25జులై 2019 గురువారం రాశిఫలాలు
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి
ఓ రాశివారికి ఈ రోజు పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. ఓ రాశివారికి వ్యాపారంలో లాభాలు వస్తాయి. మరో రాశివారికి ఉద్యోగంలో అనుకోని సమస్యలు ఎదురౌతాయి.
మేషం
మేషం : ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. మంచి ఆహారం తీసుకోవడం, నూతన వస్ర్తాలు కొనుగోలు చేయడం చేస్తారు. మీ జీవిత భాగస్వామి నుంచి అనుకోని సాయం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో ఆచి,తూచి అడుగేయండి.
వృషభం
వృషభం : ఈ రోజు కొంత బద్ధకంగా ఉంటుంది. చిన్న పనికి ఇతరులపై ఆధారపడటం, ఇతరుల సాయం తీసుకోవడం చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో అనుకోని సమస్య కారణంగా ఆందోళనకు గురవుతారు. అలాగే మిత్రులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశముంటుంది. అనవసర ఖర్చులుంటాయి.
మిథునం
మిథునం : ఈ రోజు ఆర్థిక లావాదేవీలకు, పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు గడిస్తారు. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు అలాగే కొత్త స్నేహాలు, పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి.
కర్కాటకం
కర్కాటకం : ఈ రోజు మీరు కొనాలనుకున్న లేదా పొందాలనుకున్న వస్తువులు మీ చేతికి వస్తాయి. ఉద్యోగ విషయంలో అనుకోని విజయం కానీ, ప్రశంస పొందుతారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొలుగోలు చేస్తారు. చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా నిరుత్సాహ పడకుండా పని చేస్తే విజయం సాధిస్తారు.
సింహం
సింహం : ఈ రోజు మీరు రోజువారి కార్యక్రమాల నుంచి విశ్రాంతిని కోరుకుంటారు. ఒకే రకమైన జీవన విధానంలో కొంత మార్పు సాధించాలన్న ఆలోచన కలిగి ఉంటారు. అనుకోని ప్రయాణం , కొత్త వ్యక్తులను కలుసుకోవడం కానీ జరుగుతుంది. మానసికంగా ఏదో తెలియని అలజడిని, వెలితిని కలిగి ఉంటారు. ఉద్యోగంలో, వ్యాపారంలో మార్పు కోరుకుంటారు.
కన్య
కన్య : ఈ రోజు మానసికంగా కొంత అశాంతితో ఉంటారు. అనుకోని అవమానం, భయం ఎదురవుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనువైన రోజు కాదు. కుటుంబ సభ్యుల అనారోగ్యం కూడా మీ ఆందోళనకు కారణం కావచ్చు. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. అనుకోని విషయాలపై ఖర్చు చేయాల్సి వస్తుంది.
తుల
తుల : వివాహ సంబంధ వ్యవహారాలకు, ఒప్పందాలకు అనుకూల దినం. మీ మనస్సులోని భావాలను మీ జీవితభాగస్వామికి వ్యక్తం చేస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామితో కలిసి సినిమా లేదా ఇతర వినోద కార్యక్రమాలకు వెళతారు. బంధువులతో లేదా మిత్రులతో ఉన్న గొడవలు సమసిపోతాయి.
వృశ్చికం
వృశ్చికం : ఆర్థికంగా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. రావలసిన పాత బకాయిలు రావడం, లోన్ రావడం జరుగుతుంది. ఉద్యోగం విషయంలో ఎదురు చూస్తున్న వారికి కొంత అనుకూలత ఏర్పడుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. వ్యాపార విషయాలకు కొంత సామాన్యంగా ఉంటుంది. కోర్టు కోసులు, వివాదాల్లో విజయం సాధిస్తారు.
ధనుస్సు
ధనుస్సు : ఈ రోజు ప్రేమను లేదా మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి అనుకూలంగా ఉంటుంది. మానసికంగా కొంత ఆందోళన, ఉత్సాహం కలగలుపుగా ఉంటాయి. మీ సంతానం ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. పెట్టుబడులకు, ఆర్థిక లావాదేవీలకు అంతగా అనుకూలమైన రోజు కాదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మకరం
మకరం : ఈ రోజు గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూలమైన రోజు. ఇల్లు కొనఢం లేదా నిర్మాణ సంబంధ పనులు, ఒప్పందాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే వాహనం కొనుగోలు చేస్తారు. మిత్రుల, బంధువుల సాయం అందుకుంటారు. విద్యా సంబంధ విషయాల్లో మంచి ప్రగతి సాధిస్తారు. ఒప్పందాల విషయంలో కొంత జాగ్రత్త అవసరం.
కుంభం
కుంభం : ఈ రోజు మీ వృత్తికి సంబంధించిన ప్రయాణం కానీ, అనుకోని మార్పు ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ రోజు ఉద్యోగానికి సంబంధించి మంచి సమాచారం అందుకుంటారు. కొత్త బట్టలు, వస్తువులు కానీ కొనుగోలు చేస్తారు.
మీనం
మీనం : ఈ రోజు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రావలసిన డబ్బులు వచ్చినప్పటికీ, మళ్లీ ఖర్చు రూపంలో వెళ్లిపోతాయి. ఉద్యోగ విషయంలో కొంత జాగ్రత్త అవసరం. వాద వివాదాలకు తావివ్వకండి. దాని కారణంగా మీకు కొంత అవమానం, వ్యతిరేకత కానీ ఏర్పడుతుంది. ఒప్పందాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. ప్రయాణం చేసే అవకాశముంటుంది.