Asianet News TeluguAsianet News Telugu

20మే 2019 సోమవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

today 20th may monday your horoscope
Author
Hyderabad, First Published May 20, 2019, 6:43 AM IST

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : వాక్‌ చాతుర్యం పెరుగుతుంది. మాట విలువ పెంచుకుంటారు. ఆకర్షణీయమైన మాట మ్లాడతారు. ఆర్థిక సమస్యలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో అనుకూలత పెరుగుతుంది. నిల్వ ధనం సరియైన సమయంలో ఉపయోగపడుతుంది. పనుల్లో కొంత జాగ్రత్త అవసరం. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : శారీరక శ్రమ ఉంటుంది. పనుల్లో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. ఆలోచనలకు అనుగుణంగా పనుల కార్యచరణ ఉంటుంది. చిత్త చాంచల్యం తగ్గుతుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. వేగవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు. ఎవరికీ తొందరగా దొరకదు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నం చేస్తారు. విశ్రాంతి లభిస్తుంది. విహార యాత్రలకై ఖర్చు చేస్తారు. పాదాల నొప్పులు వస్తాయి. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. ప్రయాణాల్లో సంతోషం లభిస్తుంది. పనుల ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. వ్యాపారస్తులకు అనుకూల సమయంగా ఉంటుంది. పెద్ద పెద్ద వ్యాపారాల్లో అభివృద్ధి వీరి సొంతం అవుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. కాలాన్ని సద్వినియోగం చేస్తారు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : అధికారిక ప్రయాణాలు చేస్తారు. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలకై ప్రాకులాడుతారు. చేసే వృత్తులలో సంతోషం ఏర్పడుతుంది. ఉద్యోగంలో అనుకూలతలు ఉంాయి. తోివారు అనుకూలతను అందజేస్తారు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  దూర ప్రయాణాలకై ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాల్లో అనుకున్నంత సంతృప్తి కనిపించదు. విద్యార్థులకు అధిక శ్రమతో తక్కువ ఫలిత సాధన ఉంటుంది. పనులల్లో చిత్త చాంచల్యాన్ని తగ్గించుకోవాలి. ఊహించని ఆటుపోట్లు వస్తాయి. జాగ్రత్త అవసరం. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : ప్రయాణల్లో జాగ్రత్తగా ఉండాలి. చిత్త చాంచల్యాన్ని తగ్గించుకోవాలి. అనారోగ్య సూచనలు ఉన్నాయి. నరాల సమస్యలు వచ్చే అవకాశం. శ్రమలేని ఆదాయంపై దృష్టి పెడతారు.  పరామర్శలు చేసే అవకాశం. వైద్య శాలల సందర్శనం ఉంటుంది. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : సామాజిక అనుబంధాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. సమస్యను సున్నితంగా పరిష్కరిస్తారు. తమకు అనుకూలంగా ఎదుివారిని ఆకర్షించుకుంటారు. పెట్టుబడులు విస్తరిస్తాయి. వ్యాపారంలో మెళుకువలు నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. నూతన పరిచయాలు అనుకలించే ప్రయత్నం చేస్తారు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : పోటీల్లో గెలుపుకై ప్రయత్నం చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు.  ఋణ సంబంధ ఆలోచలన వలన విముక్తి పొందుతారు. పనుల్లో ఆటంకాలు తగ్గుతాయి. అనుకున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. సహకరించేవారు ఎక్కువమంది పెరుగుతారు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సృజనాత్మకత పెరుగుతుంది. ప్రణాళికా బద్ధమైన కార్యరూపం ఏర్పరచుకుంటారు. మానసిక ప్రశాంతతకై ప్రయత్నం చేస్తారు. క్రియేివిటీ ఉపయోగపడతుంది. సంతానం వల్ల సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. చిత్తచాంచల్యం తగ్గుతుంది. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : సౌకర్యాల వల్ల సంతోషంగా గడుపుతారు.  ఒత్తిడితో సౌకర్యాలు లభిస్తాయి. ప్రయాణాలు అనుకూలంగా చేసుకునే ప్రయత్నం ఉంటుంది. ఆహారంలో సమయపాలన అవసరం. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు కనబడుతున్నాయి. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : వ్యాపారస్తుల సహకారం లభిస్తుంది. వ్యాపార ప్రయాణాలు చేసే వీలు ఉంటుంది. కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. రచనారంగం పెంచుకుంటారు. విద్యార్థులకు అనుకూల సమయం. తక్కువ శ్రమతో ఫలితాల సాధన ఉంటుంది. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios