today astrology:4 ఏప్రిల్ 2020 శుక్రవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారి కి  అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలున్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. అనుకోని చిక్కులు. విద్యార్థులకు కొంత కష్టకాలం. నిరంతర నామపారాయణ మంచిది.

today dina  phalithalu 3rd april 2020

 డా. ఎస్‌. ప్రతిభ

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : రాజకీయ విషయాలలో ఆసక్తి పెరుగుతుంది. ఒత్తిడి వచ్చే అవకాశాలుంటాయి. అధికారులతో అప్రమత్తంగా మెలగాలి. తొందరపాటు పనికిరాదు. ఉద్యోగస్తులు సంయమనం పాటించడం మంచిది. పనులు పూర్తి చేసే విషయంలో ఆలోచన అవసరం.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలున్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. అనుకోని చిక్కులు. విద్యార్థులకు కొంత కష్టకాలం. నిరంతర నామపారాయణ మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : అనుకున్న పనులు పూర్తి చేయడంలో తొందరపాటు పనికిరాదు. పనులలో ఆలస్యం జరుగుతుంది. వాయిదా వేయడం మంచిది. ఊహించని ఇబ్బందులు, అనుకోని కష్టాలు వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.  శ్రమలేని సంపాదనపై ఆలోచన పెరుగుతుంది.

కర్కాటకం : (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సామాజిక అనుబంధాల్లో ఒత్తిడి తీవ్రమౌతుంది. నూతన పరిచయస్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. పాత పరిచయాలు పెరిగే సూచనలు. జీవిత భాగస్వామ్య అనుబంధాల్లో అప్రమత్తత అవసరం. అన్ని పనుల్లో ఆచి, తూచి వ్యవహరించాలి.

సింహం : (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : పోటీల్లో గెలుపుకై అధిక ప్రయత్నం చేస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. రుణాలు తీర్చే ప్రయత్నంలో ఉంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. శ్రమతో పనులు పూర్తి చేసుకుంటారు.

కన్య : (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. సంతాన సమస్యలు పెరిగే సూచనలున్నాయి. సంతానం విషయంలో ఒత్తిడి తీవ్రం అవుతుంది. క్రియేటివిటీ తగ్గే సూచనలున్నాయి. ఆలోచనలు తగ్గించి నిరంతరం ఏదో ఒక జపం చేసుకోవడం మంచిది.

 తుల : (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) :  కడుపు సంబంధ అనారోగ్యం బయటపడే సూచనలున్నాయి. ఆహారం తీసుకునే విషయంలో తక్కువ తీసుకోవడం మంచిది. జీర్ణక్రియ లోపాలు వస్తాయి. సౌకర్యాలకు దూరంగా ఉండడం మంచిది. ఇంటి పనులు వాయిదా వేయడం మంచిది.

వృశ్చికం : (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  సేవకజన సహకారం లభిస్తుంది. సేవకులతో అనుకూలత పెంచుకుంటారు. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. తోటివారితో అనుబంధాలు బలపడతాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. సమయం సద్వినియోగం చేసుకోవాలి.

ధనుస్సు : (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : మాట విషయంలో తొందరపాటు పనికిరాదు. ఆచి, తూచి మాట్లాడాలి. అపార్థాలకు అవకాశం ఎక్కువ. కుటుంబ సంబంధాలు మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయాలి. నిల్వధనం కోల్పోయే సూచనలు. దానధర్మాలు అధికంగా చేయడం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : శారీరక శ్రమ అధికం అవుతుంది. పనులలో ఒత్తిడి పెరుగుతుంది. ఒకే పనికోసం 3,4సార్లు తిరిగే అవసరం రావచ్చు. సమయం, కాలం, వ్యర్థం అవుతాయి.  ప్రణాళికాబద్ధమైన పనులు పూర్తి చేయలేరు. తొందరపడి పనులు పూర్తి చేయాలి.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : విశ్రాంతి తగ్గుతుంది. పాదాల నొప్పులు వస్తాయి. అనవసర ఖర్చులు చేస్తారు. అనవసర ప్రయాణాలు చేస్తారు. దూర ప్రయాణాలపై ఆలోచన పెరుగుతుంది.  స్థాన చలనం కలుగుతుంది. ఉద్యోగస్తులు మార్పు జరిగే అవకాశం.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సేవకుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. లాభాలు సద్వినియోగం చేసే ప్రయత్నం చేస్తారు. సంతోషం లభిస్తుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఇతరులపై ఆధారపడతారు. కళాకారులకు అనుకూలమైన సమయం. దురాశ పెరుగుతుంది. సమిష్టి ఆశయాలు నెరవేరుతాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios