చాంద్రమానం పాటించే తెలుగువారు సౌరమానం ప్రకారం జరిపే పర్వదినాలలో ఇది ఒక పండుగ. తెలుగువారికి ఇతర పండుగల వలె ఇది తిథి ప్రధానమైన పండుగ కాదు. ఈ పండుగను దక్షిణాయనానికి ఆఖరురోజుగా, ధనుర్మాసానికి కూడా ఆఖరిరోజుగా జరుపుకుటాంరు. మకర సంక్రమణానికి పూర్వపురోజు ఈ పండుగ చేస్తారు. అయితే దీనికి భోగి పండుగ అనే నామం ఎలా వచ్చింది?

రైతులకు పంట పర్యాయాలు ముగిసి ఈ పండుగనాటికి ఇంటికి వచ్చేస్తాయి. వాళ్ళకు వ్యవసాయ పనుల రద్దీ తగ్గి సుఖంగా కాలక్షేపం చేయడానికి కావలసిన విశ్రాంతి కూడా దొరుకుతుంది. చేతికి అందిన పంటను అనుభవానికి తెచ్చుకొని భోగభాగ్యాలు అనుభవించడానికి రైతులకు వీలు కలిగించే పండుగ కాబ్టి దీనికి భోగి పండుగ అనే పేరు వచ్చింది. దీనిని బ్టి భోగి అనగా సుఖానుభవం కల పండుగ అని అర్థం వస్తుంది.

విష్ణుచిత్తుని కూతురు గోదాదేవి. ఆమెకు వివాహ సమయం ఆసన్నమైనది. తాను శ్రీరంగంలో ఉన్న శ్రీరంగనాయకులను తప్ప మానవ మాత్రులను ఎవరినీ వివాహం చేసుకోనని తండ్రితో చెప్పింది. తన ఈ కోరిక తీరడం కోసం ధనుర్మాస వ్రతం  నెలరోజులు చేసి ఆ నెలరోజులలోనూ తాను పొంగలి మాత్రమే ఆహారంగా తీసుకుంటూ తాను రచించిన కృతులను రంగనాథ స్వామికి అర్పించింది. అది పూర్తి కాగానే స్వామి ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకుటాంనని శ్రీరంగం రమ్మని ఆదేశిస్తాడు. ఆమెకు సమస్త భోగాలను సమకూరుస్తానాండు. విష్ణుచిత్తుడు ప్రజలందరి సమక్షంలో వారి వివాహం జరిపిస్తాడు.  వివాహ తంతు పూర్తి కాగానే ఆమె గర్భాలయంలోకి వెళ్ళి స్వామివారి పక్కన కూర్చుండి వారి పాదాలు సమీపించి స్వామి వారిలో ఐక్యం పొందుతుంది. ఇంతి విషయం జరిగిన పుణ్యం దినం కాబ్టి దీనికి భోగి. గోదాదేవికి అంతి భోగభాగ్యాలు కూర్చిన రోజు సామాన్య జనానికి కూడా సమస్త భోగభాగ్యాలు ఇచ్చేరోజు భోగి పండుగ అయ్యింది.

మామూలు అర్థంలో కూడా భోగి అంటే పండుగ ముందురోజు అనే అర్థం వస్తుంది. ఈ భోగి ఉండ్రాళ్ళ తద్దికి ముందు రోజు కూడా చేస్తారు. కాని ఇది ఎక్కువగా ప్రచారంలో వాడుకలో ఉన్నది మాత్రం మకర సంక్రాంతికి మాత్రమే. ఈ మకర సంక్రాంతికి కొన్ని గ్రంథాల్లో భోగి సంక్రాంతి అనే పేరు కూడా వాడబడుతూ ఉంది.

భోగిరోజున ఉదయం భోగి మంటలు వేసి చలికి కాపుకాచుకుటారు. పాటలు పాడుకుంటూ భోగిమంటల చుట్టూ తిరుగుతూ ఉంటారు. తమలోని అహంకారాలన్నీ అగ్నికి అర్పిస్తున్నట్లుగా ఈ పండుగను ప్రతీకగ చెప్తారు. మిగతా కాలలో  మంటలు వేసుకునే అవసరం ఉండదు. ఇప్పుడు మాత్రమే చలిని తట్టుకునే శక్తికి ప్రతీకగా కూడా చెప్పవచ్చు. చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోయడం అనేది దృష్టి పరిహారార్థం చేసే క్రియగా చెపుతారు. ఇందులో రేగుపళ్ళు, చిల్లర పైసలు, చెరుకు ముక్కలు వేసి తలపై నుంచి దిగువారా పోస్తారు. ఇలా చేయడం వల్ల ఆ పిల్లలకు ఆయుర్వృద్ధి కలుగుతుందని నమ్మకం