డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151


 
మార్చి 30 తేది మొదలు గురువు ధనుస్సురాశి నుండి మకరరాశిలో ప్రవేశం చేసి 30 జూన్ 2020 వరకు అక్కడే ఉంటాడు. గురువుకు మకరరాశి నీచ స్థానం అవుతుంది, శుభాల్ని ఇచ్చే గురువు నీచ పడడం వలన నిస్సహాయంగా ఉండిపోతాడు. ఇలాంటి సమయంలో  దుష్ట గ్రహాలు తమ బలం పెంచుకుని ఆధిపత్య పోరును కొనసాగిస్తాయి. గురువు మకరరాశిలో మూడు నెలల పాటు ఉంటాడు, ఈ సమయంలో ఎక్కువ సమస్యలు, ఇబ్బందులను ఎదుర్కునేవి  ఆరు రాశులు అవి 1.కుంభరాశి, 2. సింహరాశి, 3. మిధునరాశి, వీరితో పాటు 4. తులారాశి, 5. వృశ్చికరాశి, 6. మకరరాశి వారలు పలు సమస్యలను ఎదుర్కునే అవకాశాలు సూచిస్తున్నాయి. వ్యక్తి గత జాతక ఆధారంగా ఫలితాలలో హెచ్చు తగ్గులు ఉంటాయి. పుట్టిన తేదీ ఆధారంగా జాతక చక్రం వేయించుకుని మీకున్న సమస్యలకు తగిన 'రేమిడి' ఫాలో అయితే ఉపశాంతి లభిస్తుంది.

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంది. దీని బారినపడి అనేక మంది చనిపోతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు లాక్ డౌన్ చేశాయి. ప్రజలు ఎవరు కూడా బయటకు రావడం లేదు. పరిస్థితి మున్ముందు కూడా ఉంటుందని పంచాంగ గోచార గ్రహస్థితులు సూచిస్తున్నాయి. ఏప్రిల్ 8వ తేదీన బుధుడు మీనరాశిలోకి అడుగుపెడుతున్నాడు. మార్చి 29 న గురువు మకరరాశిలోకి ప్రవేశం చేసాడు.

రాజైన బుధుడు నీచ స్థానంలోకి వెళ్లడం, మీనరాశి బుధ గ్రహనికి నీచ స్థానం కావడం, అక్కడ రవితో కలిసి ఉండటం, జ్ఞాన శక్తిని ప్రసాదించే గురువు కూడా నీచ స్థానంలోకి వెళ్లిపోవడం, అందులోను పాప గ్రహమైన కుజుడు ఉచ్ఛ స్థానంలో పొందడం, కుజుడికి మకరరాశి ఉచ్చ స్థానం అవుతుంది. మకరరాశి శనిదేవునికి స్వక్షేత్రం అవుతుంది. మకరంలో శని, కుజుడు కలిసి ఒకే ఇంట్లో ఉన్నారు. శని, కుజుడు కలయిక శాస్త్ర సూత్ర ప్రకారం యుద్ధ ప్రభావం సూచిస్తుంది. అతే కాకుండా శని గ్రహం యొక్క దృష్టి తృతీయ దృష్టితో మీనంలో ఉన్న రవి, బుధుల మీద పడింది. రవి, శనుల మధ్య ఎప్పుడూ విభేదాలు ఉంటాయి. 

ఈ గ్రహ స్థానాలు, దృష్ట్యుల కారణంగా ఏప్రిల్ 8 నుండి ఏప్రిల్ 24 వరకు దేశంలో అత్యంత జాగ్రత్తతో ఉండవలసిన  గ్రహ పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ ప్రభావం దేశంలోని మతపరమైన అంతర్ కలహాలు కావచ్చు, కరోనా వ్యాధి మరింత విజ్రుంభించే అవకాశాలు ఉన్నాయి, లేదా సరిహద్దులలో పొరుగు దేశాలతో ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఈ ఏప్రిల్ నెలలో ప్రజలు సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎవరైతే  భారత సనాతన  ధర్మాన్ని పాటించకుండా, హింసా మార్గాన్ని అనుసరిస్తారో వారికి మరింత ప్రమాదకరమైన సమయమని చెప్పవచ్చు.

బుధుడు నీచ స్థానంలో ఉన్నాడంటే వైరస్ ప్రభలే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. మే 4 వ తేదీ వరకు ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాదాపు ఏప్రిల్ నెల అంతా దేశ ప్రజలకు ఒక పీడకలలా ఉండిపోతుంది. ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. సినిమా రంగం కుదేలైపోతుంది. ప్రజా వ్యవస్థలో అనేక రంగాలు కుదేలైపోతాయి. దేశ ఆర్థిక వ్యవస్థ దాదాపు క్షీణించేపోయే స్థితికి వస్తుంది. మే 4వ తేదీ నుండి పరిస్థితులు కాస్త చల్లబడుతూ శుభ పరిణామాలు వచ్చే అవకాశం ఉంది. అప్పటి నుండి ఆర్థిక పరిస్థితులు మారతాయి. ఏప్రిల్ 25 తేదీ నుండి బుధడు మీనరాశి నుండి మేషరాశిలోకి అడుగు పెడతాడు, రవి గ్రహం కూడా బుధుడితో పాటు మేషరాశిలోకి ప్రవేశం చేస్తాడు, అప్పటి నుండి సామాజిక పరిస్థితులు చక్కబడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

ప్రస్తుతం మన ప్రధాన సమస్య 'కరోనా వైరస్' యావత్ ప్రపంచాన్ని ఈ మహమ్మారి ప్రాణాలతో చెలగాటం ఆడుతూ, మానవ జాతిని గడగడలాడింస్తుంది. ఈ ప్రపంచంలో అన్ని దేశాల కన్నా భారతదేశానికి ఓ ప్రత్యేకత ఉంది. సనాతన ధర్మానికి పుట్టినిల్లు, మన దేశం కర్మభూమి ,వేదభూమి, ఎందరో మహనీయులకు జన్మనిచ్చిన భూమి మన దేశం. కాబట్టి మనం అంతగా భయపడ నవసరంలేదు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడిగారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కే.సి.ఆర్ గారు వీరు అందరిలా సాధారణ 'నాయకులు' కారు సంస్కృతీ సాంప్రదాయాలతో పాటు మంచి విచక్షణ కలిగిన రాజకీయ చతురులు, ఎంతటి సమస్యనైన అలవోకగా ఎదుర్కునే ప్రజ్ఞ కలవారు. 

ఒక ఇంటికి తండ్రి పెద్దదిక్కుగా ఉన్నప్పుడు పిల్లలకు ఏ చీకు చింత ఉండదు, అలాగే అన్ని విషయాలలో సంపూర్ణ అవగాహాన కలిగిన నాయకులు మనకు ఉన్నందుకు మనం  ధైర్యంగా ఉండాలి, గర్వ పడాలి. ప్రస్తుత పరిస్థితులలో మనం చేయవలసింది ఒక్కటే ప్రభుత్వ సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ మనవంతుగా స్వయం గృహ నిర్భంధం అవుదాం, హాయిగా కుటుంబ సభ్యులతో ఇంట్లో ఉంటూ ఆత్మీయతలను పంచుకుందాం, శుచి శుభ్రతలు పాటిస్తూ ఒళ్ళు, ఇల్లే కాదు మన పరిసర ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉంచుకుందాం. అవసరాలకు మించి పోకుండా విలాస వంతమైన జీవితానికి స్వస్తి చెప్పి అన్నింట్లో పొదుపు పద్దతులను అవలంభిద్దాం. మనతో పాటు ఈ లోకంలో ఎన్నో జీవులు ఉన్నాయి మానవత్వంతో వాటికి మన శక్తి సామర్ధ్యాలకు తగ్గట్టుగా చేతనైన సహాయం చేద్దాం. 

ప్రభుత్వ సూచనలు గౌరవిస్తూ వ్యక్తి గతంగా మనల్ని మనం కాపాడుకుంటూ మన కుటుంబాన్ని, మన ఊరు, రాష్ట్రం, దేశాన్ని కాపాడుకుందాం. సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ, ఆచరిస్తూ జీవహింస లేకుండా, ప్రకృతి హాని తలపెట్టకుండ  కర్తవ్య భాద్యతతో  సైనికుడిలా దేశ ప్రగతికి చేయికలుపుదాం. ఎందరో మహానుభావులు పుట్టిన దేశం మనది. మనం వారి స్పూర్తిగా తీసుకుని వారు చూపిన మార్గంలో నడుద్దాం, ఒక విషయం అనుకుంటే సరిపోదు ఆచరిస్తేనే  సాధ్యం పడుతుంది మనోభిష్టం ఫలించాలి ఆనందంగా జీవించాలి అంటే ఆచరించక తప్పదు... జై శ్రీమన్నారాయణ.