24 సెప్టెంబర్ 2019 మంగళవారం రాశిఫలాలు
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి సామాజిక అనుబంధాలు కొంత ఒత్తిడికి గురి చేస్తాయి. భాగస్వాములతో జాగ్రత్త అవసరం. నూతన పరిచయాల జోలికి వెళ్ళకూడదు. ఊహించని ఇబ్బందులు వస్తాయి. ప్రయాణాల్లో ఆచి, తూచి వ్యవహరించాలి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరాదు. మానసిక చికాకు పెరుగుతుంది.
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ఊహించని ఇబ్బంది వస్తాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఖర్చుల్లో ఆచి తూచి వ్యవహరించాలి. పరామర్శలు చేస్తారు. శ్రమలేని ఆదాయం వచ్చే సూచనలు. సంతృప్తి లోపం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. ఉన్నత విద్యలపై ఆలోచనలు పెరుగుతాయి. పరిశోధకులు అనుకూల సమయం.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : సామాజిక అనుబంధాలు కొంత ఒత్తిడికి గురి చేస్తాయి. భాగస్వాములతో జాగ్రత్త అవసరం. నూతన పరిచయాల జోలికి వెళ్ళకూడదు. ఊహించని ఇబ్బందులు వస్తాయి. ప్రయాణాల్లో ఆచి, తూచి వ్యవహరించాలి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరాదు. మానసిక చికాకు పెరుగుతుంది.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : అన్ని పనుల్లో గెలుపుకోసం ప్రయత్నం చేస్తారు. ప్రయత్నానికి తగిన గుర్తింపు రావచ్చు, రాకపోవచ్చు. శత్రువులపై ఒత్తిడి పెరుగుతుంది. సామాజిక అనుబంధాల్లో లోపాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులు సహ ఉద్యోగులతో ఆచి, తూచి వ్యవహరించాలి. నూతన పరిచయాల వల్ల మోసపోయే అవకాశం.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సంతాన సమస్యలు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. చిత్త చాంచల్యాన్ని తగ్గిస్తారు. సృజనాత్మకత పెరుగుతుంది. మంచి పేరు వస్తుంది. శ్రమకు తగిన గుర్తింపు రాదు. ఎక్కువగా శ్రమ పడడానికి ఇష్ట పడరు. శత్రువులు పెరుగుతారు. ఊహించని ఇబ్బందులు వస్తాయి. యోగాసనాలు వేయడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : సౌకర్యాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు. ఆహారంలో సమయ పాలన మంచిది. నియమబద్ధ జీవితంకోసం ప్రయత్నం చేయాలి. సృజనాత్మకతకై పరితపిస్తారు. కాని తొందరగా పెరగదు. మానసిక ఒత్తిడి, చికాకులు అధికం అవుతాయి. చిత్త చాంచల్యాన్ని తగ్గించుకోవాలి.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులకు కొంత శ్రమానంతరం ఫలితం లభిస్తుంది. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. ప్రయాణ సాధనాలు వచ్చే సూచనలు. సౌకర్యాల కోసం పరితపిస్తారు. ఆహారంలో సమయ పాలనకై ప్రయత్నిస్తారు. తినే ఆహారం బాగా నమిలి తినాలి. ఉన్నంతలో సంతృప్తి చెందాలి.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : వాక్ చాతుర్యం పెరుగుతుంది. మధ్యవర్తిత్వాలు లాభిస్తాయి. బంధువర్గీయులతో ఆత్మీయలు పెరుగుతాయి. ఆర్థిక నిల్వలు పెంచుకునే ప్రయత్నం. సేవకజన సహకారం లభిస్తుంది. సేవకులతో అనుకూలత పెరుగుతుంది. కమ్యూనికేషన్స్ వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో ఆలోచనలు చేయాలి.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : శారీరక శ్రమ పెరుగుతుంది. ఆలోచనలకు అనుగుణంగా పనులు తొందరగా ముందుకు సాగవు. ఊహించని ఇబ్బందులు వస్తాయి. వాక్ చాతుర్యం వల్ల కొంత ఒత్తిడి పెరుగుతుంది. మధ్యవర్తిత్వాలు లాభించవు. బంధు మిత్రులతో సహ సంబంధాలు పెంచుకునే విషయంలో ఆలోచన అవసరం. జాగ్రత్త అవసరం.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది. బద్ధకాన్ని తగ్గించుకునే ప్రయత్నం అవసరం. ప్రతినిత్యం యోగా, ప్రాణాయామాలు తప్పనిసరి. విశ్రాంతికై ఆలోచన అవసరం. ఆధ్యాత్మిక యాత్రలు పెరుగుతాయి. పరామర్శలు చేస్తారు. వైద్యశాలల సందర్శనం అవసరం అవుతుంది. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. పరామర్శలు చేస్తారు. విశ్రాంతికై ప్రయత్నిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. విజ్ఞాన యాత్రలు చేయాలని ఆలోచిస్తారు. ఊహించని ఇబ్బందులు పెరుగుతాయి. ఆనందంకోసం ప్రయత్నం.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : సంఘంలో గౌరవం కోసం ప్రయత్నం చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం అవసరం. అధికారులతో అప్రమత్తత అవసరం. లాభాలు సద్వినియోగం చేస్తారు. అన్ని పనుల్లో సంతోషం పెరుగుతుంది. సేవక వర్గ సహకారం ఆశింపు లభిస్తుంది. జాగ్రత్త అవసరం.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. పరిశోధకులకు అనుకూల సమయం. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అధికారులతో అప్రమత్తత అవసరం. అధికారిక ప్రయాణాలు చేస్తారు. సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. మొత్తంపైన సంతృప్తి అధికంగా లభిస్తుంది. పనుల్లో గుర్తింపు పెరుగుతుంది.
డా.ఎస్.ప్రతిభ