Asianet News TeluguAsianet News Telugu

today horoscope: 29 జనవరి 2020 బుధవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. మిథున రాశివారు ప్రతిరోజూ తప్పని సరిగా యోగా, కాని లేదా వాకింగ్, ప్రాణాయామాలు చేయడం అలవాటు చేసుకోవాలి. అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి.

today dina phalithalu 29th january 2020
Author
Hyderabad, First Published Jan 29, 2020, 7:35 AM IST

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్త వహించాలి. అన్ని పనుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. విద్య నేర్చుకోవడం వల్ల వచ్చే గౌరవం పెరుగుతుంది. అధికారులతో ఒత్తిడి పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేయడంలో కొంత శ్రమ అవసరం.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ఊహించని ఇబ్బందులు వస్తాయి. అనవసర ఖర్చులు చేస్తారు. వైద్యశాలల సందర్శనం చేస్తారు. లాభనష్టాలపై సమాన దృష్టి ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు.  దూర ప్రయాణాలు చేయాలనే ఆలోచన కొంత పెరుగుతుంది. ఆధ్యాత్మిక యాత్రలపై దృష్టి సారిస్తారు.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : పరస్పర సహకారం లభించదు. సామాజిక అనుబంధాల్లో లోపాలు ఉంటాయి. నూతన పరిచయస్తులతో అప్రమత్తత అవసరం. మోసపోయే అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. యోగా, వాకింగ్ అలవాటు చేసుకోవడం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సంతృప్తి లభిస్తుంది. పోటీల్లో గెలుపు సాధిస్తారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. వృత్తి విద్యలో రాణింపు

సామాజిక అనుబంధాల్లోఒత్తిడి ఏర్పడుతుంది. భాగస్వాములతో ఆచి, తూచి వ్యవహరించాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. సంతానం వల్ల సమస్యలు ఏర్పడతాయి. విద్యార్థులు అధిక శ్రమతో తక్కువ ఫలితాలు సాధిస్తారు. గుర్తింపు ఉండదు. ఆత్మీయత లోపిస్తుంది. పోటీల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు. శ్రమకు తగిన గుర్తింపు అన్ని సమయాల్లో రాకపోవచ్చు.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సౌకర్యాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. తీసుకునే ఆహారం జాగ్రత్తగా ఉండాలి. అజీర్ణ సమస్యలు వచ్చే సూచనలు. ఆహారంలో సమయపాలన అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్త.

మానసిక ఒత్తడి ఎక్కువ అవుతుంది. అనుకున్న పనులు పూర్తి చేయడంలో కొంత జాప్యం జరుగుతుంది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సేవకజన సహకారం లభిస్తుంది. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. దగ్గరి ప్రయాణాలపై దృష్టి పెడతారు. ప్రయాణాల్లో సంతోషం కనిపిస్తుంది. సహోద్యోగులతో అనుకూలత సౌకర్యాలకోసం దృష్టి సారిస్తారు. గృహ సంబంధ విషయాల్లో కొంత పనులు వెనుకబడే సూచనలు ఉన్నాయి.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : మాటల వల్ల ఇబ్బందులు ఎదుర్కొటాంరు. కుటుంబంలో అలజడి ఏర్పడుతుంది. మధ్యవర్తిత్వాలు, వాగ్దానాలు చేయరాదు. నిల్వ ధనాన్ని కోల్పోయే ప్రమాదం. కమ్యూనికేషన్స్ విస్తరించే సూచనలు. సేవకజన సహకారం లభిస్తుంది. సేవకులతో అనుకూలత పెంచుకునే ప్రయత్నం చేస్తారు.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : శారీరక శ్రమ అధికం. పట్టుదలతో కార్యసాధన అవసరం. చిత్త చాంచల్యం పెరుగుతుంది. ప్రణాళికాబద్ధమైన లోపాలు ఉంటాయి. ఆలోచనల్లో మార్పులు వస్తాయి. ఔషధసేవనం తప్పనిసరి.   మాటల్లో తొందరపాటు పనికిరాదు. కుటుంబ సంబంధ విషయాల్లో అప్రమత్తత అవసరం.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : విశ్రాంతికోసం ప్రయత్నిస్తారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. అనవసర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగస్తులను స్థాన చలనం ఉంటుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది.  సుఖంకోసం ప్రయత్నిస్తారు. అన్ని రకాల ఖర్చులు ఉంటాయి. ఇతరులపై ఆధారపడతారు.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : శ్రమలేని సంపాదనపై ఆలోచన పెరుగుతుంది. సమిష్టి ఆశయాలు ఉంటాయి. సేవకులద్వారా ఆదాయాలు వస్తాయి. సంఘవ్యవహారాల్లో జాగ్రత్త అవసరం.  విశ్రాంతి లభించదు. అనారోగ్య సమస్యలు పెరిగే సూచనలు ఉన్నాయి. పాదాల నొప్పులు అధికం అవుతాయి.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. సంఘంలో గౌరవంకోసం ఆరాటం. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ధోరణి ఏర్పడుతుంది. పెద్దలంటే గౌరవం ఉంటుంది. రాజకీయాలపై దృష్టి సారిస్తారు. పెద్దల ఆశీస్సులకోసం అధికంగా ప్రయత్నం చేస్తారు. లాభాలను సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios