1. మహేష్‌

భవిష్యత్తు ఎలా ఉంటుంది?

మీకు ప్రస్తుతం సమయం అంత అనుకూలంగా లేదు. 2021 డిసంబర్‌ వరకు కూడా ఇలాగే ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆధ్యాత్మిక చింతన బాగా పెంచుకోవాలి. ప్రతీరోజూ యోగా ప్రాణాయామాలు తప్పనిసరిగా చేసుకోవాలి. అనవసర పెట్టుబడులకు పోకూడదు. కొత్త పనులు ఏవీ ప్రారంభించకూడదు. ఉద్యోగాలు మారడం లాటి ంవి కూడా ఏమీ చేయకూడదు. ప్రస్తుతం ఏదైనా చిన్న ఉద్యోగం ఉన్నా అందులోనే కొనసాగాలి. ఏ నూతన వ్యవహారాలకు అనుకూలం కాదు. మీకు సామాజిక అనుబంధాల్లో ఎప్పికీ ఇబ్బందులే. జాగ్రత్తగా ఉండాలి.

జపం : శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడంమంచిది.

దానం : 1. ఆకుకూరలు/ కాయకూరలు/ పెసరపప్పు / ఆకుపచ్చ వస్త్రాలు, 2. గోధుమపిండి, గోధుమరవ్వ/ 3. ఇడ్లీ / వడ / మినప సున్ని ఉండలు నిరంతరం దానం చేయాలి.

మీరు దానధర్మాలు ఎంత ఎక్కువ చేసుకుంటే అంత మంచిది.

2. మంజూష

విదేశాల్లో స్థిరత్వం ఉన్నదా?

సంతాన వివరాలు, సంతానం ఎంతమంది అనే వివరాలు, సంతానం యొక్క జండర్‌ చెప్పడం జ్యోతిషం రీత్యా  చెప్పడం సరియైనది కాదు. దానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. మీరు ప్రయత్నం చేసుకుంటే విదేశాల్లో స్థిరత్వాన్ని మంచి అవకఆశాలు ఉన్నాయి. మీ ప్రయత్నంపై ఆధారపడి ఉంది.

జపం : శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

దానం : కందిపప్పు/ కర్జూరాలు/ సపోట/ దానిమ్మపళ్ళు దానం చేయడం మంచిది.

3. శివరవితేజ

మీ ప్రశ్న ఏమిటో రాయలేదు.

4. ఎం. నవీన్‌ కుమార్‌

నాకు చాలా సమస్యలున్నాయి? వివాహం కూడా కాలేదు? ఆరోగ్యం సరిగాలేదు?

 మీరు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలపై దృష్టి అధికంగా ప్టోలి. లేకపోతే మీ జీవితంలో మీకు ఎదుగుదల ఉండదు. మీకు అనారోగ్యం కంటే కూడా అనారోగ్య భావన ఉంటుంది. మీకు అనారోగ్యం అంత తొందరగా రాదు. చాలా  పవర్‌ ఉంటుంది. ఇవి అన్నీ కూడా మీరు చేసే మంచి పనులు తక్కువైనందు వలన ఈ లోపాలు ఏర్పడుతున్నాయి. మీరు దానాలు, జపాలు అధికంగా చేసుకుంటూ తప్ప మీ జీవితంలో మంచి మార్పులకు అవకాశం లేదు. మీ జాతక రీత్యా మీకు వివాహం ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంచి సమయాన్ని అనవసరంగా వ్యర్థం చేసుకున్నారు. కాని ప్రస్తుతం మీకు నవంబర్‌ వరకు చాలా అనుకూలమైన సమయం ఉన్నది. ఈ సమయంలో మీరు ఎంతగానో  ప్రయత్నం చేస్తే వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే మళ్ళీ 2023 వరకు మీకు ఏవైనా పనుల్లో స్థిరత్వం కాని వివాహం కాని అయ్యే అవకాశాలు లేవు.

దానం : 1. గోధుమపిండి / గోధుమరవ్వ/ చపాతీలు, 2. ఆకుకూరలు / కూరగాయలు / పెసరపప్పు, 3. నిమ్మకాయ పులిహోర / అలంకరణ వస్తువులు/ 4. అన్నదానం / పాలు / పెరుగు / తెల్లి వస్త్రాలు అధికంగా దానం చేయాలి.

మీరు ఈ 4 వస్తువులలో ఒక్కోదానిలో ఒక్కొక్క వస్తువు ప్రతీరోజూ 8 నుంచి 10 మందికి దానం చేస్తే కాని మీ లోప పూరణ పూర్తికాదు. దాదాపుగా ఆపకుండా చేస్తేనే నవంబర్‌లోపు వివాహం అవుతుంది. తర్వాత మళ్ళీ కూడా ఆపకూడదు.

జపం : శ్రీ రాజమాతంగై ్యనమః; శ్రీరామ జయరామ జయజయ రామరామ

కల్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం

ఈ జపాలు నిరంతరం ఏ పని చేస్తున్నా చేసుకుంటూ ఉండాలి.

మీ జాతకలోపం కాదు, మీ ప్రయత్న లోపం మాత్రమే. ధార్మిక, ధర్మ కార్యక్రమాలు చేయండి అన్ని పనులు సవ్యంగా పూర్తి అవుతాయి.

5. నవీన్‌ కుమార్‌

మీరు ప్రశ్న అడగలేదు.

6. ప్రమోద్‌

ఆర్థిక వ్యవహారాలు ఎలా ఉంటాయి?

సంతాన వివరాలు, సంతానం ఎంతమంది అనే వివరాలు, సంతానం యొక్క జండర్‌ చెప్పడం జ్యోతిషం రీత్యా  చెప్పడం సరియైనది కాదు. దానికి అనేక రకాల కారణాలు ఉంటాయి.

మీరు చేసే అన్ని పనుల్లో నిరాశ నిస్పృహలు అధికంగా ఉంటాయి. శ్రమపడినంత ఆనందం మీరు పొందలేరు.  మీరు చేసే పనుల ద్వారానే మీకు ఇబ్బంది, ఖర్చులు వస్తాయి. ప్రస్తుతం మీకు అక్టోబర్‌ వరకు సమయం అనుకూలంగా ఉంది.  అక్టోబర్‌ తర్వాత నుంచి 2020 జూన్‌ వరకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా. జాగ్రత్త అవసరం.

జపం : శ్రీ రామ జయరామ జయజయ రామరామ

దానం : గోధుమపిండి/ చపాతీలు, 2. ఇడ్లీ/ వడ/ మినప సున్ని ఉండలు దానం చేయడం మంచిది.

మీరు అడిగే ప్రశ్నలు పూర్తిగా స్పష్టంగా ఉండాలి. లేకపోతే జాతకం చెప్పడం కష్టంగా ఉంటుంది. మీ జనన వివరాలు కూడా సరిగా పంపించాలి. తేదీ, సమయం, ప్రదేశం, జిల్లా, నక్షత్రం ఈ వివరాలు అన్నీ పంపగలరు.

డా.ఎస్. ప్రతిభ