మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : వృత్తి ఉద్యోగాదుల్లో గుర్తింపు లభిస్తుంది. స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. శారీరకమైన ఒత్తిడులుటాంయి. సామాజిక గౌరవం పెరుగుతుంది. పదోన్నతులపై దృష్టి ఉంటుంది. ఆహార విహారాలు సౌకర్యాదులు ప్రభావితం చేస్తాయి. శ్రమతో కార్యనిర్వహణ శక్తి పెరుగుతుంది. మ్లాడే ధోరణిలో కొంత జాగ్రత్త అవసరం. పెద్దలాశీస్సులకు అనుకూలం ఏర్పడుతుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ప్రయాణాలుటాంయి. సంప్రదింపుల్లో కొంత అప్రమత్తంగా ఉండాలి. గౌరవలోపం ఉంటుంది. జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. గుర్తింపు లభిస్తుంది. ఉన్నత విద్యలపై దృష్టి ఉంటుంది. ఉద్యోగాదులపై ప్రత్యేక దృష్టి పెడతారు. నిర్ణయాదుల్లో తొందరపాటు పనికిరాదు. దగ్గరి లేదా దూర ప్రయాణాలను గూర్చిన చర్చ ఉంటుంది. ఆధ్యాత్మిక, వైజ్ఞానిక వ్యవహారాలకు చాలా అనుకూలం.    శ్రమతో కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. స్నేహానుబంధాలు పెంచుకుటాంరు. లాభాలు సంతోషాన్ని  సంతృప్తినీ ఇస్తాయి.   విశ్రాంతిని కోరుకుటాంరు. ప్రయాణాదులకు అవకాశం ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : అనుకోని సమస్యలుటాంయి. అనారోగ్య భావనలు కూడా ఇబ్బంది పెడతాయి. కార్యనిర్వహణలో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాలం ధనం వ్యర్థంగా కోల్పోయే అవకాశం ఉంటుంది. కుటుంబ ఆర్థికానుబంధాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. పరిశోధనలు వెలుగు చూస్తాయి. గౌరవం పెంచుకుటాంరు. నిర్ణయాదుల్లో కొంత జాగ్రత్త అవసరం. వ్యతిరేకతలపై విజయం ఉంటుంది. చర్చలు ఫలిస్తాయి. భాగస్వామ్యాల్లో కొంత జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : భాగస్వామ్యాలు సంతోషాన్నిస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో చర్చలు ఫలిస్తాయి. స్నేహానుబంధాలు విస్తరించే అవకాశం ఉంటుంది. నిర్ణయాదుల్లో అనుకూలత ఏర్పడుతుంది. లాభాలు ఉన్నా ఆశించినంత తృప్తి లభించకపోవచ్చు. అన్ని పనుల్లో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. కాలం, ధనం, శ్రమ వ్యర్థం అయ్యే సూచనలు ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు పెరిగే సూచనలు ఉన్నాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఉన్నత ఉద్యోగాలు ప్రభావితం చేస్తాయి. పోటీల్లో జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : వ్యతిరేక ప్రభావాలు అధికంగా ఉంటాయి. పోటీలు ఉన్నా విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. శ్రమ తప్పకపోవచ్చు. పోటీరంగంలో గుర్తింపు లభిస్తుంది. గౌరవాదులుటాంయి. అధికారిక వ్యవహారాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు పనికిరాదు. పరిచయాలు పెంచుకుటాంరు. అనుబంధాలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. నిర్ణయాదులు ప్రభావితం చేస్తాయి. లాభాలు ఉన్నా ఉపయోగపడకపోవచ్చు. సౌకర్యాలపై దృష్టి పెరుగుతుంది. అనారోగ్య భావన ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. అభీష్టాలు నెరవేరుతాయి. సంతానంతో సంతోషంగా గడుపుతారు. ప్రణాళికాబద్ధకమైన జీవితం ఉంటుంది. సృజనాత్మకత పెరుగుతుంది. స్పెక్యులేషన్స్‌ అనుకూలిస్తాయి. లాభాలపై దృష్టి ఏర్పడుతుంది. దూర ప్రయాణాల్లో కొంత జాగ్రత్త అవసరం. సంతృప్తి తక్కువగా ఉంటుంది. వ్యతిరేకతలు ఉంటాయి. పోటీలకు తట్టుకునే స్థితి ఏర్పడాలి. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. గుర్తింపుకోసం ప్రయత్నం చేస్తారు. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : ఆహార విహారాదులు ప్రభావితం చేస్తాయి. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు విద్యపై దృష్టి పెడతారు. గృహ వాహనాదుల విషయంలో ప్రత్యేక దృష్టి ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమ ఉంటుంది. కొన్ని అనుకోని ఒత్తిడులు ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. సంతాన వ్యవహారాల్లో ముఖ్య నిర్ణయాదులుటాంయి. పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసుకోవాలి. సుదూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. సేవకవర్గంతో సంప్రదింపులు ఉంటాయి. శ్రీమాత్రేనమః జపం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  సంప్రదింపులు ఉంటాయి. అనేక రకాల వార్తలు వింయి. దగ్గరి ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. ఇతరుల సహకారం లభిస్తుంది. భాగస్వామ్య వ్యవహారాల్లో కొంత జాగ్రత్త ఉంటుంది. ఉన్నత విద్య, ఉద్యోగాదులు ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు ప్రభావితం చేస్తాయి. ఆహార విహారాలకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సౌఖ్యంగా కాలం గడుపుతారు. శ్రమ ఉన్నా విద్యార్థులకు అనుకూల సమయం. గృహ వాహనాదుల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. ఆర్థిక నిల్వలపై దృష్టి ఉంటుంది. మాటతీరు లాభిస్తుంది. కొన్ని అనుకోని ఇబ్బందులు కూడా ఉంటాయి. పోటీరంగంలో కొంత జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది.  మంచి వార్తలను వింరు. కమ్యూనికేషన్స్‌ లాభిస్తాయి. ఉన్నత విద్య, ఉద్యోగాదులపై దృష్టి కేంద్రీకరిస్తారు. భాగస్వామ్యాల్లో కొంత జాగ్రత్త అవసరం. గౌరవంకోసం ఖర్చులు చేస్తారు. ఆహార విహారాలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. విద్యా విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. శ్రీమాత్రేనమః జపం చేసుకోవడం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : ఆత్మవిశ్వాసం పెంచుకుటాంరు. నిర్ణయాదులు లాభిస్తాయి. కార్యనిర్వహణ దక్షత ఏర్పడుతుంది. బాధ్యతలు బాగా పెరుగుతాయి. భాగస్వామ్యాలపై ప్రత్యేకదృష్టి ఉంటుంది. ఆలోచనల్లో తొందరపాటు కూడదు. మాటతీరులో సంతృప్తి ఉంటుంది. నిల్వధనం పెంచుకుటాంరు. అధిగమించాల్సి వస్తుంది. సహకార లాభాలు సంతోషాన్నిస్తాయి. ఆధ్యాత్మిక ప్రయాణాలకు అనుకూలం. సౌఖ్యంకోసం వెచ్చిస్తారు. శ్రీమాత్రేనమః జపం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : ఖర్చులు పెట్టుబడులుటాంయి. విశ్రాంతి లభిస్తుంది. ప్రయాణాలకు కూడా అవకాశం ఉంటుంది. దానధర్మాల వల్ల మేలు కలుగుతుంది. సౌకర్యలోపాలుటాంయి. ఆహార విహారాల్లో తొందరపాటు పనికిరాదు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కార్యనిర్వహణ దక్షత ఉంటుంది. అనేక బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుంది. గుర్తింపు గౌరవాదులు ఉంటాయి. భాగస్వామ్యాల్లోనూ శుభపరిణామాలు ఉంటాయి. ఆలోచనల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. వృత్తిపరమైన గుర్తింపు శ్రమ ఉంటుంది. శ్రీమాత్రేనమః జపం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : అన్ని పనుల్లో ప్రయోజనాలు ఆశిస్తారు. లాభాలు సంతోషాన్నిస్తాయి. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. సంతాన వ్యవహారాల్లో ముఖ్య నిర్ణయాలుటాంయి. సంప్రదింపుల్లో కొంత జాగ్రత్త అవసరం. ఖర్చులు పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి. విశ్రాంతిగా గడుపుతారు. వ్యతిరేక ప్రభావాలను అధిగమించే ప్రయత్నం చేస్తారు. పోటీలున్నా విజయం సాధిస్తారు. ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. సౌకర్యాల విషయంలో ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. కార్యనిర్వహణ దక్షత ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. శ్రీమాత్రేనమః జపం మంచిది.

డా.ఎస్.ప్రతిభ