Asianet News TeluguAsianet News Telugu

Today Astrology: 03 అక్టోబర్ 2021 ఆదివారం మీ రాశి ఫలాలు

ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది.

today 3rd october raasi phalalu
Author
Hyderabad, First Published Oct 3, 2021, 7:06 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు ఉద్యోగస్తులు అధికారులతో పర్యటనలు, పర్యవేక్షణలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అనవసరం. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. చిన్ననాటి వ్యక్తులను కలుసుకుంటారు. నూతన వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు ఆర్థికస్థితి కొంత మేరకు మెరుగుపడుతుంది. దైవకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలు ఆలంకారాలు, విలాసవస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. దాంపత్య సుఖం, మానసిక ప్రశాంతత చేకూరుతాయి. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. మీ బాధ్యతలు ఇతరులకు అప్పగించటం మంచిదికాదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి పెరుగుతుంది. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగలు చేపట్టిన ఉపాధి పథకాలకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది. స్త్రీలు షాపింగ్‍‌ల కోసం ధనం ఖర్చుచేస్తారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు బంధువుల నుంచి మనస్పర్థలు తలెత్తుతాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మధ్యవర్తిత్వాలు, వివాదాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. సంఘంలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు రిప్రజెంటటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టంమీద ఆలస్యముగానైనా పూర్తి చేస్తారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగుమెళుకువ అవసరం. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఆకస్మికంగా ఆరోగ్యపమైన సమస్యలు తలెత్తుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. మిత్రుల కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. పుణ్యక్షేత్రాల దర్శనంవల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. పరస్త్రీలతో అధికంగా సంభాషించడం మంచిది కాదు. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యతే గాని ఆర్థికస్థితి ఆశించినంత సంతృప్తికరంగా ఉండదు. మీ చిన్నారుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. విద్యార్థులు ప్రేమ వ్యవహరాల్లో పెద్దల నుంచి విమర్శలను ఎదుర్కొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. వ్యాపారాభివృద్ధికి కొత్త ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. బంగారు, వెండి, లోహ రంగాలలో వారికి మందకొడిగా వుండగలదు. బంధు మిత్రులతో కలసి ఆలయాలను సందర్శిస్తారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు విందులలో పరిమితి పాటించడం చాలా అవసరం. విలువైన కానుకలందించి ప్రముఖులను ఆకట్టుకుంటారు. విద్యార్థులు క్రీడలు, క్విజ్ ఇతర పోటీల్లో రాణిస్తారు. కుటుంబ సౌఖ్యం, వాహన యోగం పొందుతారు. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. శత్రువులు మిత్రులుగా మారి సహకారం దిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. మీ బంధవులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. పాత రుణాలు తీరుస్తారు. అనుకోకుండా ఒక వ్యవహారం మీకు అనుకూలిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది. రాజకీయ నేతలతో సంభాషించేటపుడు ఓర్పు, సంయమనం పాటించండి. మీరంటే అందరికీ గౌరవం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు ఎదుటివారిని గమనించి ఎత్తుకు పై ఎత్తువేయడం వల్ల గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఊహించని ఖర్చులు, తప్పనిసరి చెల్లింపుల వల్ల ఒకింత ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. శారీరకశ్రమ, ఆలాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. తల పెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహనం ఎదుర్కొటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios