01ఏప్రిల్ 2019 సోమవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

today 1st april your horoscope

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : బద్ధకం పెరుగుతుంది. వాగ్దానాల వల్ల ఇబ్బంది. ఒత్తిడితో పనులు పూర్తిచేస్తారు. నిల్వ ధనాన్ని కోల్పోయే అవకాశం. కుటుంబంలో ఒత్తిడి పెరుగుతుంది. మాటల్లో కాఠిన్యం పెరుగుతుంది. తక్కువ మ్లాడడం ఎక్కువసేపు జపం చేయడం తప్పనిసరి చేయాలి.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : శారీరక శ్రమ ఉంటుంది. చేసే పనుల్లో ఆటంకాలు ఉంటాయి. పనుల్లో ప్రణాళికలు వేసుకుటాంరు. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికలు మార్చుకునే ప్రయత్నం. మొండి పట్టుదలతో కార్యసాధన. గుర్తింపు లభిస్తుంది. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నిస్తారు. అనవసర ప్రయాణాలు చేస్తారు. పాదాల నొప్పులు ఉంటాయి. అనవసర ఖర్చులు పెరుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. మానసిక ఒత్తిడి, చికాకులు అధికంగా ఉంటాయి. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం మంచిది. నిరంతర జపం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పనుల్లో కార్యసాధన ఉంటుంది. పెద్దల ఆశీస్సులు ఉంటాయి. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. శ్రమాధిక్యం ఉంటుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. సమిష్టి ఆదాయాలు వచ్చే సూచన. దానధర్మాలు చేయాలి. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం మంచిది. నిరంతర జపం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : అధికారులతో ఒత్తిడి ఉంటుంది. పనుల్లో శ్రమ అధికం ఉంటుంది. తోటి  ఉద్యోగులతో అప్రమత్తంగా మెలగాలి. అధికారిక ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. గుర్తింపు లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలకై ఆరాట పడతారు. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  దూర ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. విద్యార్థులు ఒత్తిడితో కాలం గడుపుతారు. దూరదృష్టి ఉంటుంది. పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. అనుకున్న పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి.సంతృప్తి లోపం ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం మంచిది. నిరంతర జపం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి. ఒత్తిడితో పనులు పూర్తిచేస్తారు. అనవసర ఇబ్బందులు ఉంటాయి. అనారోగ్య భావన ఏర్పడుతుంది. పరామర్శలు చేస్తారు. వ్యాపారస్తులు చేసే పనుల్లో జాగ్రత్త వహించాలి. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం మంచిది. నిరంతర జపం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  సామాజిక ఒత్తిడి ఉంటుంది. నూతన పరిచయాలు ఆటంకపరుస్తాయి. వ్యాపారస్తులకు జాగ్రత్త అవసరం. సమాజంలో గౌరవంకోసం ఆరాట పడతారు. భాగస్వామ్య అనుబంధాలు విస్తరించుకునే ప్రయత్నం. ఒత్తిడి అధికం అవుతుంది. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపుకోసం ఆరాటపడతారు. గౌరవం లభిస్తుంది. పోీల్లో గెలుపుకై ప్రయత్నం. శతృవులపై విజయానికి పథకాలు వేస్తారు. ఏ పనినైనా సాధించాలనే పట్టుదల ఉంటుంది. సంతృప్తి లభిస్తుంది. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం మంచిది. నిరంతర జపం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : మానసిక ఒత్తిడి ఉంటుంది. చిత్త చాంచల్యం అధికం. పనుల్లో చికాకులు ఉంటాయి. పట్టుదల ఉండదు. సంతాన సమస్యలు చికాకు కలిగిస్తాయి. సృజనాత్మకతను కోల్పోతారు. పనుల్లో అలసత్వం చేస్తారు. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం మంచిది. నిరంతర జపం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : గృహ పరమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది. సౌకర్యాలు నిరాసక్తతను కలిగిస్తాయి. ఆహారం సమయానికి తీసుకోవడం మంచిది. తల్లితో అనుబంధం తగ్గుతుంది. విద్యార్థులకు అధిక శ్రమతో తక్కువ ఫలితాలు సాధిస్తారు.చిత్త చాంచల్యాన్ని తగ్గించుకోవాలి. శ్రీ హయగ్రీవాయ నమః జపం  మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : మాతృవర్గీయుల సహాయ సహకారాలు, సోదర వర్గ సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. విద్యార్థులకు అనుకూల సమయం. ఉద్యోగంలో తోటి వారి సహాయ సహకారాలు ఉంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం మంచిది.  

డా.ఎస్.ప్రతిభ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios