ఈ వారం(28జూన్ నుంచి 4జులై వరకు) రాశిఫలాలు

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి

this week 28th june to 4th july your horoscope

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. బంధువర్గంతో సమావేశం ఏర్పాటుచేస్తారు. మాట విలువ పెరుగుతుంది. ఆర్థిక నిల్వలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆత్మీయులను కలుసుకుంటారు. సంప్రదింపులకు అనుకూలం. కొన్ని వార్తల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇతరుల సహకారం విషయంలో జాగ్రత్తలు అవసరం. సోదరవర్గంతో అప్రమత్తంగా మెలగాలి. అధికారుల, స్త్రీ వర్గ సహకారం లభిస్తుంది. గౌరవలోపం రాకుండా చూసుకోవాలి.  ఆహార విహారాలపై దృష్టి ఉంటుంది. గృహ, వాహనాదులను సమకూర్చుకుంటారు. శ్రీమాత్రేనమః జపం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. నిర్ణయాదులు లాభిస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. అనేక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది. శ్రమ ఉంటుంది. ఫలితం అనుకూలం. కార్యనిర్వహణ సమర్థంగా ఉంటుంది. గుర్తింపు గౌరవాలు లభిస్తాయి. కుటుంబ వ్యవహారాలపై దృష్టి. బంధుమిత్రులతో చిన్న చిన్న ఇబ్బందులున్నా సంతోషంగానే గడుపుతారు. మాటల్లో కొంత చమత్కార ధోరణి, కొంత అధికారిక భావన ఉంటుంది. నిల్వధనంపై దృష్టి ఉన్నా కొంత బలవంతంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. భాగస్వామ్యాల్లో స్నేహానుబంధాల్లో అనుకూలత.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : వేరు వేరు రూపాల్లో ఖర్చులు చేయాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలకు అనుకూలం. దానధర్మాల వల్ల మేలు కలుగుతుంది. పెట్టుబడులలో పాజివిటీ ఉండాలి. పరామర్శలకు అవకాశం ఏర్పడుతుంది. పదిమంది శ్రేయస్సుకోసం కాలం ధనం వినియోగించండం మంచిది. నిర్ణయాదుల్లో కొంత తొందరపాటు, తత్తరపాటు ఉంటుంది. ఆత్మవిశ్వౄసం ఉన్నా కొంత భయం, ఒత్తిడి తప్పకపోవచ్చు. ఆనందంగా గడపాలని ఉన్నప్పికీ ఆరోగ్య సమస్యలకు అవకాశం ఉంటుంది. నిర్ణయాదుల్లో స్పష్ట అవసరం. శ్రీమాత్రేనమః జపం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : లాభాలు ప్రభావితం చేస్తాయి. అన్ని పనుల్లోనూ ప్రయోజన దృష్టి ఉంటుంది. పెద్దల ఆశీస్సులకోసం ప్రయత్నిస్తారు. సోదరవర్గంతోనూ అనుకూలత ఏర్పడుతుంది. కార్యనిర్వహణలో తెలియని అనుకూలత ఉంటుంది. వ్యర్థంగా ఖర్చులుంటాయి. కాలం, ధనం వ్యర్థం కాకుండా చూసుకోవాలి. తొందరపాటు కూడదు. సౌఖ్యంపై మనసు ఉంటుంది. కాని ఇబ్బందులకు ఆస్కారం. పెట్టుబడుల్లో అప్రమత్తంగా మెలగాలి. దానధర్మాల వల్ల మేలు కలుగుతుంది. విందులు, వినోదాలుంటాయి. ఆత్మవిశ్వాసంతో కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం. శ్రీమాత్రేనమః జపంమంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : వృత్తిపరమైన గుర్తింపు లభిస్తుంది. అధికారిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు ఉంటా యి. సామాజిక గౌరవం పెరుగుతుంది. పితృవర్గ వ్యవహారాలపై దృష్టి పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాల్లో అనుకూలతలు ఉంటా యి. వ్యవహారాల్లో శుభపరిణామాలు ఉంటా యి. అధికారుల ఆదరణ కూడా ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. వారాంతరలో ఖర్చులు పెట్టుబడులు ఉంటా యి. పరామర్శలకు అవకాశం. విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. విందు, వినోదాలలో తొందరపాటు కూడదు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. దానధర్మాల వల్ల మాత్రమే మేలు కలుగుతుంది. శ్రీమాత్రేనమః జపం మంచిది.

 

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  ఉన్నత వ్యవహారాలకు అనుకూలం. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. కీర్తిప్రతిష్టలు పెంచుకుంటారు. విద్యా, పరిశోధన రంగాల్లో శుభపరిణామాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ, ప్రయాణాలపై దృష్టి ఏర్పడుతుంది. వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. వృత్తి ఉద్యోగాదుల్లో గుర్తింపు లభిస్తుంది. అధికారుల ఆదరణ ఉంటుంది. సామాజిక గౌరవం, గుర్తింపు పెరుగుతుంది. ప్రమోషన్‌లు, నూతన పదవులకు అనుకూలం. తండ్రి వర్గానికిసంబంధించిన వ్యవహారాల్లో పాల్గొంటారు. అన్ని పనుల్లో శ్రమ ఉన్నా అనుకూలత ఉంటుంది. శ్రీమాత్రేనమః జపంమంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. అనుకోని సమస్యలుంటాయి. తొందరపాటు చర్యలవల్లఇబ్బంది ఏర్పడుతుంది. ముఖ్య నిర్ణయాదులను వాయిదా వేసుకోవాలి. ఊహించిన సంఘటనలుంటాయి. కొన్ని శ్రమ రహిత ప్రయోజనాలు. వాటి వల్ల సమస్యలు ఉత్పన్నం కావచ్చు. మధ్యమంలో కీర్తి ప్రతిష్టలకు అవకాశం. తక్కువ శ్రమతో ఎక్కువ గుర్తింపు ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమాలకు ప్రణాళికలుంటాయి. ఆధ్యాత్మిక ప్రయాణాల వల్ల మేలు కలుగుతుంది. లక్ష్యాలను సాధిస్తారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు.  శ్రీమాత్రేనమః జపం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  భాగస్వామ్యాల్లో అనుకూలత ఏర్పడుతుంది. పరిచయాలు పెంచుకుంటారు. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వ్యాపారాదుల్లో అనుకూలత ఏర్పడుతుంది. స్త్రీవర్గంతో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. స్నేహానుబంధాలు గుర్తుకు వస్తాయి. పాత మిత్రుల ఫోన్‌ కాల్స్‌ అందుతాయి. అన్ని పనుల్లోనూ జాగ్రత్త. వేరు వేరు రూపాల్లో సమస్యలుంటాయి. వ్యాపారాదుల్లో కొంత వరకు మేలు జరుగుతుంది. అధికారులు, టా క్స్‌ పేమ్స్‌ెం సౌఖ్యాలు, ఫ్యాన్సీ వ్యవహారాలన్నింలోనూ అప్రమత్తంగా మెలగాలి. తొందరపాటు కూడదు. శ్రీమాత్రేనమఃజపంమంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : వ్యతిరేక ప్రభావాలు అధికం. పోటీలు ఒత్తిడులున్నా అధిగమించాల్సిన అవసరం ఉంది. శ్రమతో కార్యక్రమాలను నిర్వహిస్తారు. పోటీరంగంలో అనుకూలత, ఋణాదుల ఇబ్బంది తగ్గిపోతుంది. అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలసిపోయే అవకాశం. భాగస్వామ్యాల్లో అప్రమత్తంగా మెలగాలి. పరిచయాలు ఇబ్బందిపెట్టే సూచనలు. అన్ని పనుల్లోనూ ఇబ్బందులుంటాయి. ప్రమాదాలకు అవకాశం. తొందరపాటు పనికిరాదు. మానసిక ఒత్తిడులు తప్పకపోవచ్చు. ఉన్నత వ్యవహారాలు, లక్ష్యాలను సాధించే ప్రయత్నం చేస్తారు. శ్రీమాత్రేనమః జపం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : ప్రణాళికాబద్ధమైన వ్యవహారాలు ఉంటా యి. ఆలోచనలు ఫలిస్తాయి. సృజనాత్మకత పెంచుకుంటారు. నూతన కార్యక్రమాలపై దృష్టి పెడతారు. సంతానవర్గ వ్యవహారాలు సంతోషాన్నిస్తాయి. కొన్ని పోటీలు తప్పకపోవచ్చు. మనోభీష్టాలు నెరవేరుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. వ్యతిరేకతలు అధికంగా ఉంటా యి. చికాకులు కొన్ని ఉన్నా శ్రమతో అధిగమిస్తారు. గుర్తింపు లభిస్తుంది. నిర్ణయాదులకు అనుకూలం. వ్యాపార భాగస్వామ్యాలకు అనుకూలం. పరిచయాలు స్నేహబంధాలకు అనుకూలత ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామజపం.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : ఆహార విహారాలకు అనుకూలం. సౌఖ్యాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. విందులు వినోదాలు సంతోషాన్నిస్తాయి. కృషితో కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. గృహ వాహనాది సౌకర్యాలు పెంచుకుంటారు. మాతృవర్గ వ్యవహారాల్లో సంతృప్తి ఉంటుంది. విద్యారంగంలోని వారికి గుర్తింపు లభిస్తుంది. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. మానసిక ఒత్తిడులుంటాయి. సంతానవర్గంతో అనుకూలత ఏర్పడుతుంది. సృజనాత్మకత పెంచుకుంటారు. కొత్త పనులపై దృష్టి ఉన్నా కొంతజాగ్రత్త అవసరం. శ్రీమాత్రేనమః జపం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సంప్రదింపులకు అనుకూలం. ఇతరులకు సహకరించే ప్రయత్నం చేస్తారు. దగ్గరి ప్రయాణాలుంటాయి. సోదరవర్గంతో అనుకూలత ఏర్పడుతుంది. రచనలకు గుర్తింపు లభిస్తుంది. ఆహార విహారాలపై దృష్టి పెడతారు. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం చేస్తారు. కొన్ని ఒత్తిడులుంటాయి. గృహ వాహనాది సౌకర్యాలు శ్రమకు గురిచేసే అవకాశం. విద్యారంగంలోని వారికి ఇబ్బందులు. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. అన్ని పనుల్లోనూ జాగ్రత్తగా మెలగాలి. ఆలోచనలకు రూపకల్పన మానసికంగా కొంత ఒత్తిడి ఉంటుంది. శ్రీమాత్రేనమః జపం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios