20జులై 2019 శనివారం రాశిఫలాలు
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి
ఓ రాశివారు తమ శత్రువులపై విజయం సాధిస్తారు. మరో రాశివారికి ఉద్యోగంలో ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. మరో రాశివారికి అనారోగ్య సూచనలు ఉన్నాయి
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : సౌకర్యాలవలన ఒత్తిడి ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో ఆటంకాలు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనుకోని ఇబ్బందులు ఏర్పడతాయి. ఆహారం వల్ల సమస్యలు వస్తాయి. విద్యలో ఆటంకాలు ఏర్పడతాయి. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. చింతామణి గృహాంతస్థా శ్రీమన్నగర నాయికా జపం చేసుకోవడం మంచిది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : అన్యుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సంతోషం లభిస్తుంది. ప్రచార, ప్రసార సాధనాల్లో లోపాలు ఏర్పడుతాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్ర జపం మంచిది.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : వాగ్దోధరణి వల్ల ఇబ్బందులు వస్తాయి. అనవసర మాటలు మాటలాడరాదు. కుటుంబంలో ఆటంకాలు ఏర్పడతాయి. ప్రయాణాల్లో ప్రమాదాలకు ఆస్కారం ఉంది. అనవసర ఖర్చులపై దృష్టి ఉంటుంది. దానధర్మాలకు, మంచి పనులకు ఖర్చు చేయడం మంచిది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పనులలో ఒత్తిడి ఏర్పడుతుంది. ప్రణాళికల్లో లోపాలు ఏర్పడతాయి. పట్టుదలతో కార్యసాధన అవసరం. నూతన పరిచయాల వల్ల ఆటంకాలు ఉంాయి. సామాజిక అభివృద్ధి లోపిస్తుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్ర జపం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : విశ్రాంతి లోపం ఏర్పడుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. ఇతరులపై ఆధారపడతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. రహస్య స్థావరాలపై దృష్టి ఏర్పడుతుంది. సుఖం కోసం ఆలోచిస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్ర జపం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సమిష్టి ఆశయాలకోసం ఆరాటపడతారు. శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. స్వార్థంపై దృష్టి ఉంటుంది. సమిష్టి లాభాలకోసం ప్రయత్నం చేస్తారు. ఇతరులపై ఆధారపడతారు. రాజకీయాలపై దృష్టి ఉంటుంది. దుర్గాస్తోత్ర పారాయణ చేసుకోవడం మంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సంఘంలో గౌరవం కోసం ఆరాటం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలపై కాంక్ష ఉంటుంది. ఆ ప్రయత్నాలపై దృష్టి ఉంటుంది. శారీరక శ్రమ ఉంటుంది. వృత్తిలో ఆటంకాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో ఒత్తిడి అధికం అవుతుంది. శ్రీ రాజమాతంగ్యై నమః జపం చేసుకోవడం మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలపై దృష్టి పెడతారు. విశాల భావాలు ఏర్పడతాయి. ఆలోచనల వల్ల మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. న్యాయ అన్యాయాల విచారణ చేస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్ర జపం మంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : చెడు మార్గాలపై దృష్టి ఏర్పడుతుంది. అనారోగ్యం ఏర్పడుతుంది. అనవసర ఇబ్బందులు ఎదుర్కొాంరు. వైద్యశాలలకై ఖర్చు చేస్తారు. పరాధీనులౌతారు. శ్రమలేని సంపాదనపైదృష్టి ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్ర జపం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : నూతన పరిచయాల వల్ల ఒత్తిడి ఉంటుంది. సామాజిక అనుబంధాల్లో లోపాలు. భాగస్వాములతో అప్రమత్తత అవసరం. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పలుకుబడికోసం ఆరాట పడతారు. వ్యాపారస్తులు అప్రమత్తత అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్ర జపం మంచిది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : శతృవులపై విజయం సాధిస్తారు. ఏపనైనా పట్టుదలతో కార్యసాధన చేస్తారు. పోీల్లో శ్రమతో గెలుపు ఉంటుంది. ఋణాలపై దృష్టి ఏర్పడుతుంది. శారీరక శ్రమ అధికం. ఔషధ సేవనం చేస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్ర జపం మంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సంతానం వల్ల అసౌకర్యం ఉంటుంది. మానసిక ప్రశాంతతకై ఆరాటం. సృజనాత్మకతను కోల్పోతారు. అతీంద్రియ శక్తులపై దృష్టి పెడతారు. చిత్త చాంచల్యం పెరుగుతుంది. మనసు ప్రశాంతతకై ప్రయత్నం అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్ర జపం మంచిది.
డా.ఎస్.ప్రతిభ