జులై నెల రాశిఫలాలు

జులై మాస ఫలాలు ఇలా ఉన్నాయి

this july month horoscope

1. మేషం : వీరికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. గృహ, కుటంబ విషయాలలో ఆనందప్రద వాతావరణం ఉంటుంది. జనసహకారం ప్రయోనాత్మకంగా ఉండును. ఆరోగ్యం బాగుండును. విద్యార్ధులకు ఉత్తమ సమయం. చేతికి అందాల్సిన  సొమ్ము  అందుతుంది. కుటుంబ ఆనందానికి సొమ్ముని ఖర్చు చేస్తారు. 12,13,14 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా  మంచిది. వీరికి  దత్తాత్రేయ స్తోత్ర పారాయన, శివారాధన, సుబ్రహ్మన్యారాధన శ్రేయస్కరం.

2. వృషభం: వీరికి వారికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. గృహ, కుటుంబ విషయాలలో వాతావరణం అనుకూలం. వీరికి  ఆరోగ్యం బాగుండును. సోదర జన సహకారం అనుకూలంగా ఉంటుంది. స్నేహ సంబంధాలను  కాపాడుకోవడం కోసం, స్వప్రయోజనాలను వదలడం జరుగుతుంది. వృత్తి స్థానంలో క్రింది ఉద్యోగుల సహకారంతో పనులు పూర్తి చేయగలుగుతారు. మ్లాడేటప్పుడు ఆచి తూచి వ్యవహరించాలి. 15, 16 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి విష్ణ్వారాధన, శివారాధన, దుర్గాస్తోత్ర పారాయణ శ్రేయస్కరం.

3. మిధునం : వీరికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. గృహ, కుటుంబ విషయాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్ధులకు అనుకూల సమయం.ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. శత్రువులు కూడ మిత్రులుగామారే అవకాశం. తమ విలాసాలకు అధికంగా ఖర్చు చేస్తారు. తమకు రావలసిన సొమ్ము చేతికి అందుతుంది.  ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. 17,18 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి నవగ్రహ స్తోత్రపారాయణ, ఆదిత్యహృదయస్తోత్ర పారాయణ, సుబ్రహ్మణ్యారాధన, దత్తాత్రేయ స్తోత్ర పారాయణ శ్రేయస్కరం.

4. కర్కాటకం : వీరికి గోచారగ్రహస్థితి శుభా శుభ మిశ్రమం. గృహ, కుటుంబ విషయాల్లో అనుకూల వాతావరణం. సంతానవర్గం సాధించే విజయాలు మీకు ఆనందాన్నిస్తాయి. ఆర్ధిక పరిస్థితులు బాగుాంయి.మీలో క్రియాశీలత పెరుగుతుంది. ఇతరులకు అవసరమైన కార్యక్రమాలను చేయడంవలన గౌరవాన్ని వృద్ధి చేసుకుాంరు.  ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవవసరం.  ఆధ్యాత్మిక విషయాసక్తి పెరుగుతుంది. 19,20,21 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి ఆదిత్యహృదయ స్తోత్ర పారాయణ, సుబ్రహ్మన్యారాధన, విష్ణ్వారాధన, నవగ్రహ స్తోత్ర పారాయణ శ్రేయస్కరం.

5. సింహం: వీరికి గోచార గ్రహస్థితి శుభా శుభ మిశ్రమం. గృహ, కుటుంబ విషయాలలో ఆనందప్రద వాతావరణం.  రావలసిన సొమ్ము చేతికందుతుంది. ఆర్ధిక లాభాలు సమకూరుతాయి. దూరప్రయాణాలు సూచితం. విద్యావిషయాల్లో ఆసక్తి పెరుగుతుంది. వృత్తిలో అధికారుల మన్ననలు పొందుతారు.22,23,24 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి సుబ్రహ్మణ్యారాధన, విష్ణ్వారాధన, శివారాధన శ్రేయస్కరం.

6. కన్య : వీరికి శీఘ్రగమన గోచార గ్రహస్థితి అనుకూలంగా ఉండును. వృత్తి, ఉద్యోగ విషయాల్లో పదోన్నతి మరియు ఆర్ధిక లాభాలు సూచితం. ఈ రాశి వారికి సోదరుల వలన లాభాలు చేకూరుతాయి. జనసహకారం ప్రయోజనకరం. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్ధులు సత్ఫలితాలకొరకు సాధన యెక్కువ చేయవలెను. 25,26 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి దత్తాత్రేయస్తోత్ర పారాయణ, శివారాధన, దుర్గాస్తోత్ర పారాయణ శ్రేయస్కరం.

7. తుల : వీరికి గోచారగ్రహస్థితి అనుకూలం.  వృత్తి, ఉద్యోగ విషయాల్లో పదోన్నతి సూచితం. ఆరోగ్యం బాగుండును. ఆధ్యాత్మిక సంపద చేకూరును. మాట విలువ పెరగటం, కుటుంబ సౌఖ్యం వృద్ధి చెందటం సూచితమౌతున్నది.  దూరప్రయాణలకు ఆస్కారమున్నది. 27,28 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి సుబ్రహ్మణ్య ఆరాధన, దుర్గాస్తోత్ర పారాయణ శ్రేయస్కరం.

8. వృశ్చికం : వీరికి శీఘ్రగమన  గోచార గ్రహస్థితి అననుకూలం. సంతానవర్గం వారు అభివృద్ధిని సాధించగల్గుతారు. మీరు చేసే పనులు ఇతరులకు ఉపకరించేవిగా ఉంాయి.  ఆచితూచి మ్లాడడం ద్వార గౌరవం వృద్ధి చెందే అవకాశం ఉన్నది. అనుకోని ఖర్చులు ఇబ్బందిని కలిగిస్తాయి.  29,30 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా  మంచిది. వీరికి నవగ్రహస్తోత్ర పారాయణ, ఆదిత్యహృదయ స్తోత్ర పారాయణ, సుబ్రహ్మణ్య ఆరాధన, విష్ణ్వారాధన, లక్ష్మీ ఆరాధన, దుర్గాస్తోత్ర పారాయణ శ్రేయస్కరం.

9. ధనుస్సు : వీరికి గోచారగ్రహస్థితి శుభా శుభ మిశ్రమం. ఆకస్మిక ధనలాభం సూచితం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. విద్యార్ధులకు అనుకూల సమయం. సేవక జనసహకారం లభిస్తుంది. 31,3,4,5 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా  మంచిది. వీరికి నవగ్రహస్తోత్ర పారాయణ, ఆదిత్యహృదయ స్తోత్ర పారాయణ, సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ ఆరాధన, శివారాధన, దుర్గాస్తోత్ర పారాయణ శ్రేయస్కరం.

10.మకరం : వీరికి గోచారగ్రహస్థితి శుభా శుభ మిశ్రమం. పొీ రంగంలో విజయావాకాశములు అధికం. ఆరోగ్యం బాగుండును. దానధర్మాలు అధికంగా చేస్తారు. ఆధ్యాత్మికంగా ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక సంబంధాల విషయంలో జాగ్రత్త అవసరం. 6,7 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి సుబ్రహ్మణ్య ఆరాధన, విష్ణ్వారాధన,  లక్ష్మీ ఆరాధన, శివారాధన, గణపతి ఆరాధన శ్రేయస్కరం.

11. కుంభం : వీరికి శీఘ్ర గమన గోచారగ్రహస్థితి అనుకూలం.  పొీ రంగంలో విజయావకాశాలు అధికం. గృహ, కుటుంబ విషయాల్లో ఆనందప్రద వాతావరణం. విద్యార్ధులకు ఇది ఉత్తమ సమయం. ఆర్ధిక ప్రయోజనాలు బాగుాంయి. మీ క్రింది  ఉద్యోగులు ఇచ్చే సలహాలు  బాగా ఉపకరిస్తాయి.  నిర్ణయాలు తీసికొనే విషయంలో ఏకాగ్రత లోపంవలన చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 8,9 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి దత్తత్రేయస్తోత్ర పారాయణ, దుర్గా స్తోత్ర పారాయణ శ్రేయస్కరం.

12. మీనం : వీరికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. గృహ, కుటుంబ విషయాల్లో ఆనందప్రద వాతావరణం.  వీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక విషయాసక్థి పెరుగుతుంది. ఇతరులకు మేలు చేస్తారు. గౌరవం వృద్ధి చెందుతుంది. సంతాన వర్గం అభివృద్ధి చెందుతుంది. విద్యార్ధులకు అధిక శ్రమ సూచితం. 10,11 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి శివారాధన, సుబ్రహ్మణ్యారాధన, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ, విష్ణ్వారాధన,  దుర్గాస్తోత్ర పారాయణ శ్రేయస్కరం.

డా.ఎస్.ప్రతిభ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios