మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. నష్టవస్తుపరిజ్ఞానం. వృత్తి విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. శతృవులపై విజయం. పోటీ ల్లో గెలుపుకై ప్రయత్నం. ఋణ సంబంధ ఆలోచనల్లో మనశ్శాంతి ఉంటుంది. గుర్తింపుకోసం ఆరాటపడతారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. పనుల్లో ఆటంకాలు ఉంటాయి. సృజనాత్మకతను కోల్పోతారు. విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం. ఆత్మీయత తగ్గుతుంది. కళాకారులకు ఒత్తిడి ఏర్పడుతుంది. సంతాన సమస్యలు ఉంటాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సౌకర్యాల వల్లఒత్తిడి ఏర్పడుతుంది. అనవసర ఇబ్బందులు. ప్రయాణాల్లో జాగ్రత్తలు. విద్యార్థులకు ఒత్తిడి ఏర్పడుతుంది. ఆహారంలో సమయపాలన అవసరం. అనారోగ్య  సూచన. అభివృద్ధికోసం ఆలోచన పెరుగుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : మాతృవర్గీయుల సహకారం లభిస్తుంది. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. ఆహ్లాద యాత్రలపై దృష్టి ఉంటుంది. యాత్రలు చేస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం. పఠనాసక్తి పెరుగుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : అనవసర ఖర్చులు ఉంటాయి. చిత్త చాంచల్యం ఉంటుంది. వాగ్దానాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. మాట విలువ తగ్గుతుంది. కుటుంబంలో అసౌకర్యం ఏర్పడుతుంది. నిల్వ ధనాన్ని పెంచుకునే ప్రయత్నం పై దృష్టి ఎక్కువగా ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : శారీరక శ్రమ ఉంటుంది. అనుకోని పనులు వస్తాయి. చిత్త చాంచల్యం అధికంగా ఉంటుంది. ఆలోచనల్లో ఎప్పికప్పుడు మార్పులు. కార్యసాధనలో పట్టుదల అవసరం. మృష్టాన్న భోజనంపై దృష్టి ఉంటుంది. అనారోగ్య సమస్యలు. పనుల్లో జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : నిత్యావసర ఖర్చులకై ప్రయత్నం చేస్తారు. అనవసర ఇబ్బందులు ఉంటాయి. అనవసర ఖర్చులు చేస్తారు. విశ్రాంతిలోపం ఉంటుంది. పాదాల నొప్పులు ఉంటాయి. ఇతరులపై ఆధారపడతారు. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం. ఇతరులపై ఆధారపడడం. కళలపై ఆసక్తి ఉంటుంది. సమిష్టి ఆశయాలు నెరవేరుతాయి. శ్రమలేని ఆదాయంపై దృష్టి ఉంటుంది. దురాశ పెరుగుతుంది. ఉపాసనపై దృష్టి పెరుగుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : గౌరవ మర్యాదలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సంఘంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. చేసే వృత్తిలో అనుకూలత ఏర్పడుతుంది. అధికారులతో కలిసి వస్తుంది. పెద్దలంటే గౌరవం ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సజ్జన సాంగత్యం కోరుకుటాంరు. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొనాలనే ఆలోచన ఉంటుంది. విద్యార్థులకు ఒత్తిడి ఉంటుంది. పరిశోధనలపై ఆసక్తి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : అనారోగ్య భావన. శ్రమలేని సంపాదనపై దృష్టిఉంటుంది. చెడు మార్గాలు. చిత్త చాంచల్యం ఉంటుంది. క్రయ విక్రయాలపై దృష్టి ఉంటుంది. పరాధీనం ఉంటుంది.  అనవసర ఇబ్బందులు వచ్చే సూచన ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సామాజిక అనుబంధాల్లో అనుకూలత. నూతన పరిచయాలు లాభిస్తాయి. పదిమందిలో గుర్తింపుకోసం ఆరాటం. భాగస్వామ్య అనుబంధాల్లో లోపాలు ఏర్పడతాయి. వ్యాపారస్తులకు అనుకూల సమయం ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

డా.ఎస్.ప్రతిభ