మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : పోటీల్లో గెలుపు సాధిస్తారు. శ్రమతో ఒత్తిడి తగ్గించుకుంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఋణసంబంధ ఆలోచనలు తీరుతాయి. విద్యార్థులు అనుకున్న పనులు పూర్తిచేయడంకోసం శ్రమ పడతారు. లక్ష్యాన్ని సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. శ్రమకు తగిన గుర్తింపు లభించదు. కొంత ఘర్షణ ఏర్పడుతుంది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : సంతాన సమస్యలు వచ్చే సూచనలు. సంతానంకోసం ఆలోచిస్తారు. విద్యార్థులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. మానసిక చికాకులు పెరిగే సూచనలు ఉన్నాయి. సృజనాత్మకత లోపిస్తుంది. కళాకారులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేయడంలో కొంత ఒత్తిడి అవసరం అవుతుంది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సౌకర్యాలపై ఒత్తిడి పెరుగుతుంది. శ్రమతో సాధిస్తారు. సౌకర్యాలపై దృష్టి తగ్గించుకోవాలి. ఆహారంలో సమయపాలన అవసరం. అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. గృహ సంబంధ లోపాలు ఉంటాయి. పొట్టసంబంధ లోపాలు వచ్చే సూచనలు ఉన్నాయి.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సోదర వర్గీయుల సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి. అన్ని పనుల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేయడంలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : మాటల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. చిత్త చాంచల్యం ఉంటుంది. వాగ్దానాలు నెరవేరవు. మాటల్లో కాఠిన్యత ఉంటుంది. కుటుంబ సంబంధాలు దూరమయ్యే అవకాశం. ఆర్థిక నిల్వలు తగ్గే సూచనలు. అనవసర ఖర్చులు ఉంటా యి. దానధర్మాలు మేలు. మధ్యవర్తిత్వాల జోలికి పోకూడదు. ఎక్కువసేపు మౌనం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పనుల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. అనుకున్న పనులు పూర్తిచేయడంలో శ్రమ అధికంగా ఉంటుంది. ప్రణాళికలకు అనుగుణమైన పనులు జరగకపోవచ్చు. దగ్గరివారితో మాట పట్టింపులు వచ్చే సూచనలు ఉన్నాయి.  శ్రమకు తగిన ఫలితం రాకపోవచ్చు.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : విశ్రాంతి తక్కువౌతుంది. అనవసర ఖర్చులు ఉంటా యి. ప్రయాణాల్లో ఒత్తిడులు ఉంటా యి. ఆహారంలో సమయ పాలన మంచిది. దగ్గరి వారు దౌరమయ్యే సూచనలు. పరామర్శలు ఉంటా యి. వైద్యశాలల సందర్శనం ఉండవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కళాకారులకు అనుకూలం ఉంటుంది. సోదరవర్గీయుల ద్వారా ఆదాయం వచ్చే సూచనలు. పెద్దలంటే గౌరవం ఇచ్చేసూచనలు. ప్రచార, ప్రసార సాధనాలు విస్తరిస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. పనుల్లో సంతృప్తి వస్తుంది. ఆదర్శవంతమైన జీవితం కోసం ప్రయత్నం చేస్తారు.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. అధికారిక ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. సంఘంలో గౌరవం కోసం ఆరాటపడతారు. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. వాికోసం ఆలోచిస్తారు.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : విద్యార్థులకు అనవసర ఒత్తిడి ఏర్పడుతుంది. దూర ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. విజ్ఞాన యాత్రలు చేసే ఆలోచనలు ఉంటా యి. సంతృప్తి తక్కువగా ఉంటుంది. పెద్దలంటే గౌరవ మర్యాదలు ఉంటా యి. దూరపు ప్రయాణాలపై ఆశ పెరుగుతుంది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : ఊహించని ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. పరామర్శలు చేస్తారు. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. ధనం, సమయం, కాలం కోల్పోయే సూచనలు కనబడుతున్నాయి. అనవసర ఖర్చులు చేస్తారు. దానధర్మాలు మేలు.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సామాజిక అనుబంధాల్లో ఒత్తిడి పెరుగుతుంది. భాగస్వాములతో జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి. నూతన పరిచయస్తులతో జాగ్రత్త అవసరం. మోసపోయే ప్రమాదం ఉంటుంది. పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. పనుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది.

డా.ఎస్.ప్రతిభ