మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : అధికారులతో అనుకూలత పెంచుకుటాంరు. రాజకీయ విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సంఘంలో గౌరవం పెంచుకునే ప్రయత్నం. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం. అధికారులతో అనుకూల ఉంటుంది. పరాక్రమం సాధిస్తారు. సౌకర్యాలు పెంచుకుటాంరు. లలితా సహస్రనామ పారాయణం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : దూర ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. విద్యార్థులకు ఒత్తిడి సమయం. అనుకోని భయాలు ఉంటాయి. శ్రమ అధికంగా ఉంటుంది. గుర్తింపుకోసం ప్రాకులాడుతారు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అధికారులతో ఒత్తిడి ఉంటుంది. లలితా సహస్రనామ పారాయణం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : ఊహించని ఇబ్బందులు ఉంటాయి. వ్యాపారస్తులు జాగ్రత్త అవసరం. క్రయ విక్రయాల్లో లోపాలు జరిగే సూచనలు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. అనారోగ్య సమస్యలు పెరిగే సూచనలు. ఇతరులపై ఆధారపడతారు. క్రీం అచ్యుతానంత గోవింద జపం చేసుకోవడం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : శారీరక సౌఖ్యం ఉంటుంది. సామాజిక అనుబంధాలు పెరుగుతాయి. నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలం. భాగస్వామ్య అనుబంధాలు బలపడతాయి. గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అన్ని రకాల అనుకూలత. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : రోగనిరోధక శక్తిని పెంచుకుటాంరు. వృత్తి విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. పోటీల్లో గెలుపు సాధిస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం. శత్రువులపై విజయం సాధిస్తారు. ఋణ సంబంధ ఆలోచనలు తగ్గుముఖం పడతాయి. అప్పుతీర్చే ప్రయత్నం చేస్తారు. ప్రశాంతత పెంచుకుటాంరు. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సంతాన సమస్యలు వచ్చే సూచనలు. సంతానం వల్ల అనవసర ఆందోళనలు ఉంటాయి. మానసిక ప్రశాంతతను పెంచుకోవాలి. చిత్త చాంచల్యం తగ్గించాలి. సృజనాత్మకతను కోల్పోతారు. విద్యార్థులకు ఒత్తిడితో తక్కువ ఫలితాలు. శ్రీ హయగ్రీవాయ నమః జపం చేసుకోవడం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సౌకర్యాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. మానసిక ఆందోళనలు అధికం. అనారోగ్య సూచనలు. శారీరక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ప్రయాణాల్లో జాగ్త్రలు అవసరం. అనవసర ప్రయాణాలు తగ్గించాలి. ఆందోళనకు గురికాకుండా చూసుకోవాలి. లక్ష్మీ నృసింహ స్తోత్రం మంచి ఫలితాలనిస్తుంది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : తల్లి తరుపు బంధువుల సహకారాలు లభించే సూచనలు. పరాక్రమం పెరుగుతుంది. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం. కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి. విహార యాత్రలు చేయాలనే తలంపు ఉంటుంది. పరామర్శలు ఉంటాయి. లలితా సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : మాట విలువ తగ్గుతుంది. చిత్త చాంచల్యం పెరుగుతుంది. మధ్యవర్తిత్వాల వల్ల మోసపోతారు. కుటుంబంలో ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. కిం సంబంధ లోపాలు బయట పడే సూచనలు. ఆర్థిక నిల్వలు తగ్గిపోయే ప్రమాదం. దానాలు చేయడం మంచిది. లలితా పారాయణ శుభం చేకూరుతుంది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : శారీరక శ్రమ ఉంటుంది. శుభకార్యాలకు వెళ్ళాలనే ఆలోచన ఉంటుంది. విందు భోజనాలపై దృష్టి పెరుగుతుంది. గుర్తింపు ఉండదు. పనులలో జాప్యం పెరుగుతుంది. మానసిక ఒత్తిడిని పెంచుకునే ప్రయత్నం జరుగుతుంది. శ్రీ లలితా సహస్రనామ పారాయణ నిరంతరం చేయడం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : విశ్రాంతి లోపం ఏర్పడుతుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఇబ్బందులు ఉంటాయి. ఇతరులపై ఆధారపడతారు. నిత్యావసర ఖర్చులు పెంచుకునే ప్రయత్నం. బంధనాలు తగ్గించుకుటాంరు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కళాకారులకు అనుకూల సమయం. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సమిష్టి ఆదాయాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెంచుకునే మార్గం. కళలపై ఆసక్తి పెరుగుతుంది. సంతృప్తి ఉంటుంది. శ్రీ లలితా సహస్రనామ పారాయణ నిరంతరం చేయడం మంచిది.

డా.ఎస్.ప్రతిభ