1. కార్తీక్‌ రాజా

భవిష్యత్తు ఎలా ఉంటుంది?

మీకు వావాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. వాటి ని అధిగమించాలి. మీరు బద్ధకాన్ని తగ్గించుకొని కష్టపడితే ఆధ్యాత్మిక రంగంలో మంచి ఉన్నతస్థితి ఏర్పడుతుంది. మీరు కొంత ప్రయత్నం చేస్తే విదేశాల్లో స్థిరత్వం లభిస్తుంది. ప్రస్తుతం సమయం అనుకూలంగానే ఉన్నది. 2020 జనవరి తర్వాత ఒక సంవత్సరం పాటు అన్ని పనుల్లో ఒత్తిడి ఉంటుంది.  అన్నిని కోల్పోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్తవహించండి.

జపం : శ్రీ రామ జయరామ జయజయ రామరామ

దానం : నూనె / పల్లీలు, 2. గోధుమపిండి/ గోధుమరవ్వ / చపాతీలు; 3. కూరగాయలు, ఆకుకూరలు దానం చేయడం అన్నివిధాలా మంచిది.

2. భవ్య

ప్రేమించినవాడితో వివాహం జరుగుతుందా?

మీరు మీ ఇద్దరి జాతకాలు జననతేది, జనన సమయం, జనన స్థలం, నక్షత్రం మూడు పూర్తిగా పంపితే జాతకం చూసి ఏమైనా చెప్పడానికి అవకాశం ఉంటుంది.

3. శశికళ

కొత్త ఉద్యోగం ఎప్పుడు వస్తుంది?

అక్టోబర్‌ 2019 తర్వాత సమయం అనుకూలంగా ఉన్నది. అప్పుడు ప్రయత్నం చేయండి. జీవితంలో సిటి ల్‌మెంటు కూడా అప్పుడు ఉంటుంది.

మీకు సహజంగా కొంత బద్ధకం ఉంటుంది. దానిని తగ్గించుకుంటే జీవితంలో ఉన్నతస్థానంలోకి వెళతారు. ప్రతీరోజూ యోగా, ప్రాణాయామాలు, వాకింగ్‌ తప్పనిసరిగా చేయాలి. ఆహారాన్ని నమిలి తినాలి. ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవాలి.

దానం : నూనె / పల్లీలు 2. పళ్ళు / విద్యార్థులకు పుస్తకాలు, 3. కూరగాయలు / ఆకుకూరలు / పెసరపప్పు, 4. గోధుమపిండి / గోధుమరవ్వ / చపాతీలు వీటి ని దానం చేయాలి.

జపం : శ్రీ రాజమాతంగ్యైనమః. శ్రీరామ జయరామ జయజయ రామరామ.

4. సుష్మగౌడ్‌

వివాహం ఎప్పుడు అవుతుంది?

మీకు 2022 తర్వాత సమయం బావుంది. వివాహ ప్రయత్నాలు అప్పుడే చేయండి. ఇప్పుడు అనవసరంగా సమయాన్ని, ధనాన్ని శ్రమను వృథా చేసుకోకండి. జపం దానం చేస్తూ ఉండండి.

జపం : కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే, శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం

దానం : పళ్ళు / విద్యార్థులకు పుస్తకాలు, 2. కూరగాయలు/ ఆకుకూరలు / పెసరపప్పు నిరంతరం దానం చేస్తూ ఉండడండి. ఇవి నిరంతరం దానం చేస్తూ పైన చెప్పి చెప్పిన జపం నిరంతరం చేస్తూ ఉంటే 2022లో మీకు అనుకూలమైన ఆనందకరమైన వివాహం తక్కువ శ్రమతో పూర్తి అవుతుంది.

5. ప్రవీణ్‌ నగేష్‌

భవిష్యత్తు ఎలా ఉంది?

2020 తర్వాత మంచి సమయం వస్తుంది.  అప్పుడు అన్నికీ అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం సమయం అంత అనుకూలంగా లేదు. మీకు కొంచెం బద్ధకం అధికంగా ఉంటుంది. దానిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అన్ని పనులు అనుకూలం అవుతాయి. భవిష్యత్తు కూడా బావుంటుంది. మీరు కొంత స్వార్థాన్ని తగ్గించుకొని ఎదుటి వారి కోసం ఆలోచన చేయాలి. మీ తరువాత వారు కారు. ఏ ఆహార పదార్థాలైన ఉన్నవి నలుగురికి పంచి మిగిలినది మీరు తీసుకోండి.

జపం : శ్రీరామ జయరామ జయజయ రామరామ

దానం : అన్నదానం / పాలు / పెరుగు, 2. పళ్ళు /విద్యార్థులకు పుస్తకాలు దానంచేయండి.

6. విద్యాసాగర్‌

ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా?

మీకు ప్రభుత్వ ఉద్యోగం కన్నా కూడా ప్రభుత్వేతర సంస్థలో ఉద్యోగం బావుంటుంది. అందులో మంచి గుర్తింపు వస్తుంది. 2020 జనవరి తర్వాత అన్నిరకాలుగా బావుంటుంది. ప్రస్తుతం సమయం అంత అనుకూలం కాదు.

జపం : శ్రీ రాజమాతంగ్యై నమః, శ్రీరామ జయరామ జయజయ రామరామ మంచిది.

దానం : గోధుమపిండి / గోధుమరవ్వ / చపాతీలు, 2. కూరగాయలు / ఆకుకూరలు/ పెసరపప్పు దానం చేయడం మంచిది.