Asianet News TeluguAsianet News Telugu

27 సెప్టెంబర్ 2018 గురువారం మీ రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

today 27th sept2018 your horoscope
Author
Hyderabad, First Published Sep 27, 2018, 9:31 AM IST

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ఉద్యోగాలలో ఒత్తిడి ఉంటుంది. అనుకున్న పనుల్లో లోపాలు ఏర్పడతాయి. శారీరక శ్రమ ఉంటుంది. వృత్తులలో ఆటంకాలు ఏర్పడతాయి. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. కాలాం దుర్వినియోగం అవుతుంది. జాగ్రత్త అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పకక్షులకుం నీరు పెట్టడం, శ్రీరామ జపం చేసుకోవడం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : విద్యార్థులకు అధిక ఒత్తిడి ఏర్పడుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. పరిశోధనలపై ఆసక్తి తగ్గుతుంది. అనవసర ఒత్తిడిపెరిగే సూచన. పనులలో ఆటంకాలు ఏర్పడతాయి.గౌరవహాని ఏర్పడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పకక్షులకునీరు పెట్టడంశ్రీరామజపంచేసుకోవడం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : ఊహించని ఇబ్బందులు ఉంటా యి. అనుకోని ప్రమాదాలు వచ్చేసూచన. ధననష్టం జరిగే సూచనలు ఉంటాయి. వ్యాపారస్తులు జాగ్రత్తగ ఉండాలి. అనారోగ్య సమస్యలు వచ్చే సూచన. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. పరాశ్రయం. పకక్షులకు నీరు పెట్టడం, శ్రీరామ జపం చేసుకోవడం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సామాజిక అనుబంధాల్లో ఒత్తిడి ఉంటుంది. నూతన పరిచయాల్లో జాగ్రత్త అవసరం. భాగస్వాములతో అప్రమత్తగా ఉండాలి. పదిమందిలో గౌరవానికి ఆలోచన ఉంటుంది. అనవసర ఇబ్బందులు, వస్తువులు కోల్పోవడం, ధన హాని జరిగే సూచనలు. పకక్షులకు నీరు పెట్టడం, శ్రీరామ జపం చేసుకోవడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : పోటీ ల్లో గెలుపుకై ప్రయత్నం అధికం. గుర్తింపుకోసం ఆరాటపడతారు. గుర్తింపు లభిస్తుంది. శత్రువులపై జయం సాధిస్తారు. ఋణసంబంధ ఆలోచనలనుంచివిముక్తి పొందుతారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శారీరక అభివృద్ధి బాగుంటుంది. పకక్షులకు నీరు పెట్టడం, శ్రీరామ జపం చేసుకోవడం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : మానసిక ఒత్తిడి అధికం. ఊహించని ఇబ్బందులు ఉంటా యి. అనుకోని కష్టాలు వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. చిత్త చాంచల్యం అధికం. సంతాన సంబంధ ఆలోచనల్లో ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులకుం కష్టకాలం. సృజనాత్మకత తక్కువ. పకక్షులకు నీరు పెట్టడం, శ్రీరామ జపం చేసుకోవడం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : ఒత్తిడితో సౌకర్యాలు పూర్తిచేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఇబ్బందులు ఉంటాయి. గృహ సౌకర్యాలకోసం ఆరాట పడతారు. సామాజిక అనుబంధాల్లో ఒత్తిడి ఉంటుంది. గౌరవంకోసం ఆరాటపడతారు. పకక్షులకు నీరు పెట్టడం, శ్రీరామ జపం చేసుకోవడం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : ఇతరుల సహాయ సహకారాలకోసం ఆలోచిస్తారు. కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. ప్రసార సాధనాలు సంతృప్తినిస్తాయి. విద్యార్థులకుం అనుకూల సమయం. ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. యాత్రల్లో సంతృప్తి ఉంటుంది. పకక్షులకు నీరు పెట్టడం, శ్రీరామ జపం చేసుకోవడం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : వాగ్దానాల వల్ల ఆటంకాలు ఏర్పడతాయి. మాటవిలువ తగ్గుతుంది. కుంటుంబంలో అసౌకర్యం ఏర్పడుతుంది. నిల్వ ధనాన్ని కోల్పోయే అవకాశం. శ్రమకుం తగిన ఫలితం ఉండదు. గుర్తింపు తక్కువగా ఉంటుంది. కాలం వృథా అవుతుంది. పకక్షులకు నీరు పెట్టడం, శ్రీరామ జపం చేసుకోవడం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : శారీరక శ్రమ అధికం. పనుల్లో ఆటంకాలు ఉంటా యి. కార్యసాధనలో పట్టుదల అవసరం. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికలు మార్చుకోవాలి. గుర్తింపు లభించదు. సౌకర్యాలకోసం ఆరాటం తగ్గించుకోవాలి. ఆహారం సమయంలో తీసుకోవాలి. పకక్షులకు నీరు పెట్టడం, శ్రీరామ జపం చేసుకోవడం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : విశ్రాంతిలోపం ఉంటుంది. పాదాల నొప్పులు. సహకార లోపంఉంటుంది. అనవసర ఇబ్బందులు ఉంటా యి. అనవసర ఖర్చులు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.  దేహసౌఖ్యం లోపిస్తుంది. చిత్తచాంచల్యం ఉంటుంది. పకక్షులకు నీరు పెట్టడం, శ్రీరామ జపం చేసుకోవడం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం. ఆశీస్సులు లభిస్తాయి. ఉపాసనలపై దృష్టి పెడతారు. కళాకారులకు అనుకూల సమయం. సమిష్టి ఆదాయాలపైదృష్టి. అన్ని రకాల ఆదాయాలు వృద్ధి చెందుతాయి. వాగ్దానాలవల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. పకక్షులకు నీరు పెట్టడం, శ్రీరామ జపం చేసుకోవడం మంచిది.

డా.ఎస్ ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios