13అక్టోబర్ 2018 శనివారం రాశిఫలాలు
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : అనారోగ్య సమస్యలు ఉంటాయి. దూర ప్రయాణాలకై ఆసక్తి చూపుతారు. అనవసర ఇబ్బందులు ఉంటాయి. వైద్య శాలల సందర్శనం ఉంటుంది. పరామర్శలు చేస్తారు. పదిమందిలో గౌరవంకోసం ఆరాటం పెరుగుతుంది. నూతన పరిచయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సుమంతోసుమంతో శ్రీకార్తవీర్యార్జునాయనమః జపం మంచిది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనుకోని కష్టాలు వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు. శ్రమలేని ఆదాయంపై దృష్టి ఉంటుంది. చెడు మార్గాలద్వారా ఆదాయ సంపాదన. పోటీల్లో నిలబడాలనే తత్వం. రోగనిరోధకశక్తి పెంచుకోవడం. సుమంతోసుమంతో శ్రీకార్తవీర్యార్జునాయనమః జపం మంచిది.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : నూతన పరిచయాల వల్లఒత్తిడి ఉంటుంది. భాగస్వాములతో అప్రమత్తత అవసరం. పదిమందిలో గౌరవంకోసం ఆరాటం. వ్యాపారస్తులు అప్రమత్తతగా ఉండాలి. అనవసర ఇబ్బందులు ఉంటాయి. మానసిక ఒత్తిడి అధికం.సంతృప్తిలోపం. సుమంతోసుమంతో శ్రీకార్తవీర్యార్జునాయనమః జపం మంచిది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పోటీల్లో గెలుపుకై ప్రయత్నం. శత్రువులపై విజయం సాధించే ప్రయత్నం. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపుకోసం ఆరాటపడతారు. అనారోగ్య సూచన ఉంటుంది. ఔషధ సేవనం చేస్తారు. సౌకర్యాలవల్ల సంతోషం కలుగుతుంది. ప్రయాణాలు అనుకూలత.సుమంతోసుమంతో శ్రీకార్తవీర్యార్జునాయనమః జపం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. సంతానంవల్ల ఒత్తిడి అధికంగా ఉంటుంది. సృజనాత్మకత తగ్గుతుంది. ఆత్మీయత తగ్గుతుంది. విద్యార్థులు ఒత్తిడితో ఫలితాలను సాధిస్తారు. కళలపై ఆసక్తి ఉంటుంది. వ్యాపారస్తుల సహకారం లభిస్తుంది. సుమంతోసుమంతో శ్రీకార్తవీర్యార్జునాయనమః జపం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సౌకర్యాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. గృహసౌఖ్యం లోపిస్తుంది. విద్యార్థులు శ్రమతో ఆనందమయంగా ఉంటారు. ఆహారంలో సమయపాలన అవసరం. వాగ్దానాలు నెరవేరుతాయి. కుటుంబంలో సంతోషం. సుమంతోసుమంతో శ్రీకార్తవీర్యార్జునాయనమః జపం మంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సేవకుల సహకారం లభిస్తుంది. విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. కమ్యూనికేషన్స్ అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక యాత్రలపై దృష్టి ఉంటుంది. ఆధ్యాత్మిక ఖర్చులు చేస్తారు. పరామర్శలు చేస్తారు. శారీరక శ్రమ ఉంటుంది. ఆలోచనల్లో ఉన్నతి ఉంటుంది. సుమంతోసుమంతో శ్రీకార్తవీర్యార్జునాయనమః జపం మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : మాట విలువ తగ్గుతుంది. తొందరపడి వాగ్దానాలు చేయరాదు. కుటుంబంలో ఇబ్బందులు ఉంటాయి. ఆర్థిక నిల్వలలను కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. నేత్ర సంబంధ వ్యాధులు. విహార యాత్రలకై ఖర్చు. అనవసర ప్రయాణాలు చేస్తారు. సుమంతోసుమంతో శ్రీకార్తవీర్యార్జునాయనమః జపం మంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : శారీరక శ్రమ ఉంటుంది. గుర్తింపుకోసం ఆరాటం ఉంటుంది. ప ఆలోచనకు తగిన కార్యాచరణ చేస్తారు. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం. అనారోగ్య సూచన ఉంటుంది. పరామర్శలు. జాగ్రత్తలు అవసరం. సుమంతోసుమంతో శ్రీకార్తవీర్యార్జునాయనమః జపం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : విజ్ఞాన యాత్రలపై దృష్టి ఉంటుంది. అనవసర ఖర్చులు చేస్తారు. విశ్రాంతికై ప్రయత్నం. పాదాల నొప్పులు ఉంటాయి. కంటి సంబంధ లోపాలు వచ్చే సూచన. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు. అధికారులతో అసౌకర్యం. సుమంతోసుమంతో శ్రీకార్తవీర్యార్జునాయనమః జపం మంచిది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : పెద్దలాశీస్సులు లభిస్తాయి. సంఘంలో గౌరవం పెంచుకునే ఆలోచన. కళలపై ఆసక్తి పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొనాలనే ఆలోచన. సజ్జన సాంగత్యం. సంతృప్తి లోపం. సుమంతోసుమంతో శ్రీకార్తవీర్యార్జునాయనమః జపం మంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : అనవసర ఒత్తిడిలు ఉంటాయి. సామాజిక ఇబ్బందులు. వృత్తి ఉద్యోగాదుల్లో జాగ్రత్త అవసరం. తమ పనులు తాము పూర్తిచేసుకునే ప్రయత్నం చేయాలి. వ్యాపారస్తులకు అప్రమత్తత. క్రయ విక్రయాల్లో లోపాలు జరిగే సూచన. అనారోగ్య భావన. సుమంతోసుమంతో శ్రీకార్తవీర్యార్జునాయనమః జపం మంచిది.
డా.ప్రతిభ