డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

సూర్యుడు మేషరాశికి చెందిన భరణి నక్షత్రం 4 వ పాదంలో ప్రవేశించినది మొదలుకొని వృషభరాశి లోని రోహిణి నక్షత్రం మొదటి పాదం దాటే వరకు గల మద్య కాలాన్ని “కర్తరీ” అంటారు. దీన్నే వాస్తు కర్తరి అంటారు. అంటే భరణి నాలుగో పాదం, కృత్తిక నాలుగు పాదాలు, రోహిణి మొదటి పాదం మొత్తం ఆరు పాదాలలో సూర్యుడు ఉన్న కాలం కర్తరీ అంటారు. దీనినే “కత్తెర” అనికూడ అంటారు. కర్తరి నక్షత్ర కాలంలో సూర్యుడు నిప్పులు చెరుగుతాడు. డిగ్రీలలో చెప్పాలంటే మేషరాశిలో(డిగ్రీల 23°-20′ నిమిషాలు) నుండి వృషభరాశిలో (డిగ్రీల 26°-40′ నిమిషాలు).

మనకు 27 నక్షత్రాలు, 12 రాశులు ఉన్న సంగతి తెలుసు. ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాల చొప్పున మొత్తం 27 X 4=108 పాదాలు. 12 రాసులతో భాగిస్తే ఒక్కోరాశికి 9 పాదాలొస్తాయి. మొదటి రాశి మేషం, సాధారణంగా ఒక రోజు తేడాలో ఏప్రిల్ 14న సూర్యుడు ఈ రాశిలో ప్రవేశిస్తాడు. దీనినే సూర్య సంక్రమణం అంటాం. తమిళులకు ఇది నూతన సంవత్సరారంభం. సూర్యుడు భరణి నక్షత్రంలో 3, 4 పాదాలలో ఉన్నపుడు డొల్లు కర్తరి అని, కృత్తిక నక్షత్రంలో ఉండగా అగ్ని కర్తరి అని అంటాం. కృత్తిక నాలుగు పాదాలులో అగ్నిలేక పెద్ద కత్తిరి నడచేటప్పటికి రోహిణీ కార్తె ప్రారంభమౌతుంది. కర్తరి అంటే 
కర్త + అరి = కర్తరి అంటే పని చేసేవానికి శత్రువు అని అర్ధం. కర్తరి అనగా ఏమి? కర్తరీలో ఎటువంటి పనులు చేయవచ్చు?

కర్తరీలో చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. కర్తరిలో గృహ సంబంధమయిన పనులు చేయవద్దు అన్నారు. పూర్వపు రోజులలో వేసవిలో గృహ సంబంధమయిన పనులు తప్పించి మరొక పని వుండేడి కాదు. వేసవి వడగాడ్పుల వలన రక్షణకే ఈ కర్తరి కాలంలో పని వద్దన్నారు. నిజానికి నక్షత్రమాన ప్రకారంగా వచ్చే కార్తెలు కర్షక, కార్మిక పంచాంగం అనచ్చు. 

కర్తరి అంటే కత్తెర అని అర్ధం, ఎండలో పని కత్తెరన్నమాట. సుమారు మే 4 నుండి 28 వరకు వేసవి కాలంలో కర్తరి ఉంటుంది, ఆ సమయంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఆ తరవాత చల్లబడుతుంది కనక పనులు కర్తరి వెళ్ళిన తరువాత నుండి మొదలుపెట్టచ్చని చెప్పి ఉంటారు. వేసవిలో కార్మికుల భద్రతకోసం ఎంత గొప్ప ఏర్పాటు చేసారో చూడండి. ఈ కార్తెలు ఒక రోజు ఇంచుమించులో ప్రతి సంవత్సరం ఒకలాగే వస్తాయి.

కర్తరీలో చేయకూడని పనులు:- కర్తరీలో చెట్లు నరకటం, నార తీయటం, వ్యవసాయ ఆరంభం, విత్తనాలు చల్లటం, భూమిని త్రవ్వటం, తోటలు వేయటం, చెఱువులు, బావులు, కొలనులు త్రవ్వటం, నూతన గృహ నిర్మాణం చేయటము, కప్పులువేయుట, స్లాబులు, నిర్మాణ పనులు చేయరాదు.

కర్తరీలో చేసుకోదగిన పనులు:- కర్తరీలో ఉపనయనం, వివాహం, గృహప్రవేశము, నిశ్చితార్దాలు, శాంతులు, నవగ్రహ హోమములు, యజ్ఞం, మండపాదులను కప్పటం వంటి పనులు చేయవచ్చును.

మే 4 నుంచి 28వ తేదీ వరకు కర్తరి కొనసాగుతుంది. మే 4వ తేదీ మధ్యాహ్నం 03:14 ని. షాలకు శ్రీ ప్లవానామ సంవత్సర చైత్ర బహుళ నవమి మంగళవారం రోజున రవి భరణి నక్షత్రం 3వ పాదంలోకి ప్రవేశించడంతో చిన్న"డొల్లు" కర్తరి ప్రారంభమౌతుంది. మే 11 మధ్యాహ్నం 12:36 ని.లకు కృత్తికా నక్షత్రం లోకి రవి ప్రవేశించడంతో పెద్ద కర్తరి ప్రారంభమగుతుండి. 28 మే రాత్రి 8: 05 ని.  త్యాగమవుతుంది. ఈ సమయంలో శంఖుస్థాపనులు, చెక్కపనులు, తాపీ పనులు చేయరాదు. 

ఈ కర్తరి సమయంలోవాతావరణ మార్పులు ఎక్కువగా ఉంటాయి. ఇక అగ్ని కర్తరి వచ్చేసరికి ఎండలు ముదరడంతో అగ్నిప్రమాదాలు నీటి ఎద్ధడి ఉంటుంది. సుడిగాలుల తాకిడికి నిర్మాణాలు పడిపోవచ్చు. అందుకే ఏ పనులూ చేయవద్దన్నారు. చెట్లు నరకడం, వ్యవసాయ పనుల ప్రారంభం, నూతులు, బావులు, చెరువులు తవ్వడం మొదలైన పనులపై నిషేధం పెట్టారు. ఈ సంవత్సరం మే 11 నాటికి రోహిణీ కార్తె వచ్చేస్తుంది, భరించలేని వేడి ఉంటుంది. అందుకు ఈ పదిహేను రోజులూ కూడా పై చెప్పిన పనులు వద్దన్నారు.