05మే 2019 ఆదివారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

today 5th may 2019 your horoscope

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : విశ్రాంతికై ఆలోచిస్తారు. శ్రమపడకూడదని భావన ఉంటుంది. అనవసర ప్రయాణాలు చేస్తారు. అనవసర ఖర్చులుఅధికం అవుతాయి. విహారయాత్రలపై దృష్టి పెరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొటాంరు. చిత్త చాంచల్యం అధికమౌతుంది. జపం అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : పెద్దల ఆశీస్సులకై ఆలోచన పెరుగుతుంది కళాకారులకు అనుకూల సమయం. కళలపై ఆసక్తి పెరుగుతుంది. ఊహించని లాభాలు వస్తాయి. శ్రమలేని సంపాదన ఉంటుంది. అన్ని రకాల ఆదాయాలు ఆనందాన్నిస్తాయి. జపం అవసరం.శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : అధికారులతో అప్రమత్తత అవసరం. అధికారిక ప్రయాణాలు ఆనందాన్నిస్తాయి. దూర ప్రయాణాలపై దృష్టి పెడతారు. కొన్ని ఊహించని ఇబ్బందులు ఉన్నా తరువాత సంతోషాన్ని పంచుకుటాంరు. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : దూర ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. విలాసవంతమైన జీవితంపై ఆసక్తి పెరుగుతుంది. కళాకారులకు అనుకూల సమయం. కళలపై ఆసక్తి పెరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొనాలనే తపన ఉంటుంది. సౌకర్యవంతమైన జీవితం ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : శ్రమకు తగిన ఫలితం లేకపోవచ్చు. అన్ని పనుల్లో నిరాశ నిస్పృహలు ఉంటాయి. పారమర్శలు తప్పకపోవచ్చు. ఊహించని ఆటంకాలు ఎదురౌతాయి. శ్రమలేని సంపాదనపై దృష్టి పెరుగుతుంది.   అనుకోని చిక్కులు వస్తాయి. శారీరక సమస్యలు అతిగా ఆలోచింపచేస్తాయి. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. పెట్టుబడులపై అధిక శ్రద్ధ చూపుతారు. భాగస్వామ్య సంబంధాలు విస్తరిస్తాయి. తోటివారితో అనుకూలత ఏర్పడుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఊహించని సంతోషం లభిస్తుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : హార్మోనల్‌ సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. పోటీల్లో గెలుపుకై అధిక ప్రాధాన్యఇస్తారు. అనుకున్న ఫలితాలు సాధించలేకపోవచ్చు. తమను తాము కించపరుచుకునే ప్రయత్నం చేయకూడదు. రోగనిరోధక శక్తి పెంచుకునే ప్రయత్నం చేయాలి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  మానసిక ప్రశాంతత పెరుగుతుంది. కళాకారులకు అనుకూల సమయం. సృజనాత్మకత పెరుగుతుంది. ఆలోచనల్లో ఉన్నతి ఏర్పడుతుంది. సంతాన సమస్యలు కొంత ఒత్తిడిన కలిగిస్తాయి. చిత్త చాంచల్యం అధికంగా ఉంటుంది. కళలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. శ్రీ లక్ష్మీహృదయ పారాయణ మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సౌకర్యాలపై దృష్టి పెడతారు. సౌకర్యాలు సంతోషాన్నిస్తాయి. వాటికోసం ఆరాటంపెరుగుతుంది. విందువినోదాల్లో పాల్గొటాంరు. ప్రయాణ సౌకర్యాలు లభిస్తాయి. ఇంటిలో సకల మర్యాదలు ఉంటాయి. తల్లి తండ్రులతో అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం. శ్రీమాత్రేనమః జపం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : స్త్రీవర్గ సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి. దగ్గరి ప్రయాణాలు విస్తరిస్తాయి. విహార యాత్రలపై దృష్టి పెరుగుతుంది. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు తక్కువ శ్రమతో ఫలితాల సాధన ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : వాక్‌ చాతుర్యం పెరుగుతుంది. కుటుంబంలో అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక నిల్వలపై దృష్టి పెరుగుతుంది. మధ్యవర్తిత్వాలు నెరవేరుస్తారు. చాకచక్యంతో సమస్యలను పరిష్కరిస్తారు. అందరిలో గుర్తింపు లభిస్తుంది. మన్ననలు పొందుతారు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పనుల్లో క్రియేటివిటీ పెరుగుతుంది. ఆలోచనలకు అనుగుణంగా పనుల రూపకల్పన చేస్తారు. శ్రమానంతరం ఫలితాలు ఉంటాయి. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు సాధిస్తారు. సంతృప్తి పెరుగుతుంది. శ్రీ దుర్గాయై నమః జపం చేసుకోవడం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios