today astrology: 18 జనవరి 2020 శనివారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి వాగ్దానాలు చేయరాదు. జాగ్రత్త అవసరం. కుటుంబంలో అనుకోని ఆటంకాలు వస్తాయి. నిల్వ ధనాన్ని కోల్పోతారు. శారీరక శ్రమ కొంత ఉంటుంది. అలసట వస్తుంది. అనవసర ఇబ్బందులు వస్తాయి. జాగ్రత్త అవసరం. దుర్గాపూజ చేసుకోవడం మంచి ఫలితాలనిస్తుంది.

today dina Phalithalu 18th januray 2020

డా. ఎస్‌. ప్రతిభ

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : విద్యార్థులు ఒత్తిడితో లక్ష్యసాధన చేస్తారు. కమ్యూనికేషన్స్‌ వల్ల అనుకూలత పెరుగుతుంది. పరామర్శలు చేస్తారు. ప్రచారాలపై దృష్టి ఏర్పడుతుంది. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రయాణాల వల్ల జాగ్రత్త అవసరం. తోటి వ్యక్తుల సహకారాలు లభిస్తాయి. దుర్గాపూజ చేసుకోవడం మంచి ఫలితాలనిస్తుంది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : వాగ్దానాలు చేయరాదు. జాగ్రత్త అవసరం. కుటుంబంలో అనుకోని ఆటంకాలు వస్తాయి. నిల్వ ధనాన్ని కోల్పోతారు. శారీరక శ్రమ కొంత ఉంటుంది. అలసట వస్తుంది. అనవసర ఇబ్బందులు వస్తాయి. జాగ్రత్త అవసరం. దుర్గాపూజ చేసుకోవడం మంచి ఫలితాలనిస్తుంది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : శారీరక శ్రమ అధికం. ఒత్తిడితో పనులు పూర్తి చేస్తారు. ఆలోచనల్లో మార్పులు వుటాంయి. ప్రణాళికలు అవసరం అవుతాయి. అనుకోని భయాలు ఏర్పడతాయి. చిత్త చాంచల్యం అధికంగా ఉంటుంది. సమయం, కాలం, ధనం వృధా అవుతాయి. దుర్గాపూజ చేసుకోవడం మంచి ఫలితాలనిస్తుంది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. ప్రయాణాలపై ఆసక్తి ఉంటుంది. అనవసర ప్రయాణాలు చేస్తారు. మానసిక వ్యధ అధికం. శ్రమ, కాలం, ధనం వృధాఅవుతుంది. మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. పాదాల నొప్పులు ఉంటాయి. దుర్గాపూజ చేసుకోవడం మంచి ఫలితాలనిస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనుకోని ఒత్తిడులు వస్తాయి. మానసిక ప్రశాంతత లోపం ఉంటుంది. సంఘవ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. దురాశ ఏర్పడుతుంది. ఇతరులపై ఆధారపడతారు. ఉపాసనపై దృష్టి ఏర్పడుతుంది. నిరంతర జపం అవసరం. దుర్గాపూజ చేసుకోవడం మంచి ఫలితాలనిస్తుంది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : ఉద్యోగంలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. అధికారులతో అప్రమత్తత అవసరం. సంఘంలో గౌరవంకోసం ఆరాట పడతారు. ఆశించినంత గౌరవం లభించదు. రాజకీయాలపై ఆసక్తి అంతంత మాత్రంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దుర్గాపూజ చేసుకోవడం మంచి ఫలితాలనిస్తుంది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) :  ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి. ఒత్తిడి అధికంగా ఉంటుంది. దూరదృష్టి అధికంగా ఉంటుంది. పరిశోధనలపై ఆసక్తి తగ్గుతుంది. అనుకున్న పనులు తొందరగా పూర్తికావు. ఇతరులపై ఆధారపడతారు. న్యాయ అన్యాయ విచారణ చేస్తారు. దుర్గాపూజ చేసుకోవడం మంచి ఫలితాలనిస్తుంది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : ఇతరులపై ఆధరపడతారు. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనుకోని ఖర్చులు చేస్తారు. ఊహించని ప్రయాణాలు చేస్తారు. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.  శ్రమ అధికం అవుతుంది. పరాధీనత ఉంటుంది. పరామర్శలు చేస్తారు. దుర్గాపూజ చేసుకోవడం మంచి ఫలితాలనిస్తుంది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సామాజిక అనుబంధాల్లో లోపాలు ఉంటాయి. నూతన పరిచయాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. భాగస్వాములతో జాగ్రత్త అవసరం. పదిమందిలో పలుకుబడికోసం ఆరాట పడతారు. వ్యాపారస్తులు అప్రమత్తత అవసరం. దుర్గాపారాయణలు చేసుకోవడం మంచి ఫలితాలనిస్తుంది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) :  శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఔషధసేవనం చేస్తారు. నష్టవస్తు పరిజ్ఞానం ఉంటుంది. శారీరక బలం పెరుగుతుంది. పోటీల్లో గెలుపు ఉంటుంది. శతృవులపై విజయం సాధిస్తారు. ఋణాల వల్ల ఇబ్బందులు తొలగుతాయి. దుర్గాజపం శ్రేయస్కరం.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. సంతానం వల్ల సమస్యలు ఏర్పడతాయి. ఆత్మీయతలను కోల్పోతారు. సృజనాత్మకత లోపిస్తుంది. దీక్షా సంబంధ ఆలోచనల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. దుర్గాపూజ చేసుకోవడం మంచి ఫలితాలనిస్తుంది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : ఒత్తిడితో సౌకర్యాలు పూర్తి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆహారంలో సమయపాలన పాటిచాలి. అనవసర ఇబ్బందులు ఎదురౌతాయి. మాతృసౌఖ్యం తక్కువగా ఉంటుంది.  విద్యార్థులకు కఠినమైన సమయం. ఆలోచనల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. దుర్గాదేవి పూజ చేసుకోవడం శుభ ఫలితాలనిస్తుంది.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios