి ప్రయత్నిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. విహార యాత్రలపై దృష్టి పెడతారు. దూర ప్రయాణాలు చేస్తారు. ఆహ్లాదకర వాతావరణం ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తారు. అనవసర ఖర్చులు జరుగకుండా జాగ్రత్త పడాలి. పరామర్శలు వచ్చే సూచనలు ఉన్నాయి.

 

Follow Us:
Download App:
  • android
  • ios