Asianet News TeluguAsianet News Telugu

27ఫిబ్రవరి2019 బుధవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

today 27th feb 2019 your horoscope
Author
Hyderabad, First Published Feb 27, 2019, 7:22 AM IST

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : విశ్రాంతిలోపం ఉంటుంది. మానసిక ఒత్తిడి అధికం అవుతుంది.   శారీరక శ్రమ ఎక్కువగా చేస్తారు. అనవసర ఒత్తిడులు ఉంటాయి. నిద్రపట్టక విచారం చెందుతూ ఉంటారు. అనవసర ఖర్చులు ఉంటాయి. వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి. ఖర్చు పెట్టేముందు 1,2 సార్లు ఆలోచించాలి. లక్ష్మీ పూజ మంచిచేస్తుంది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : పద్దల ఆశీస్సులు లభిస్తాయి. చేసే పనుల్లో సంతృప్తి ఉంటుంది. కళాకారులకు అనుకూల సమయం. విద్యార్థులు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు సాధిస్తారు. వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి. పరాశ్రయ ఉంటుంది. సమిష్టి ఆదాయాలు ఉంటాయి. శ్రీదత్త శ్శరణం మమ జపం మంచిది

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : అధికారులతో అనుకూలత ఉంటుంది. చేసే పనుల్లో సంతృప్తి లభిస్తుంది. రాజకీయాలపై అతిగా ఆసక్తి చూపిస్తారు. వృత్తి ఉద్యోగాదులలో ఉన్నతి ఉంటుంది. ప్రమోషన్స్‌ వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు అనుకూల సమయంగా చెప్పవచ్చు. లక్ష్మీ పూజ మంచి ఫలితాలనిస్తుంది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : విద్యార్థులకు మరియు పరిశోధకులకు కష్టకాలం. అధిక శ్రమతో తక్కువ ఫలితాల సాధన ఉంటుంది. దూర ప్రయాణాలపై ఆసక్తి ఉంటుంది. ప్రయాణాల్లోఒత్తిడులు అధికంగా ఉంటాయి. శాస్త్ర పరిజ్ఞానం ఉన్నదనే ఆలోచనతో అహంకారం పెరిగే సూచన. జాగ్రత్త అవసరం. శ్రీదత్త శ్శరణం జపం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఇతరులపై ఆధారపడతారు. వ్యాపారస్తులకు అనుకూల సమయం ఉంటుంది. అనుకోని ఆదాయాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సుఖ దుఃఖాలు మిశ్రమ ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం పై శ్రద్ధ వహిస్తారు. లాటరీలలో ప్టిెన డబ్బు వచ్చే అవకాశాలు. శ్రీలక్ష్మీ ఆరాధన మంచి ఫలితాలనిస్తుంది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సామాజిక అనుబంధాలు అనుకూలిస్తాయి. నూతన పరిచయాలు కాస్త ఒత్తిడితో అభివృద్ధి చెందుతాయి. పదిమందిలో గౌరవంకోసం పాటుపడతారు. వ్యాపారస్తులకు జాగ్రత్తలు అవసరం. భాగస్వామ్య అనుబంధాల్లో సంతృప్తి పెరుగుతుంది. శ్రీలక్ష్మీ ఆరాధన మంచి ఫలితాలనిస్తుంది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : పోీల్లో గెలుపుకై ఆలోచిస్తారు. శత్రువులపై విజయం ఉంటుంది. ఋణ బాధలు తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. క్రీడాకారులకు అనుకూల సమయం. వ్యాపారస్తులు వ్యాపార అభివృద్ధికై పాటుపడుతారు. ఉద్యోగస్తులు ఉన్నత స్థానాలవైపు దృష్టి పెడతారు. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : సంతానం వల్ల ఒత్తిడి అధికంగా ఉంటుంది. సమస్యలతో సతమతమౌతారు. మానసిక ఆందోళన పెరుగుతుంది. చికాకులు ఎక్కువ అవుతాయి. సృజనాత్మకతను కోల్పోతారు. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఆచి, తూచి వ్యవహరించాలి.  విద్యార్థులకు కష్టకాలం ఉంటుంది. శ్రీ హయగ్రీవాయనమః జపం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సౌకర్యాల వల్ల సంతోషం పెరుగుతుంది. ఆహారంపై దృష్టి పెరుగుతుంది.  ప్రయాణాలు చేయాలనే ఆసక్తి పెరుగతుంది. విద్యార్థులు తక్కువ శ్రమతో అధిక ఫలితాలను సాధిస్తారు. తల్లి తరఫు వారితో మాట ప్టింపు పెరుగుతుంది. సుగంధ ద్రవ్యాలపై దృష్టి పెడతారు. ఓం నమశ్శివాయ జపం మంచి ఫలితాలనిస్తుంది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : చిత్త చాంచల్యం తగ్గించుకునే ప్రయత్నంచేయాలి. వన భోజనాలపై దృష్టి ఉంటుంది. ప్రసార సాధనాల ద్వారా ఒత్తిడి ఉంటుంది. పరామర్శలు చేస్తారు. విద్యార్థులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. పరామర్శలు చేస్తారు. బంధువులతో జాగ్రత్త అవసరం. నరసింహారాధన మంచి ఫలితాలనిస్తుంది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు): మాట విలువ పెరుగుతుంది. మాటల్లో చమత్కారం ఉంటుంది. ఎదుటివారిని ఆకర్షిస్తారు. సంపదను పెంచుకునే ప్రయత్నం వైపు ఆలోచిస్తారు. ఆభరణాలు కొనుక్కునే ఆలోచన ఉంటుంది. దృష్టి లోపాలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. విష్ణు సహస్రనామ పారాయణ మంచి ఫలితాలనిస్తుంది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : శ్రమకు తగిన గుర్తింపు ఉండదు. ఆలోచనల్లో మార్పులు చేసుకోవాలి. పనుల ఒత్తిడి తీవ్రం అవుతుంది. కార్యసాధనలో పట్టుదల అవసరం. అనుకున్న పనులు పూర్తిచేయడంలో విఫలం అవుతారు. సుఖ దుఃఖాలు సమానంగా ఉంటాయి. విష్ణు సహస్రనామ పారాయణ మంచిది.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios