Asianet News TeluguAsianet News Telugu

భారత్ లో అతి పెద్ద సూర్యగ్రహణం.. తేదీ సమయం వివరాలు ఇవే..

జ్యోతిషశాస్త్రం ప్రకారం కరోనా వైరస్ గతేడాది డిసెంబరులో ఏర్పడిన సూర్యగ్రహణంతోనే ప్రారంభమైంది. మరి ఈ ఏడాది ఏర్పడనున్న తొలి సూర్యగ్రహణంతో కరోనా ప్రభావం ముగుస్తుందని అంచనా వేస్తున్నారు. 

Solar Eclipse 2020: Will this Surya Grahan be visible in India? Check Date and timings
Author
Hyderabad, First Published Jun 13, 2020, 11:20 AM IST

గ్రహాల ప్రభావం మనుషులపై ఉంటుందని అందరూ నమ్ముతూ ఉంటారు. ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ఎక్కువ గ్రహణాలు వస్తున్నాయని పండితులు చెబుతున్నారు. ఇప్పటికే చంద్రగ్రహణం రెండుసార్లు రాగా... మరికొద్ది రోజుల్లో అతి పెద్ద సూర్య గ్రహణం ఏర్పడనుంది.

జూన్ 21వ తేదీన అతి పెద్ద సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది ఇదే తొలి సూర్యగ్రహణం కావడం గమనార్హం. జ్యోతిషశాస్త్రం ప్రకారం కరోనా వైరస్ గతేడాది డిసెంబరులో ఏర్పడిన సూర్యగ్రహణంతోనే ప్రారంభమైంది. మరి ఈ ఏడాది ఏర్పడనున్న తొలి సూర్యగ్రహణంతో కరోనా ప్రభావం ముగుస్తుందని అంచనా వేస్తున్నారు. 

కాగా.. భారత్ లో ఈ గ్రహణం ఎప్పుడు కనపడనుందో ఇప్పుడు చూద్దాం..

ప్రపంచ వ్యాప్తంగా ఈ సూర్యగ్రహణాన్ని అందరూ వీక్షించవచ్చు. భారత్ లోనూ కొన్ని ప్రదేశాల్లో ఈ గ్రహణాన్ని చూడవచ్చు. ఇది వార్షిక గ్రహణంగా మారనుంది. చంద్రుడు నీడ సూర్యుడిని దాదాపు 99 శాతం కప్పనున్నాడు. ఇలాంటి గ్రహణం ప్రతి 18 ఏళ్లకోసారి వస్తుంది.

సూర్యగ్రహణం జూన్ 21న 10.31 గంటలకు ప్రారంభం కాగా.. మధ్యాహ్నం 2.30 గంటలకు ముగుస్తుంది. పూర్తి ప్రబావం మధ్యాహ్నం 12.18 గంటలకు కనిపించనుంది. దాదాపు 3 గంటల 33 నిమిషాలకు పూర్తి గ్రహణం ఏర్పడనుంది. 

తెలంగాణ రాష్ట్రానికి
గ్రహణ ఆరంభకాలం : ఉదయం  10:14
గ్రహణ మధ్యకాలం : ఉదయం 11: 55 
గ్రహణ అంత్యకాలం : మధ్యహ్నం 1: 44 
గ్రహణ ఆద్యంతం పుణ్య కాలం 3 గంటల 30 నిమిషాలు.

ఆంధ్ర రాష్ట్రానికి
గ్రహణ ఆరంభకాలం : ఉదయం 10: 23 
గ్రహణ మధ్యకాలం : మధ్యహ్నం 12: 05
గ్రహణ అంత్యకాలం : మధ్యహ్నం 1: 51
గ్రహణ ఆద్యంతం పుణ్య కాలం 3 గంటల 28 నిమిషాలు
గ్రహణ నియమాలు.  

Follow Us:
Download App:
  • android
  • ios