Asianet News TeluguAsianet News Telugu

01 జులై 2019 సోమవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

today 1st july 2019 your horoscope
Author
Hyderabad, First Published Jul 1, 2019, 7:01 AM IST

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. సౌకర్యాల వల్ల ఒత్తిడి ఉంటుది. ప్రయాణాల్లో అసౌకర్యం ఏర్పడుతుంది. ఆహారంలో సమయ పాలన అవసరం. తల్లికి దూరంగా నివసించే ఆలోచన ఉంటుంది. గృహసౌఖ్యం తక్కువగా ఉంటుంది. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం ఉత్తమ ఫలితాలనిస్తుంది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. పరామర్శలు చేస్తారు.  తోివారి సహాయ సహకారాలుాంయి. సోదరుల సహకారాలు ఉంాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఇతరులపై ఆధారపడతారు.  సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం ఉత్తమ ఫలితాలనిస్తుంది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : మాటల వల్ల జాగ్రత్త అవసరం. అనవసర ఇబ్బందులు వస్తాయి. ప్లోాటల జోలికి పోరాదు. కుటుంబంలో జాగ్రత్త వహించాలి. నిల్వధనం కోల్పోయే ప్రమాదం జాగ్రత్త అవసరం. కిం సంబంధ లోపాలు బయటపడతాయి. నిరంతర జపం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : శారీరక శ్రమ అధికం. పనుల్లో ఒత్తిడి అధికం. మానసిక ప్రశాంతత కోల్పోతారు. ఆలోచనల్లో మార్పులు ఉంాయి. కష్టకాలం అధికం. ప్రయత్నలోపం ఉంటుంది. పట్టుదల అవసరం. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం ఉత్తమ ఫలితాలనిస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : అనవసర ఖర్చులు అధికంగా ఉంాయి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. ఒత్తిడితో కూడిన ప్రయాణాలు చేస్తారు. పాదాల నొప్పులు అధికం. మానసిక వ్యధ ఎక్కువగా ఉంటుంది. సుబ్రహ్మణ్యాష్టకరం పఠించడం మంచి ఫలితాలనిస్తుంది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  సోదరుల ద్వారా ఆదాయం వచ్చే సూచన. ఆదర్శవంతమైన జీవితానికి ప్రయత్నం చేస్తారు. ఆశయాలు సమిష్టిగా ఉంాయి. ఇతరులపై ఆధారపడతారు. కంపెనీల్లో వాలకై ప్రయత్నిస్తారు. మొండితనంతో పనులు సాధిస్తారు. సుబ్రహ్మణ్యాష్టకరం పఠించడం మంచి ఫలితాలనిస్తుంది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. సంఘంలో గౌరవం కోసం ఆరట పడతారు. కీర్తి ప్రతిష్టలకై ఆలోచన పెరుగుతుంది. చేసే వృత్తులు ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఇతరులపై దయ చూపుతారు. రాజకీయాలకు కొంత అనుకూల సమయం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం ఉత్తమ ఫలితాలనిస్తుంది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  పరిశోధనలపై ఆసక్తి ఉంటుంది. అనవసర ఖర్చులు ఉంాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు. దూర ప్రయాణాలపై దృష్టి ఏర్పడుతుంది. విశాల భావాలు ఏర్పడతాయి. న్యాయ అన్యాయ విచారణ చేస్తారు. సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ మేలు చేస్తుంది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : ఊహించని ఇబ్బందులు పడతారు. అనుకోని ఖర్చులు ఉంాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ప్రమాదాలకు ఆస్తాకరం. చెడు సాహవాసాలు పెరుగుతాయి. పరాధీనం. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. అనారోగ్య భావన పెరుగుతుంది. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం ఉత్తమ ఫలితాలనిస్తుంది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సామాజిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. నూతన పరిచయాల వల్ల లోపాలు ఉంాయి. భాగస్వామ్య అనుబంధాలు తగ్గుతాయి. పదిమందిలో గౌరవం కోసం ఆరాటం పెరుగుతుంది. వ్యాపారస్తులు జాగ్రత్త వహించాలి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం ఉత్తమ ఫలితాలనిస్తుంది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : సోదరులతో అనుకూలత లభిస్తుంది. పోీల్లో గెలుపు ఉంటుంది. శతృవులపై విజయం సాధిస్తారు. ఋణాల బాధలు తీరుతాయి. గుర్తింపు లభిస్తుంది. శారీరక శ్రమ బాధించదు. ఆనందంగా ఉంటుంది. రోగనిరోధకశక్తి అధికం.  సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం ఉత్తమ ఫలితాలనిస్తుంది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : ఉన్నత విద్యలపై ఆసక్తి అంతగా ఉండదు. మానసిక ఒత్తిడి అధికం. సంతానం వల్ల సమస్యలు వస్తాయి. సృజనాత్మకతను కోల్పోతారు.పరిపాలన సమర్ధత అధికంగా ఉంటుంది. కళలపై ఆసక్తి తగ్గుతుంది. అనుకున్న పనులు పూర్తి కావు. ఆలోచనల్లో వైవిధ్యం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం ఉత్తమ ఫలితాలనిస్తుంది.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios