Asianet News TeluguAsianet News Telugu

ఈ వారం( ఏప్రిల్ 12 నుంచి 18వరకు) రాశిఫలాలు

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి

this week(12th april to 18th april) your horoscope
Author
Hyderabad, First Published Apr 12, 2019, 10:41 AM IST

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : సౌకర్యాదులను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆహార విహారాలుాంయి. వ్యాపార పరమైన పెట్టుబడులకు అవకాశం ఉంటుంది. ఆలోచనలు విస్తరిస్తాయి. అన్ని పనుల్లోనూ ప్లానింగ్‌తో చేస్తారు. ఆధ్యాత్మిక యాత్రలకు అనుకూలంగా ఉంటుంది. కొంత అసంతృప్తి కూడా ఏర్పడుతుంది. సంతానవర్గ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. విందులు విలాసాలకోసం వెచ్చిస్తారు. విహార యాత్రలకు అనుకూలం. శారీరకమైన ఒత్తిడులు ఉంాయి. విజయ సాధనకోసం ప్రయత్యం చేస్తారు. వ్యతిరేక ప్రభావాలుాంయి. జాగ్రత్త. శ్రీ మాత్రే నమః జపం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : సంప్రదింపులకు అనుకూలంగా ఉంటుంది. ఇతరుల సహకారం లభిస్తుంది. పెద్దలాశీస్సులు లభిస్తాయి. వ్యాపార లాభాలుాంయి. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు.ఆహార విహారాలపై దృష్టి పెరుగుతుంది. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. ప్రయాణాల్లో అనుకూలత ఏర్పడుతుది. అనుకోని ఇబ్బందులు వస్తాయి. అనారోగ్య సూచనలు ఉన్నాయి. సంతానవర్గం అనుకూలత ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంాయి. కొత్త వార్తలు అందే సూచనలు ఉన్నాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : కుటుంబలో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక నిల్వలపై దృష్టి సారిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. శ్రమ ఉన్నా గుర్తింపు లభిస్తుంది. సంప్రదింపులకు అనుకూలంగా ఉంటుంది. సహకాలు లాభాలనిస్తాయి. కొత్త వార్తలకు అవకాశం ఉంటుంది. దగ్గరి ప్రయాణాలు తప్పక పోవచ్చు. భాగస్వామ్యాల్లో కొంత జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : బాధ్యతల నిర్వహణ పెరుగుతుంది. శారీరక ఒత్తిడులు ఉన్నా గుర్తింపు లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలకు అవకాశం ఏర్పడుతుంది కుటుంబ ఆర్థికాంశాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుాంయి. మాట విలువ పెరుగుతుంది. నిల్వధనం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. వ్యతిరేక ప్రభావాలుాంయి. శ్రమ ఉన్నా కార్య నిర్వహణ చేస్తారు. ఉన్నత లక్ష్యాలపై దృష్టి సారిస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : ఖర్చులు పెట్టుబడులుాంయి. విందులు విహారాలు సౌఖ్యం కోసం వెచ్చి స్తారు. ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బాధ్యతలను నిర్వహిస్తారు. అనేక కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అవసరం ఏర్పడుతుంది. గుర్తింపు లభిస్తుంది. నిర్ణయాదుల్లో అనుకూలత ఏర్పడుతుంది. కార్యనిర్వహణపై దృష్టి సారిస్తారు. బాంధవ్యాల్లో శుభ పరిణామాలు ఉంాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  కొన్ని లాభాలు కనిపిస్తున్నాయి. ప్రయోజనాలు వచ్చే సూచనలు అధికం. భాగస్వామ్య వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుాంయి. పెట్టుబడుల్లో అనుకూలత ఏర్పడుతుది. ప్రయాణాలు లాభిస్తాయి. విందులు వినోదాలపై దృష్టి పెడతారు. పరామర్శలు తప్పనిసరి అవుతాయి. సౌకర్యాల వల్ల ఒత్తిడి, చికాకులు ఏర్పడతాయి. ఇబ్బందులకు గురిచేస్తాయి. నిర్ణయాలు సంతోషాన్నివ్వవు. బాధ్యతల నిర్వహణ పెరుగుతుంది. సంతృప్తి తగ్గుతుంది. అధికారులతో కొంత ఒత్తిడి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : అధికారిక వ్యవహారాలపై దృష్టి ఏర్పడుతుంది. సామాజిక గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. వ్యాపారాదుల్లో అనుకూలత ఏర్పడుతుంది. అన్ని పనుల్లో ప్రయోజనాలుాంయి. లాభాలు సంతోషాన్నిస్తాయి. పెద్దలాశీస్సులు లభిస్తాయి. సంప్రదింపుల్లో కొంత జాగ్రత్త అవసరం. వార్తల వల్ల కొంత ఇబ్బంది ఏర్పడవచ్చు. పోీలు ఒత్తిడులున్నా, చికాకులు ఉన్న విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది.  విశ్రాంతికోసం ప్రయత్నం చేస్తారు. అధికారులతో జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  లక్ష్యాలను సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అన్ని పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. ఉన్నత విద్యలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగవాకాశాలు పెరుగుతుఆయి. చేసే వృత్తిలో గుర్తింపు, రాణింపు ఉంాయి. కుటుంబ ఆర్థికాంశాల్లో కొన్ని ఇబ్బందులుాంయి. మాటల్లో కొంత నైరాశ్య ధోరణి ఉంటుంది. సంతానవర్గంతో సంతోషం ఏర్పడుతుంది. సృజనాత్మక పెరుగుతుంది. అన్నిపనుల్లో మధ్యమ ప్రయోజనాలుాంయి. కొంత సంయమనం అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : అనుకోని సమస్యలుాంయి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. అనారోగ్య భావనలు ఉంాయి. కార్యనిర్వహణల్లో సమస్యలు ఏర్పడుతాయి. వాిని అధిగమిస్తారు. సౌకర్యాలపై దృష్టి పెడతారు.అనుకున్న లక్ష్యాలను చేరుకుాంరు. ఉన్నత వ్యవహారాలపై దృష్టి పెరుగుతుంది. గౌరవం, హోదా పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ధార్మిక అధ్యాత్మిక విషయాలపై దృష్టి ఉంటుంది. పరిశోధనలకు అవకాశం ఏర్పడుతుంది. పదోన్నతులపై దృష్టి పెడతారు. హోదా పెంచుకునే ప్రయత్నం చేస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : భాగస్వామ్యాలపై దృష్టి పెడతారు. సామాజిక అనుబంధాలు  పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సంప్రదింపులకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార వర్గ సహకారం లభిస్తుంది. క్రమంగా అనుకోని సమస్యలు ఎదురయ్యే సూచనలు. అనారోగ్య సూచన కనబడుతుంది. జాగ్రత్త అవసరం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడంమంచిది. సౌకర్యాలు ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు అనుకూల సమయం. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : వ్యతిరేక ప్రభావాలను అధిగమించాలి. పోీలు ఉన్నాఒత్తిడులున్నా వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. గుర్తింపుకోసం ప్రయత్నిస్తారు. శ్రమాధిక్యం ఉంటుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. మాటల్లో చమత్కార ధోరణి పెరుగుతుంది. క్రమంగా భాగస్వాములతో అనుకూలత ఏర్పడుతుంది. పరిచయాలు, స్నేహసంబంధాలు విస్తరిస్తాయి. లాభాలు కొన్ని ఉన్నా ఆశించిన సంతోషం లభించకపోవచ్చు. ఊహించని సంఘటనలకు అవకాశం ఉంటుంది. జాగ్రత్త అవసరం.  శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సంతానవర్గం వారితో సంతోషం ఏర్పడుతుంది. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. ప్రణాళికబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. తీసుకునే నిర్ణయాల్లో శుభపరిణామాలు చోటు చేసుకుాంయి. వ్యాపారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. క్రమంగా వ్యతిరేక ప్రభావాలను అధిగమిస్తారు. పోీలు ఉన్నా విజయం సాధిస్తారు. కార్యక్రమాల్లో శ్రమతో గుర్తింపు సాధిస్తారు. ఆత్మ విశ్వాసం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో కొన్ని ఒత్తిడులు ఏర్పడతాయి. ఆర్థిక నిల్వలు తగ్గే సూచనలు ఉన్నాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios