అనంతపద్మనాభ చతుర్దశి ప్రత్యేకత

ఈ అనంతుడు అనేవాడు ఎవడు? ఈతను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. అతనికే అనంతుడు అనిపేరు. విశ్వానికంతికీ ఆది, అంతం అన్నీ తనే. అన్నీ అతనిలోనే ఉన్నాయి.

speciality of anatha padmanabha chaturdashi

భాద్రపద శుక్ల చతుర్దశి అనంత పద్మనాభ చతుర్దశి. అనంతుడు అనేవాడు త్రిమూర్తులలో ఒకడైన విష్ణుమూర్తి పేరు. దీనికి త్రయోదశితో కూడిన చతుర్దశి పనికిరాదు. చతుర్దశి తర్వాత పూర్ణిమ కొద్దిగా ఈ వ్రతం చేయడానికి శ్రేష్టమైనది. ఈ అనంతుడు అనేవాడు ఎవడు? ఈతను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. అతనికే అనంతుడు అనిపేరు. విశ్వానికంతికీ ఆది, అంతం అన్నీ తనే. అన్నీ అతనిలోనే ఉన్నాయి. ఈ చైతన్యానికి మూల రూపం. మనలో ఉన్న చైతన్యం అతడే. ఈ చైతన్యం లేకపోతే ఏమీ లేదు. చైతన్యానికి ప్రతీకనే ఈ అనంతుడు. విశ్వమంతా వ్యాపించి ఉన్న తాను అన్ని నిండి ఉన్న తాను తాను ఇచ్చిన ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని తిరిగి తనకు ఇచ్చే ప్రయత్నం చేయడమే ఈ వ్రతం యొక్క ఉద్దేశం.

వ్రతకథ : కౌండిన్య మహాఋషి భార్య ఒకసారి అడవిలో కొంతమంది ఈ వ్రతం చేయడం చూసి తానుకూడా చేసుకుని అష్టైశ్వర్యాలను పొందింది. కొంత కాలానికి ఋషి తన భార్యయైన సుశీల చేతికి ఎర్రి తోరాన్ని చూసి తనను వశపరచుకోవడానికై ఈ తోరం కట్టుకున్నదని భ్రమపడి దానిని తీసి మంటలో పడవేసాడు. ఆమె ఆతోరాన్ని పాలల్లో కడిగి తీసిప్టిెనది. ఈ తోరాన్ని పారవేసినందుకుగాను ఋషి అష్టైశ్వర్యాలు పోయాయి. అప్పుడు అతనికి జ్ఞానోదయం కలిగి అనంతుడిని వెతుక్కుంటూ వెళ్ళాడు.

అలా వెళుతూ ఉన్నప్పుడు అతనికి ఒక మామిడిచెట్టు, ఆవు, ఎద్దు, కొలనులు, గాడిద, ఏనుగు ఇవన్నీ కనిపించి వాటి ని గురించి అడిగాడు. పూర్వజన్మలో విద్యావంతుడైన బ్రాహ్మణుడు అయి ఉండి ఎవరికీ ఆయన విద్య చెప్పనందున ఈ  జన్మలో పురుగుల మామిడిచెట్టై ప్టుట్టాడు. ఆ చెట్టునిండా పళ్ళు ఉంట్టాయి కాని ఆ చెట్టు మీద ఒక్క పిట్టకూడా వాలడం లేదు.

అన్నీరకాల భోగభాగ్యాలు ఉండి కూడా ఎవరికీ అన్నదానం చేయని దోష కారణంగా ఈ జన్మలో పచ్చిగడ్డి  చాలా ఉండి కూడా అక్కడ ఏమీ తినకుండా ఆ గడ్డి చుట్టూ తిరిగే గోవుగా జన్మించారు.

దానం చేసే వస్తువు ఎదుటి వారికి ఉపయోగపడేదిగా ఉండాలి. చవిభూమిని దానం చేసిన కారణంగా ఒక రాజు ఈ జన్మలో గడ్డి మేతమేయలేని ఎద్దుగా ప్టుట్టాడు.

రెండు కొలనులలో నీరు ఒకదానిలోనించి మరొకదానిలోకే పారుతాయి. కారణం ఏదైనా వస్తువు బయివారికి వాయనం ఇస్తే బయికి పోతుందని ఇద్దరు తోటి కోడళ్ళు తమలో తామే తీసుకునేవారు. కాబ్టి ఎవరికీ ఉపయోగపడకుండా అలా ఉన్నాయి. అవి ధర్మం ఒకి అధర్మం ఒకి.

ఎప్పుడూ ఎదుటి వారిని దూషించేవారు ఒకరు ఈ జన్మలో గాడిద అయి ప్టుట్టాడు.

ఒకరు పెద్దలు ఏర్పాటు చేసిన ధర్మాన్ని విక్రయించి స్థితిమంతుడైనందున ఈ జన్మలో ఏనుగుగా ప్టుట్టాడు అని వివరించాడు.

ఈ అనంత పద్మనాభ వ్రతంలో ముఖ్యంగా మనం తెలుసుకునేది అన్నీ పనులు చేయాలి. ఎవరికైనా దానం ఇచ్చే వస్తువు ఉపయోగకరమైనదిగా ఉండాలి కాని పనికిరాని వస్తువును దానం ఈయకూడదు అనే విషయాల్ని ఖచ్చితంగా తెలియ జెప్తున్నారు.

భారతీయ సంప్రదాయంలో ప్రతి నోముకి వ్రతానికి ఏదో ఒక దానం ఇవ్వడం ఆనవాయితీగా ఉంది. దానికి కారణం  ఇచ్చే అలవాటును చేసుకోవాలి అని. ఆ రూపకంగానైనా తాము ఉపయోగించే వస్తువులు ఎదుటి వారికి ఇస్తారు అనే ఉద్దేశం భారతీయ సంప్రదాయంలోనే నిక్షిప్తమై ఉన్నది. కాబ్టి ఈ విధానాలను ఆచరించినవారు బ్రతికినంతకాలం ఆనందగా బ్రతుకుతూ పోయే ముందు ఎవరినీ బాధపెట్టకుండా ఉంటారు.

డా.ఎస్ ప్రతిభ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios