Asianet News TeluguAsianet News Telugu

26సెప్టెంబర్ 2019 గురువారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి పరామర్శలు చేస్తారు. వైద్యశాలల సందర్శనం అవసరం అవుతుంది. మానసిక ఒత్తిడి ఉంటుంది. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనుకోని కష్టాలు. శ్రమలేని సంపాదనపై దృష్టి పెడతారు. క్రయ విక్రయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఇతరులపై ఆధారపడతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

today 26th septmber 2019 your horoscope
Author
Hyderabad, First Published Sep 26, 2019, 7:36 AM IST

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : విద్యార్థులకు చదువులో నిరాశ నిస్పృహలు. అనుకున్న పనులు తొందరగాపూర్తికావు.   పరిశోధనలపై ఆసక్తి తగ్గుతుంది. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి.  శుభకార్యాల్లో పాల్గొనాలనే ఆలోచన ఉంటుంది. సంతృప్తి లోపం ఉంటుంది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : పరామర్శలు చేస్తారు. వైద్యశాలల సందర్శనం అవసరం అవుతుంది. మానసిక ఒత్తిడి ఉంటుంది. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనుకోని కష్టాలు. శ్రమలేని సంపాదనపై దృష్టి పెడతారు. క్రయ విక్రయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఇతరులపై ఆధారపడతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సామాజిక అనుబంధాలు ఒత్తిడికి గురి చేస్తారు. భాగస్వాములతో అసంతృప్తిగా ఉంటారు. వ్యాపారస్తులకు ఒత్తిడి సమయం. పదిమందిలో పలుకుబడి పెంచుకునే ప్రయత్నం చేస్తారు. జీవితం అనుకున్న రీతిలో సాగుతుంది. నూతన పరిచయాల వల్ల జాగ్రత్తగా ఉండాలి. కోల్పోయే అవకాశాలు.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : శ్రమకు తగిన గుర్తింపుకోసం ప్రయత్నం చేస్తారు. అధిక శ్రమపైన గుర్తింపు లభిస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. శత్రువులపై విజయం ఉంటుంది. వృత్తి విద్యలపై ఆసక్తి పెరుగుతుంది.రుణభారం తగ్గుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : అన్ని పనుల్లోనూ, ఆలోచనల్లోనూ నిరాశ, నిస్పృహలు అధికమౌతాయి. సంతానం వల్ల సమస్యలు ఉంటాయి. విద్యార్థులకు ఒత్తిడి కాలం. ఆత్మీయతలు తగ్గుతాయి. సృజనాత్మకతను కోల్పోతారు. పరిపాలన సమర్ధత తగ్గుతుంది. మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. ఆలోచనా శక్తి కోల్పోతారు. జాగ్రత్త అవసరం.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సౌకర్యాలు శ్రమకు గురిచేస్తాయి. గృహ సంబంధ విషయాల్లో జాగ్రత్త. విద్యార్థులు శ్రమతో ఫలితాలు సాధిస్తారు. చేప్టిన పనులు సాధిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు చేస్తారు. మాతృసౌఖ్యం తగ్గుతుంది. అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడతాయి. మృష్టాన్నభోజనంపై దృష్టి ఉంటుంది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : అన్నినీ కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. సహకారం వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. దగ్గరి ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు ఒత్తిడి ఏర్పడుతుంది. రచనలపై ఆసక్తి తగ్గుతుంది. తోటి వారి సహకారాలు లోపిస్తాయి. కమ్యూనికేషన్స్‌వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : బంధుమిత్రులతో కలిసి మెలిసి ఉండాలి. ఎవ్వరితో తొందరపాటు పనికిరాదు. వాగ్దానాలు వల్ల ఒత్తిడిపెరుగుతుంది. మాట విలువ తగ్గుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో అనుకూలతలు ఏర్పడతాయి. నిల్వ ధనాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆభరణాలపై దృష్టి ఉంటుంది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : శారీరక శ్రమ ఉంటుంది. పట్టుదలతో కార్యసాధన అవసరం. చిత్త చాంచల్యం పనికిరాదు. చిన్న చిన్న పనులకే తొందరగా అలసిపోతారు. పనులలో నిరాశ నిస్పృహలు వస్తాయి. ఆలోచనలకు అనుగుణమైన ప్రణాళికల మార్పు అవసరం. శారీరక గుర్తింపు పెరుగుతుంది. అనుకోని ఇబ్బందులు వస్తాయి.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : ఆధ్యాత్మిక యాత్రలు చేయాలనే ఆలోచన పెరుగుతుంది. అనవసర ప్రయాణాలు చేస్తారు. అనవసర ఖర్చులు ఉంటాయి. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. సుఖం కోసం ఆలోచన పెరుగుతుంది. పరాధీనత ఉంటుంది. సమయం, కాలం, వృథా అవుతుంది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సంతృప్తి లభిస్తుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కళలపై ఆసక్తి పెరుగుతుంది. ఉపాసనను పెంచుకుటాంరు. ఆదర్శవంతమైన జీవితంకోసం ఆరాటం ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు. లాభాలు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. దానధర్మాలు మంచివి.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సహ ఉద్యోగులతో అవసరాలు పెరుగుతాయి. జాగ్రత్త అవసరం. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. పనుల్లో సంతోషం ఉంటుంది. సంఘంలో గౌరవం ఉంటుంది. ఉద్యోగులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. పదిమందిలో పలుకుబడి ఉంటుంది.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios