ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఆధ్యాత్మిక యాత్రలకై ప్రయత్నిస్తారు. అనుకున్న పనులు పూర్తి కావడంలో ఆలస్యం అవుతుంది. తొందరపాటు పనికిరాదు. సామాజిక అనుబంధాలు అభివృద్ధి చెందే మార్గాలకై అన్వేషిస్తారు. వ్యాపారస్తులకు అప్రమత్తత అవసరం. అన్ని పనుల్లోనూ ఆచి, తూచి వ్యవహరించాలి. 

మేషం :(అశ్వినిభరణికృత్తిక 1వపాదం) :విశ్రాంతికై ఆలోచిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. విహార యాత్రలపై దృష్టి పెరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. విలాసవంతమైన జీవితం కోసం ఆరాటపడతారు. అన్ని పనుల్లో సంతోషం లభిస్తుంది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలురోహిణిమృగశిర 1,2పాదాలు) :ఆధ్యాత్మిక యాత్రలకై ప్రయత్నిస్తారు. అనుకున్న పనులు పూర్తి కావడంలో ఆలస్యం అవుతుంది. తొందరపాటు పనికిరాదు. సామాజిక అనుబంధాలు అభివృద్ధి చెందే మార్గాలకై అన్వేషిస్తారు. వ్యాపారస్తులకు అప్రమత్తత అవసరం. అన్ని పనుల్లోనూ ఆచితూచి వ్యవహరించాలి. 

మిథునం :(మృగశిర 3,4పాదాలుఆర్ద్రపునర్వసు 1,2,3 పాదాలు) :సంఘంలో గౌరవంకోసం ఆరాట పడతారు. పనుల ఒత్తిడి పెరుగుతుంది. కీర్తి ప్రతిష్ఠలవైపు దృష్టి సారిస్తారు. ఉద్యోగస్తులు తమ పనులు పూర్తి చేసుకుంటారు. ఆనందకర వాతావరణం ఉంటుంది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదంపుష్యమిఆశ్లేష) :అనుకున్న పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. అన్ని పనుల్లోను సంతృప్తి లభిస్తుంది. గౌరవం పెరుగుతుంది. ఉన్నత విద్యలకై ఆసక్తి పెంచుకుంటారు. పరిశోధనలను పూర్తి చేస్తారు.

సింహం (మఖపుబ్బఉత్తర 1వ పాదం) :పరామర్శలకు అవకాశం. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. ఊహించని ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి. శ్రమలేని ఆదాయంపై దృష్టి పెడతారు. వ్యాపారస్తులకు గట్టి పోటీఎదురౌతుంది. విద్యార్థులకు కష్టకాలం. అనారోగ్య సూచనలు వస్తాయి. జాగ్రత్త అవసరం.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలుహస్తచిత్త 1,2 పాదాలు) :నూతన పరిచయస్తులతో జాగ్రత్తగా ఉండాలి. మోసపోయే అవకాశం. ఆడవారితో అనుకూలత పెరుగుతుంది. ఆడవారి సహకారం పెరుగుతుంది. సుఖ వ్యాధులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

తుల :(చిత్త 3,4 పాదాలుస్వాతివిశాఖ 1,2,3పాదాలు) శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎంత శ్రమ ఉన్నా పనులను లెక్కచేయరు. పోటీలను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు. సౌకర్యాలపై దృష్టి పెరుగుతుంది. గృహ సంబంధ ఆలోచనలు పెరుగుతాయి. 

వృశ్చికం :(విశాఖ 4వ పాదంఅనూరాధజ్యేష్ఠ) : మానసిక ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం. ప్రణాళికలను అనుకూలమైన సమయం లభించకపోవచ్చు. తాము ఆలోచించింది ఒకటి జరిగేది ఒకటి అవుతుంది. బంధువర్గీయులతో అనుకూలత పెంచుకుంటారు.

ధనుస్సు :(మూలపూర్వాషాఢఉత్తరాషాఢ 1వపాదం) :గృహ నిర్మాణ పనుల్లో కొంత జాప్యం జరుగవచ్చు. తొందరపడి నిర్ణయాలు తీసుకోరాదు. సౌకర్యాలు ఒత్తిడికి గురిచేస్తాయి. మాతృవర్గీయులతో అనుబంధాల్లో జాగ్రత్త అవసరం. సౌకర్యాల వల్ల ఒత్తిడి పెరగవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణంధనిష్ఠ 1,2 పాదాలు) :సేవకజన సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్‌ వల్ల ఒత్తిడి పెరుగుతుంది. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. ప్రణాళికాబద్ధమైన ఆలోచనలు చేస్తారు. పనుల్లో వేగం పెరుగుతుంది. ఆలోచనలకు అనుగుణంగా శ్రమ పెరుగుతుంది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలుశతభిషంపూర్వాభాద్ర 1,2,3పాదాలు) :నిల్వధనం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కోర్టు కేసులు లాంటి వాటిలో వచ్చే ఆదాయాలు. విలువైన వస్తువులపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో కొంత ఒత్తిడి వచ్చే సూచనలు. చాకచక్యంతో పనులు పూర్తి చేసుకుంటారు. మాట విలువ పెంచుకునే ప్రయత్నం.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదంఉత్తరాభాద్రరేవతి) :శరీరంపై ఆలోచన పెరుగుతుంది. అందంకోసం ఆలోచిస్తారు. అనుకున్న పనులు పూర్తి చేయడంలో కొంత ఆలస్యం ఏర్పడవచ్చు. తమకోసం తాము సమయాన్ని కేటాయించుకునే ప్రయత్నం చేస్తారు. సమయం, ధనం వృథా కాకుండా చూసుకోవాలి.

డా.ఎస్.ప్రతిభ