ఈ వారం (డిసెంబర్7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు) రాశిఫలాలు ఇలా ఉన్నాయి

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి

this week9dec7th to 14th) horoscope is here

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ఉన్నత విద్యలపై ఆసక్తి, ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. భాగస్వామ్యాలు విస్తరిస్తాయి. కుటుంబ అనుబంధాల్లో సంతృప్తికరంగా ఉంటాయి. పరిచయాలు పెరుగుతాయి.  అనుకోని ఇబ్బందులుటాంయి. ఆలోచనల్లో ఒత్తిడులు ఉంటాయి. అధికారుల వల్ల సమస్యలు పెరుగుతాయి. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. శ్రమాధిక్యం ఉంటుంది. లాభాల వల్ల ఒత్తిడులు తప్పవు. నిర్ణయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. గౌరవహాని జరగకుండాజాగ్రత్త పడాలి. అసంతృప్తి ఉంటుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : పోటీల్లో గుర్తింపు ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు కూడదు. అనుకోని సంఘటనలుటాంయి. వ్యతిరేకతలు పెరిగే సూచనలు ఉంటాయి. అనారోగ్యావకాశాలుటాంయి.      అధికారిక భాగస్వామ్య అనుకూలత ఉంటుంది. సౌకర్యాలు సంతోషాన్నిస్తాయి. ఆరోగ్యాలకు అవకాశం ఉంటుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. పెద్దవారితో అనుకూలత మంచిది. సోదరవర్గీయులతో అనుకూలత ఉంటుంది. సంప్రదింపుల్లో కొంత జాగ్రత్త అవసరం.ప్రయాణాల్లోఒత్తిడులు ఉంటాయి.సంతృప్తి లభిస్తుంది. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : అనుకున్న పనులు నెరవేరుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. కార్యనిర్వహణలో లోపాలుటాంయి. నూతన కార్యక్రమాలపై దృష్టి ఉంటుంది. వ్యతిరేక ప్రభావాలుటాంయి. పోటీల్లో గెలుపు సాధిస్తారు. భాగస్వాములతో కొంత ఒత్తిడి ఉంటుంది. అనుకోని సమస్యలు వస్తాయి. కుటుంబ విషయాల్లో మరియు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. పనులను వాయిదా వేయుట మంచిది. ఉన్నత విషయాలపై దృష్టి అవసరం. ఆర్థిక నిల్వలు కోల్పోయే సూచనలు. శ్రీ మాత్రేనమః జపం చేయడంమంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పోటీల్లో గుర్తింపు ఉంటుంది. శత్రువులపై విజయం ఉంటుంది. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. ఆహార విహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. సంతానం విషయంలో జాగ్రత్త అవసరం. ఆహార విహారాల్లో అనుకూలత ఉంటుంది. ఆలోచనల్లో ఒత్తిడి ఉంటుంది. సృజనాత్మకతను కోల్పోతారు. నిర్ణయాలు ఒకసారి ఆలోచించి తీసుకోవాలి. ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపంమంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : సంప్రదింపులు అనుకూలంగా ఉంటాయి. శుభ వార్తలు వింరు. దగ్గరి ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. విందు వినోదాల్లో, విహారాల్లో పాల్గొనే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యులతో అనుకూలంగా ఉంటారు. అనుకున్న పనులు పూర్తి చేయడంలో కొంత ఒత్తిడి ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. చేసే నిర్ణయాల్లో ఒత్తిడి ఉంటుంది. వ్యతిరేకతలను అధిగమించే ప్రయత్నం. ఒత్తిడి ఉన్నా విజయం సాధిస్తారు. శ్రీమాత్రే నమః జపం

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. నిల్వ ధనం పెంచుకునే ప్రయత్నం ఉంటుంది. మాల్లో చమత్కారం ఉంటుంది. సౌకర్యాలు పెంచుకుటాంరు. అధికారిక ప్రయాణాలుటాంయి. ఖర్చులు పెట్టుబడుల్లో అనుకూలత ఉంటుంది. ప్రయాణాల్లో సంతోషం ఉంటుంది. పోటీల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు. శత్రువులపై విజయానికి ప్రయత్నం. శ్రమాధిక్యం ఉంటుంది. వ్యతిరేకతల వల్ల జాగ్రత్త. శ్రీదత్త శ్శరణం మమ జపం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : నిర్ణయాల్లో అనుకూలత ఉంటుంది. సంతోషంతో కాలం గడుపుతారు. వ్యవహారాల్లో శుభ పరిణామాలు ఉంటారు. సంప్రదింపుల్లో లోపాలుటాంయి. కుటుంబంలో ఒత్తిడి ఉంటుంది. సహకారాలపై దృష్టి ఉంటుంది. శ్రమ ఉన్నా గుర్తింపు లభిస్తుంది. సౌకర్యాలపై దృష్టి ఉంటుంది. సంతాన సమస్యలు ఉంటాయి. సృజనాత్మక పెరుగుతుంది. నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : విందు వినోదాల్లో పాల్గొటాంరు. విశ్రాంతిగా గడిపే ఆలోచనలు ఉంటాయి. సమయం, కాలం, ధనం వ్యర్థం కాకుండా చూసుకోవాలి. భాగస్వాములతో సంతోషంగా ఉంటుంది. శారీరక శ్రమ ఉంటుంది. ఆరోగ్యవిషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కీర్తి ప్రతిష్టలు పెంచుకుటాంరు. శ్రమాధిక్యం ఉంటుంది. సౌకర్యాలపై దృష్టి ఉంటుంది. శ్రీరామజయరామ జయజయరామ జపం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : చేసే నిర్ణయాలు అనుకూలిస్తాయి. అన్ని పనుల్లో ప్రయోజనాలు ఉంటాయి. లాభాలు సంతృప్తినిస్తాయి. ఖర్చులు పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. అధికారిక ప్రయాణాలుటాంయి. ఉన్నత వ్యవహారాలపై దృష్టి ఉంటుంది. కుటుంబంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. మాట విలువ పెరుగుతుంది. నిల్వ ధనాన్ని పెంచుకుటాంరు. ఊహించని సంఘటనలుటాంయి. శ్రీదత్తశ్శరణం మమ జపం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : చేసే వృత్తిఉద్యోగాదుల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. ఖర్చులు, పెట్టుబడులు అనుకూలిస్తాయి. విశ్రాంతి లభిస్తుంది. సామాజిక గౌరవం పెంచుకుటాంరు. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. మొదలుప్టిెన పని పూర్తి చేస్తారు. పట్టుదలతో కార్యసాధన ఉంటుంది. శ్రమానంతరం ఫలితం లభిస్తుంది. భాగస్వాములతో అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబంలో కొంత ఒత్తిడులు ఉంటాయి. శ్రీదత్తశ్శరణం మమ జపం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సంతోషం ఉంటుంది. వచ్చిన లాభాలు ఆనందంగా ఉంటాయి. ఉన్నత విద్యలకు అనుకూలంగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరిగే సూచనలు. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత ఉంటుంది. అధికారులతో సంతోషం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. పెట్టుబడులపై దృష్టి ఉంటుంది. విశ్రాంతికోసం ప్రయత్నం ఉంటుంది. పనుల్లో జాగ్రత్త అవసరం. శ్రీమాత్రే నమః

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : పనుల్లో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాదుల్లో జాగ్రత్త అవసరం. సంప్రదింపులు అనుకూలిస్తాయి. అనుకోని సమస్యలు వచ్చే సూచనలు. సామాజిక గౌరవం పెరుగుతుంది. వచ్చిన ప్రయోజనాలు అనుకూలంగా ఉండవు. సంతృప్తి తక్కువగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. సంతాన సమస్యలు వచ్చే సూచనలు. ప్రయాణాల్లో అనుకూలత ఉంటుంది. పోటీల్లో గెలుపు. శ్రీదత్త శ్శరణం మమ జపం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios