16ఏప్రిల్ 2019 మంగళవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

today 16th april 2019 your horoscope

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : విశ్రాంతి లభిస్తుంది. పనులలో అనుకూలత ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. రహస్య స్థావరాలపై దృష్టి పెడతారు. దూర ప్రయాణాలపై దృష్టి. విహార యాత్రలకై ఖర్చు చేస్తారు.  అన్ని రకాల ఖర్చులు ఉంటాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సమిష్టి ఆదాయాలు లభిస్తాయి. అన్ని విధాలా లాభ మార్గాలు ఉంటాయి. కంపెనీల్లో వాలకై ఆలోచన. స్త్రీల మూలక ధనం వచ్చే సూచన ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సంఘంలో గౌరవం పెరుగుతుంది. కీర్తిప్రతిష్టలపై దృష్టి ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత ఏర్పడుతుంది. సాంఘిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. రాజకీయాలపై దృష్టి. కళాకారులకు అనుకూల సమయం.శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : శుభకార్యాల్లో పాల్గొటాంరు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మృష్టాన్నభోజనం ఉంటుంది. విద్యార్థులకు అనుకూల సమయం. పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. సంతృప్తి లభిస్తుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : ఊహించని ఆనందాలు వస్తాయి. కళాకారులకు అనుకూల సమయం. క్రయ విక్రయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఇతరులపై ఆధారపడతారు. శ్రమలేని ఆదాయం వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. సౌఖ్యం లభిస్తుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  సామాజిక అనుబంధాల్లో ఒత్తిడి ఉంటుంది. సంప్రదింపుల్లో ఒత్తిడి వచ్చే సూచన. నూతన పరిచయస్తులతో జాగ్రత్త అవసరం. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. కళాకారులకు కష్టకాలం ఉంటుంది.  భాగస్వాములతో జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపుకోసం ఆరాట పడతారు. పోీల్లో గెలుపుకై తపన ఉంటుంది. శతృవులతో జాగ్రత్త అవసరం. రోగనిరోధక శక్తిని కోల్పోతారు. వృత్తి విద్యల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  సంతానం వల్ల సంతోషం కలుగుతుంది. సృజనాత్మక పెరుగుతుంది. కళలపై ఆసక్తి పెరుగుతుంది. కళాకారులకు అనుకూల సమయం. ఆత్మీయానురాగాలు పెరుగుతాయి.  మానసిక ప్రశాంతత లభిస్తుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సౌకర్యాల వల్ల సంతోషం కలుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. గృహ సౌఖ్యం అనుకూలంగా ఉంటుంది. వాహనాల వల్ల సంతోషం కలుగుతుంది. ఆహారంలో సమయ పాలన పాటి స్తారు. విద్యార్థులకు అనుకూల సమయం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సహకారం లభిస్తుంది. కళాకారులతో అనుకూలత ఏర్పడుతుంది. సహకారం వల్ల సంతోషం కలుగుతుంది. కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. విద్యార్థులకు అనుకూల సమయం.  ప్రసార సాధనాల వల్ల సంతోషం కలుగుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) :వాగ్దానాలు నెరవేరుతాయి. మాట విలువ పెరుగుతుంది.  కళాకారులకు అనుకూల సమయం. వాక్‌ చాతుర్యం బావుంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది.  శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : అనుకున్న పనులు పూర్తిచేస్తారు. పట్టుదలతో కార్యసాధన ఉంటుంది. పనులలో ప్రణాళిక ఉంటుంది. ఆలోచనా దృక్పథాల్లో మార్పులుఉంటాయి. సుఖదుఃఖాలు సమానంగా ఉంటాయి.   సుఖంపై ఆలోచన పెంచుకుటాంరు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios